Janasena News :  ఉత్తరాంధ్రలో వారాహి యాత్రలో ఉన్న పవన్ కల్యాణ్ సిరిపురంలోని చర్చి భూములను పరిశీలించారు.  సిరిపురం జంక్షన్ దగ్గర సీబీసీఎన్‌సీ భూములను పవన్ కల్యాణ్ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ CBCNC భూములపై తప్పుడు జీవోలు జారీ చేశారని మండిపడ్డారు. ఐదెకరాల భూమిని వైసీపీ నేతలు ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తున్నారని.. . క్రైస్తవ సంఘాల భూములను సైతం కబ్జా చేస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖలో రౌడీలు, గూండాలు రాజ్యమేలుతున్నారన్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ‘ప్రశాంతమైన విశాఖలో గొడవలు సృష్టిస్తున్నారు. తెలంగాణలో కూడా ఇలాగే దోపిడీ చేశారు. అందుకే తన్ని తరిమేశారు. చట్టాలను అతిక్రమించిన వారికి టీడీఆర్ బాండ్లు ఇచ్చారని ఆరోపించారు. 


విశాఖలో వైసీపీ నేతల కబ్జాలు పెరిగిపోయాయన్న పవన్ 


సీబీసీఎన్‌సీ భూముల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. క్రిస్టియన్ ట్రస్ట్‌కు చెందిన ఈ వివాదాస్పద భూములను, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు. ప్రభుత్వానికి చె౦దాల్సిన భూములను ఎంపీ అధికార బలంతో చేజిక్కించుకొని నిర్మాణాలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీని వెనక కోట్ల రూపాయలు చేతులు మారాయి అరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ భూములను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఉత్తరాంధ్రలో వైకాపా నేతలు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు.  


విశాఖ నుంచి పారిపోతామని ఎంపీ చెప్పడం సిగ్గుచేట


 ఇక్కడి నుంచి పారిపోతామని చెప్పడం విశాఖ ఎంపీకి తగదు. ఎక్కడికో వెళ్లి వ్యాపారం చేస్తానని ఎంపీ చెప్పడం సిగ్గుచేటని పవన్  విమర్శించారు. . విశాఖ ప్రజలు ఓటేస్తేనే ఎంవీవీ ఎంపీ అయ్యారు. చర్చి ఆస్తులను అడ్డగోలుగా దోచేస్తున్నారు. సీఎంవోలోనే దొంగ సంతకాలు చేయడం దారుణం. ప్రశాంతమైన విశాఖ నగరాన్ని వైకాపా నేతలు చెడగొట్టేస్తున్నారు. హైదరాబాద్‌లో కూడా ఈ వర్గమంతా ఇలానే దోపిడీ చేస్తే.. అక్కడనుంచి తరిమేశారు. సింహాచలం భూములు, చర్చి స్థలాలు అడ్డగోలుగా దోచేస్తున్నారు. ఇదే తరహాలో దోపిడీ కొనసాగితే ఉత్తరాంధ్ర డంపింగ్‌ యార్డులా అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 


ఏయూ విద్యార్థులు ఉద్యమించాలని పవన్ పిలుపు 


స్థలాలన్నీ బయటవారికి వెళ్లిపోతాయని.. విశాఖ ప్రజలు ఆలోచించుకోవాలని  పవన్ సలహా ఇచ్చారు. ఉత్తరాంధ్ర యువత, ఏయూ వర్సిటీ విద్యార్థులు దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. తెలంగాణ కోసం ఉస్మానియా వర్సిటీ విద్యార్థులు పోరాడిన విధంగానే మీరూ పోరాడాలి. ఏయూ వైకాపా నేతలకు అడ్డాగా మారకుండా చూడాలని పిలుపునిచ్చారు.  ఐఏఎస్‌, ఏపీఎస్‌ అధికారులు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వారు. మీరు ప్రజల ఆస్తులను కాపాడాలి. అధికార పార్టీ నేతల బెదిరింపులకు భయపడొద్దని  సూచించారు. 


కేంద్రం దృష్టిలో విశాఖ విషయాలు


విశాఖకు సంబంధించిన అన్ని విషయాలు కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని  పవన్ స్పష్టం చేశారు.  దేశ భద్రతకు చాలా కీలకమైనది విశాఖ నగరం. సీఎం జగన్‌కు కూడా చెబుతున్నా.. మీరు ఎన్ని అక్రమాలు చేశారో.. ఏ విధంగా ఉత్తరాంధ్రను దోపిడీ చేస్తున్నారో.. ఎలాగైతే స్థలాలను కబ్జా చేస్తున్నారో.. అన్నింటినీ బయటకు తీసుకొస్తామన్నారు.   ఏపీలో ప్రభుత్వం మారిన వెంటనే మీరు కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి అని పవన్ హెచ్చరికలు జారీ చేశారు.