Jailer OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘జైలర్’, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం ‘జైలర్’. ఆగష్టు 10న విడుదలైన ఈ చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. త్వరలోనే ఈ మూవీ ఓటీటీలోకి రాబోతోంది.

Continues below advertisement

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘జైలర్’. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తమిళ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించింది. ఆగష్టు 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఇందులో తమన్నా,   జాకీష్రాఫ్‌, మోహన్‌ లాల్‌, శివరాజ్‌ కుమార్‌, సునీల్‌, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ మరో కీలక పాత్రలో నటించింది. చాలా కాలం తర్వాత రజనీకాంత్ సినిమాలో రమ్యకృష్ణ నటించడం బాగా కలిసి వచ్చింది. వెండితెరపై రజనీకాంత్ - రమ్యకృష్ణ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో మరోసారి రమ్యకృష్ణ - రజనీకాంత్ కాంబినేషన్ ని తెరపై చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ మూవీ సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో రన్ అవుతోంది. తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్ లభించింది. వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది.

Continues below advertisement

‘జైలర్’ ఓటీటీ హక్కులు దక్కించుకున్న సన్‌ నెక్ట్స్

ఈ సినిమా కథ టైగర్ ముత్తువేల్ పాండియన్ (రజినీకాంత్) అనే రిటైర్డ్ జైలర్ చుట్టూ తిరుగుతుంది.  తప్పిపోయిన తన కొడుకు అర్జున్ (వసంత్ రవి) కోసం వెతికే క్రమంలో ఎలాంటి ఊహించని ఘటనలు ఎదురయ్యాయి? అనేది ఈ చిత్రంలో చూపించారు దర్శకుడు. ఇక ఈ సూపర్ హిట్ సినిమాకు సంబంధించి మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. థియేటర్లలో అద్భుత ఆదరణ దక్కించుకున్న ఈ సినిమా త్వరలో ఓటీటీలో విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీని ఓ దిగ్గజ ఓటీటీ సంస్థ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ‘జైలర్’ చిత్రానికి సంబంధించిన  డిజిటల్ హక్కులను పొందేందుకు పలు సంస్థలు  పోటీ పడ్డాయి. సన్ పిక్చర్స్ అనుబంధ సంస్థ సన్‌ నెక్ట్స్ OTT హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన వెలువడకపోయినా, సినిమా పరిశ్రమలో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అనే విషయంపై క్లారిటీ వచ్చింది.  సుమారు నెలన్నర తర్వాత సినిమా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  

అంతగా ఆకట్టుకోని 'అన్నాత్తే' మూవీ

కాగా రజనీకాంత్ చివరగా నటించిన 'అన్నాత్తే' మూవీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. సిస్టర్ సెంటిమెంట్ తో మాస్ డైరెక్టర్ శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా కీర్తి సురేష్ ఈ సినిమాలో రజనీకాంత్ కి చెల్లెలిగా నటించింది. నయనతార, మీనా, కుష్బూ కీలకపాత్రలు పోషించారు. తెలుగులోనూ ఈ సినిమా 'పెద్దన్నయ్య' అనే పేరుతో విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి.

Read Also: ఇంగ్లీష్ వెర్షన్ లోనూ ‘సలార్’ విడుదల- త్వరలో అధికారిక ప్రకటన!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement