సాంఘిక సంక్షేమ శాఖ మంత్రికి ఆ విభాగం ఉద్యోగి బూట్లు తొడిగిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. దళిత క్రైస్తవ బిషప్ ల మొదటి కౌన్సిల్ సమావేశానికి మంత్రి మెరగు నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసేందుకు మంత్రి తన బూట్లను విడిచారు. తిరిగి వేసుకోవడం కష్టం కావడంతో అక్కడే ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ ఉద్యోగి మంత్రికి బూట్లు తొడగడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కూడా అయింది.
Meruga Nagarjuna: ఉద్యోగితో బూట్లు వేయించుకున్న ఏపీ మంత్రి, వీడియో వైరల్
ABP Desam
Updated at:
10 Jul 2023 08:18 PM (IST)
అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసేందుకు మంత్రి తన బూట్లను విడిచారు. తిరిగి వేసుకోవడం కష్టం కావడంతో సాంఘిక సంక్షేమ శాఖ ఉద్యోగి మంత్రికి షూ తొడిగారు.
మంత్రి మేరుగ నాగార్జున రాక సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు