మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా 'టైగర్ నాగేశ్వర రావు' (Tiger Nageswara Rao Movie). వంశీ దర్శకుడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ చిత్ర సమర్పకులు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... సినిమా టీజర్ విడుదలకు ముహూర్తం ఖరారు అయ్యింది. 


ఆగస్టు 17న 'టైగర్...' టీజర్!
Tiger Nageswara Rao Teaser : ఈ నెల (ఆగస్టు) 17న... అంటే వచ్చే గురువారం 'టైగర్ నాగేశ్వర రావు' టీజర్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అనౌన్స్ చేసింది. Tiger’s Invasion పేరుతో టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. 'కశ్మీర్‌ ఫైల్స్‌', 'కార్తికేయ 2' సినిమాలతో పాన్‌ ఇండియా స్థాయిలో అభిషేక్‌ అగర్వాల్‌ సంస్థ భారీ విజయాలు అందుకుంది. అందుకని, 'టైగర్‌ నాగేశ్వర రావు' సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. హిస్టారికస్‌ సినిమా కావడం కూడా సినిమా ప్లస్‌ పాయింట్‌. 


Also Read : బాక్సాఫీస్ బరిలో బోల్తా కొట్టిన 'భోళా శంకర్' - మొదటి రోజు కలెక్షన్లు సంక్రాంతి హిట్‌లో సగమే?






విజయ దశమి కానుకగా అక్టోబర్ 20న సినిమా విడుదల కానుంది. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా విడుదల వాయిదా పడిందని వార్తలు రాగా... అవి అవాస్తమని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థ తెలిపింది. ''టైగర్‌ నాగేశ్వరరావు అక్టోబర్ 20న విడుదల కావడం లేదని ఎటువంటి ఆధారాలు లేని ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. ఎటువంటి వదంతులను నమ్మవద్దు. అక్టోబరు 20 నుంచి బాక్సాఫీస్ బరిలో టైగర్ వేట పార్రంభం అవుతుంది. ప్రేక్షకులకు గొప్ప అనుభూతి ఇవ్వడానికి మా చిత్ర బృందం కృషి చేస్తోంది" అని ఓ ప్రకటనలో తెలిపారు.


Also Read 'ఉస్తాద్' రివ్యూ : హీరోగా, నటుడిగా కీరవాణి కుమారుడు శ్రీ సింహా హిట్టు - మరి, సినిమా?



దసరా బరిలో మరో రెండు సినిమాలు
విజయ దశమికి నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'భగవంత్ కేసరి' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ సినిమా విడుదల అక్టోబర్ 19న. అదే రోజున తమిళ స్టార్ హీరో విజయ్, 'విక్రమ్' దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలయికలో రూపొందుతోన్న 'లియో' సినిమా విడుదల కూడా!


రాజమండ్రిలోని ఐకానిక్ హేవ్‌ లాక్ బ్రిడ్జ్ (గోదావరి)పై 'టైగర్ నాగేశ్వర రావు' ఫస్ట్ లుక్ పోస్టర్, కాన్సెప్ట్ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా టీజర్‌ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నాయకుడు కిషన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తదితరుల సమక్షంలో ఈ ఏడాది ఉగాదికి పూజా కార్యక్రమాలతో సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. 


'టైగర్ నాగేశ్వరరావు' (Tiger Nageswara Rao Biopic)లో రవితేజకు జోడీగా బాలీవుడ్ భామ నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటించనున్నారు. 1970లలో దక్షిణ భారతంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా, స్టువర్టుపురం నాగేశ్వరరావు కథతో రూపొందిస్తున్న చిత్రమిది. ఈ చిత్రానికి కెమెరా: ఆర్. మది, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar), ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, డైలాగ్ రైటర్: శ్రీకాంత్ విస్సా, సహ నిర్మాత: మయాంక్ సింఘానియా.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial