పైనల్‌గా కమ్యూనిస్టులకు గుడ్ న్యూస్


తెలంగాణ సీఎం కేసీఆర్ కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేయాలని ఫైనల్‌గా నిర్ణయించుకున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హుజూరాబాద్ ఉపఎన్నికల సమయంలో కమ్యూనిస్టులతో పొత్తులు పెట్టుకున్నారు. ఆ పార్టీకి ఆ నియోజకవర్గంలో సాలిడ్ ఓటు బ్యాంక్ ఉండటంతో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. అయితే ఆ తర్వాత కమ్యూనిస్టులతో కమ్యూనికేషన్ ను కేసీఆర్ నిలిపివేశారు. ఈ అంశంపై కమ్యూనిస్టుపార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా. అయితే మళ్లీ కేసీఆర్ మనసు మార్చుకున్నారని.. కమ్యూనిస్టులతో పొత్తులకు సిద్ధమవుతున్నారన్న సంకేతాలు వస్తున్నాయి. ఇంకా చదవండి


తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేసిన సీఎం కేసీఆర్


గ్రూప్ 2 అభ్యర్థులు, ప్రతిపక్షాల పోరాటం ఫలించింది. తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ మేరకు ఎగ్జామ్ రీషెడ్యూల్ పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని టీఎస్‌పీఎస్సీతో సంప్రదించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. లక్షలాది మంది అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. ఇంకా చదవండి


రుషికొండపై ఆ నిర్మాణాలు సెక్రటేరియట్ కోసమే - వైఎస్ఆర్ సీపీ సంచలన ప్రకటన


ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. రుషికొండపై రాష్ట్ర సచివాలయ నిర్మాణం చేపడుతున్నట్లుగా తొలిసారిగా స్పష్టం చేసింది. కొండను కొంత మేర తొలిచి అక్కడ ప్రస్తుతం చేస్తున్న నిర్మాణాలు సచివాలయం కోసమే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రకటన చేసింది. అయితే, ఇన్నాళ్లు అక్కడ చేపడుతున్న నిర్మాణాలు గవర్నమెంట్ ఆఫీసుల కోసం కాదని ప్రభుత్వం చెప్పిన సంగతి తెలిసిందే. అక్కడ పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి టూరిస్ట్ ప్రాజెక్టులు చేపడుతున్నామని గతంలో వెల్లడించింది. అయితే, తాజాగా అందుకు భిన్నంగా ఆ నిర్మాణాలు సచివాలయం కోసమే అని చేయడం చర్చనీయాంశం అయింది. ఇంకా చదవండి


వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదే, మెజార్టీపైనే ఫోకస్ చేయండి - సజ్జల పిలుపు


వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని రాష్ర్టంలోని  ప్రజలంతా కోరుకుంటున్నారని వైసీపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి  సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎం వైఎస్ జగన్ పారదర్శకమైన  పరిపాలన పట్ల ప్రజల అభిమానం రోజు రోజుకు పెరుగుతోందన్నారు. ఎవరెన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా వైయస్సార్ సిపి విజయం ఖాయమైందని అయితే ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీ మెజారిటీ పెంచే దిశగా పార్టీ శ్రేణులు పని చేయాలని సజ్జల పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లు, పరిశీలకులు, జేసీఎస్ కో ఆర్డినేటర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సజ్జల రామకృష్ణారెడ్డి క్యాడర్ కు మార్గనిర్దేశం చేశారు. ఇంకా చదవండి


చర్చి భూములూ వదలట్లేదు- ఎవర్నీ వదలబోమన్న పవన్ - సిరిపురంలో ఎంపీ భూముల పరిశీలన !


ఉత్తరాంధ్రలో వారాహి యాత్రలో ఉన్న పవన్ కల్యాణ్ సిరిపురంలోని చర్చి భూములను పరిశీలించారు.  సిరిపురం జంక్షన్ దగ్గర సీబీసీఎన్‌సీ భూములను పవన్ కల్యాణ్ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ CBCNC భూములపై తప్పుడు జీవోలు జారీ చేశారని మండిపడ్డారు. ఐదెకరాల భూమిని వైసీపీ నేతలు ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తున్నారని.. . క్రైస్తవ సంఘాల భూములను సైతం కబ్జా చేస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖలో రౌడీలు, గూండాలు రాజ్యమేలుతున్నారన్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ‘ప్రశాంతమైన విశాఖలో గొడవలు సృష్టిస్తున్నారు. తెలంగాణలో కూడా ఇలాగే దోపిడీ చేశారు. అందుకే తన్ని తరిమేశారు. చట్టాలను అతిక్రమించిన వారికి టీడీఆర్ బాండ్లు ఇచ్చారని ఆరోపించారు. ఇంకా చదవండి


2 గంటల స్పీచ్ లో మణిపూర్ పై కేవలం 2 నిమిషాలేనా? ప్రధాని మోదీపై రాహుల్ విమర్శలు


 కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన పార్లమెంట్ నియోజకవర్గమైన వయనాడ్‌లో పర్యటిస్తున్నారు. నియోజకవర్గంలో రెండు రోజుల పర్యటనను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మణిపూర్‌లో తన పర్యటన గురించి.. అక్కడి భయంకరమైన పరిస్థితిని వివరించారు. మణిపూర్ అల్లర్ల గురించి ప్రధాని నరేంద్ర మోదీ స్పందించిన తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. బీజేపీ విభజన విధానాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా చదవండి


రజనీకాంత్ దూకుడు - 'జైలర్'కు 3 రోజుల్లో బాక్సులు బద్దలయ్యే కలెక్షన్స్


సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) స్టార్‌డమ్, ఇమేజ్ గురించి చెప్పడానికి 'జైలర్' మంచి ఉదాహరణ. ఆయన కథానాయకుడిగా నటించిన 'జైలర్' (Jailer Movie) సినిమాకు బాక్సాఫీస్ బరిలో వస్తున్న వసూళ్లే ఉదాహరణ. రజనీకాంత్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సన్నివేశాలు కొన్ని, ఆయన వీరాభిమానులను సంతృప్తి పరిచే సన్నివేశాలు మరికొన్ని ఉంటే చాలు అని బంపర్ కలెక్షన్స్ గ్యారెంటీ అని చెప్పవచ్చు. ఇంకా చదవండి


రికార్డు క్రియేట్ చేసిన 'పుష్ప 2' ఫస్ట్ లుక్ - అది ఏమిటో తెలుసా?


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పుష్ప 2' (Pushpa 2 Movie). క్రియేటివ్ జీనియస్ సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహిస్తున్నారు. వీళ్ళిద్దరి కలయికలో వచ్చిన పాన్ ఇండియా హిట్ 'పుష్ప'కు సీక్వెల్ ఇది. ఆల్రెడీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఆ లుక్ ఇప్పుడు ఓ అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంకా చదవండి


కొత్త అపాచీ బైక్‌ను లాంచ్ చేయనున్న టీవీఎస్ - సెప్టెంబర్‌లోనే!


టీవీఎస్ మోటార్ నేకెడ్ అపాచీ ఆర్ఆర్ 310 టెస్టింగ్ సమయంలో చాలా సార్లు కనిపించింది. సాధారణంగా టీవీఎస్ కొత్త ఉత్పత్తులను ఎల్లప్పుడూ రహస్యంగా ఉంచుతుంది. అయితే టెస్టింగ్ సమయంలో ఒక బైక్ కనిపిస్తే దాని లాంచ్ త్వరలో జరగనుందని అర్థం. ఇటీవల TVS సెప్టెంబరు 6న కొత్త వాహనాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది మరియు ఇది మార్కెట్లో నేకెడ్ అపాచీ RR 310గా ఉంటుందని భావిస్తున్నారు. ఇంకా చదవండి


సిరీస్ సమం చేసిన టీమిండియా - నాలుగో టీ20లో భారత ఓపెనర్ల విధ్వంసం!


వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను భారత్ సమం చేసింది. నాలుగో టీ20లో తొమ్మిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 178 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం భారత్ 17 ఓవర్లలో వికెట్ నష్టానికి 179 పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో భారత్ సిరీస్‌ను 2-2తో విజయం సాధించింది. ఇంకా చదవండి