బాపట్లలో ఓ సంచలన సృష్టించే కేసు రిజిస్టర్ అయింది. ఎస్సైగా ఉండే వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. తన వీడియోలను కూడా చూపించి బెదిస్తున్నాడని అందులో పేర్కొంది. రాష్ట్రంలోనే ఇదో సంచలనంగా మారిపోయింది.
బాపట్ల జిల్ల అద్దంకి పోలీసు స్టేషన్‌కు ఓ యువతి వచ్చి ఫిర్యాదు ఇచ్చింది. తనపై ఎస్సై అత్యాచారం చేశాడని పోలీసులు కంప్లైంట్ ఇచ్చింది. ఆమె చెప్పిన వివరాల విన్న పోలీసులే షాక్ తిన్నారు.
యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సైపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. సీఐ రమేష్ బాబు మాట్లాడుతూ.. నిందితుడు గతంలో అద్దంకి పరిధిలో ఉన్న పోలీసు స్టేషన్‌లో ఎస్సైగా పని చేశాడు. ఆ టైంలోనే యువతికి దగ్గరైనట్టు చెబుతున్నారు.
ఎస్సైగా పని చేసిన టైంలో యువతికి పరిచయం ఏర్పడింది. కొంతకాలం వారిద్దరూ స్నేహంగా మాట్లాడుకున్నారు. ఆ సమయంలో యువతితో చాలా ప్రేమగా ఉండేవాడని తెలిపారు. క్లోజ్‌గా ఉండటంతో యువతి కూడా అతనిపై పూర్తి నమ్మకంతో మెలిగిందని ఫిర్యాదులో పేర్కొన్నట్టు వివరించారు.
ఒకరోజు సడెన్‌గా తన పుట్టిన రోజు అంటు చెప్పాడు. విష్ చేస్తే ఇంట్లో పుట్టిన రోజు వేడుక ఉందని చెప్పి తనను పిలిచినట్టు యువతి ఆరోపిస్తోంది. ఆ పార్టీ పేరుతో ఆమె వచ్చాక డ్రింక్ ఇచ్చాడని అందులో మత్తు మందు కలిపినట్టు పేర్కొంది.
మత్తుమందు ఇచ్చి స్ప్రహ తప్పి పడిపోయిన తర్వాత తనపై అత్యాచారం చేశాడని, వాటిని సీక్రెట్‌గా రికార్డు చేసినట్టు కంప్లైంట్‌లో తెలిపిందా యువతి. వాటిని పెట్టుకొని బెదిరిస్తున్నట్లు ఆమె అధికారులకు తెలిపింది. ఇదంతా జరిగిన తరువాత తనను పెళ్లి చేసుకోమని అడగ్గా.. చంపేస్తానని హెచ్చరిస్తున్నట్టు ఆమె పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.