TVS Apache RR 310: టీవీఎస్ మోటార్ నేకెడ్ అపాచీ ఆర్ఆర్ 310 టెస్టింగ్ సమయంలో చాలా సార్లు కనిపించింది. సాధారణంగా టీవీఎస్ కొత్త ఉత్పత్తులను ఎల్లప్పుడూ రహస్యంగా ఉంచుతుంది. అయితే టెస్టింగ్ సమయంలో ఒక బైక్ కనిపిస్తే దాని లాంచ్ త్వరలో జరగనుందని అర్థం. ఇటీవల TVS సెప్టెంబరు 6న కొత్త వాహనాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది మరియు ఇది మార్కెట్లో నేకెడ్ అపాచీ RR 310గా ఉంటుందని భావిస్తున్నారు.
కొత్త బైక్ ఎలా ఉంది?
స్పై షాట్‌లలో చూసినట్లుగా నేకెడ్ టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 స్టైలింగ్ బీఎండబ్ల్యూ జీ 310 ఆర్ కంటే చాలా భిన్నంగా ఉంటుందని స్పష్టంగా తెలుస్తుంది. ఇది కేటీయం డ్యూక్ 1290 సూపర్ డిజైన్‌ను గుర్తు చేస్తుంది. టెయిల్ సెక్షన్ నంబర్ ప్లేట్, ఇండికేటర్‌లతో పాటు పెద్ద టైర్ హగ్గర్‌తో క్లీన్ డిజైన్‌ను పొందుతుంది. ఈ బైక్ ఎగ్జాస్ట్ ప్రస్తుత ఆర్ఆర్ 310కి చాలా దగ్గరగా ఉంటుంది. దీని కారణంగా ఇంజన్ కూడా అదే విధంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇది ఎక్స్ లిక్విడ్ కూల్డ్ 312సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను పొందుతుంది. 34 హెచ్‌పీ శక్తిని, 27.3 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ప్రస్తుతానికి ఫైనల్ ప్రొడక్ట్‌గా ఏ పేరుతో విడుదల చేయాలనేది ఇంకా నిర్ణయించలేదు. ఇటీవల టీవీఎస్ అపాచీ ఆర్టీఎక్స్ పేరును ట్రేడ్‌మార్క్ చేసింది. త్వరలో రాబోయే ఈ బైక్‌లో దీన్ని ఉపయోగించవచ్చు. లాంచ్ ఇంకా నెల లోపే ఉంది కాబట్టి త్వరలో మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
వేటితో పోటీ పడుతుంది?
నేకెడ్ టీవీఎస్ ఆర్ఆర్ 310 ఇటీవల లాంచ్ అయిన ట్రయంఫ్ స్పీడ్ 400తో పోటీ పడవచ్చు. ట్రయంఫ్ స్పీడ్ 400 బైక్ ఒక వేరియంట్, మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. భారతదేశంలో ట్రయంఫ్ స్పీడ్ 400 ధర రూ.2,33,000 నుండి ప్రారంభమవుతుంది. ట్రయంఫ్ స్పీడ్ 400 బైక్‌లో 398.15 సీసీ బీఎస్6 ఇంజిన్‌ను అందించారు. ఇది 39.5 బీహెచ్‌పీ పవర్‌ని, 37.5 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ముందు, వెనుక రెండింటిలోనూ డిస్క్ బ్రేక్‌తో కూడిన యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను పొందుతుంది. దీని బరువు 176 కిలోలు కాగా, 13 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యం కలిగి ఉంది.
మరోవైపు హ్యుందాయ్ మోటార్ ఇండియా తన కొత్త సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎక్స్‌టర్ కోసం బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కారు 50,000 బుకింగ్‌ల మార్కును దాటినట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 5.99 లక్షల నుంచి (ఎక్స్ షోరూం) ప్రారంభం కానుంది. జూలై 10వ తేదీన ఈ కారు భారతీయ మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయింది. కొంతమంది డీలర్లు తెలుపుతున్న దాని ప్రకారం ఈ కారు వెయిటింగ్ పీరియడ్ ప్రస్తుతానికి 12 వారాల వరకు ఉంది. డిమాండ్‌ను బట్టి ఈ వెయిటింగ్ పీరియడ్ ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial