'భోళా శంకర్' (Bhola Shankar Movie) మీద ముందు నుంచి మెగా అభిమానుల్లో అంచనాలు లేవు. తమిళంలో ఎనిమిదేళ్ళ క్రితం వచ్చిన అజిత్ 'వేదాళం' రీమేక్ కావడం అందుకు ఓ కారణం అయితే... చిత్రానికి మెహర్ రమేష్ (Meher Ramesh) దర్శకుడు కావడం ముఖ్యమైన కారణం అని చెప్పాలి. పాటలు, ప్రచార చిత్రాలు... ఏవీ సినిమాపై ఆసక్తి కలిగించలేదు. అయితే... అభిమానుల్లో ఏదో ఆశ. చిరంజీవి ఉన్నారని! ఆ ఆశలు మొదటి ఆటకు పరార్ అయ్యాయి.
మొదటి ఆట నుంచి నెగిటివ్ టాక్
Bhola Shankar Talk : 'భోళా శంకర్'కు మొదటి ఆట నుంచి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. హార్డ్ కోర్ ఫ్యాన్స్ సైతం సినిమా బాలేదని పెదవి విరిచారు. రివ్యూ రైటర్లు సైతం భోళా భాయ్ డిజప్పాయింట్ చేశారని పేర్కొన్నారు. ఒక్కసారి టాక్ స్ప్రెడ్ అయ్యాక... టికెట్ సేల్స్ తగ్గాయి. కలెక్షన్స్ దగ్గర కూడా అది క్లియర్‌గా కనిపించింది.
'వాల్తేరు వీరయ్య'లో 'భోళా శంకర్'కు సగమే?
Bhola Shankar First Day Collection : 'భోళా శంకర్' మొదటి రోజు రూ. 33 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. 'వాల్తేరు వీరయ్య'తో పోలిస్తే... సగమే అని టాక్. చిత్ర బృందం 33 కోట్లు అంటే... 'భోళా శంకర్' సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 28 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ఇంత తక్కువ ఓపెనింగ్ రావడం తొలిసారి అని చెప్పాలి. 'వాల్తేరు వీరయ్య'కు రూ. 49.10 కోట్లు, 'గాడ్ ఫాదర్'కు రూ. 32.70 కోట్లు, 'ఆచార్య'కు రూ. 52 కోట్లు, 'గాడ్ ఫాదర్'కు రూ. 32.70 కోట్లు, 'సైరా నరసింహా రెడ్డి' చిత్రానికి రూ. 85 కోట్లు, 'ఖైదీ నంబర్ 150'కి రూ. 50.50 కోట్లు వచ్చాయి. ఇప్పుడీ 'భోళా శంకర్' రూ. 28 కోట్లతో సరిపెట్టుకుంది. షేర్ విషయానికి వస్తే... రూ. 15.38 కోట్లు అని టాక్.
Also Read : మెహర్ 'భోళా' దెబ్బకు పెరిగిన 'జైలర్' టికెట్ సేల్స్!
'భోళా శంకర్' వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ మొత్తాన్ని సుమారు రూ. 80 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. బ్రేక్ ఈవెన్ కావాలంటే... దానికి కనీసం ఒక్క కోటి ఎక్కువ షేర్ రాబట్టాలి. అంటే... మినిమమ్ 81 కోట్ల రూపాయల షేర్ రావాలి. ఎలా లేదన్నా 130, 140 కోట్ల రూపాయల గ్రాస్ రావాలి. ప్రజెంట్ ట్రెండ్ చూస్తే... అంత రావడం కష్టంగా కనబడుతుంది.
Also Read : 'ఉస్తాద్' రివ్యూ : హీరోగా, నటుడిగా కీరవాణి కుమారుడు శ్రీ సింహా హిట్టు - మరి, సినిమా?
తమన్నా కథానాయికగా, కీర్తీ సురేష్ సోదరిగా, సుశాంత్ కీలక పాత్రలో నటించిన 'భోళా శంకర్' సినిమాలో రఘు బాబు, మురళీ శర్మ, రవి శంకర్, 'వెన్నెల' కిశోర్, తులసి, సురేఖా వాణి, శ్రీముఖి, 'హైపర్' ఆది, రష్మీ గౌతమ్, ప్రదీప్, బిత్తిరి సత్తి, సత్య, 'గెటప్' శ్రీను, వేణు టిల్లు (బలగం దర్శకుడు వేణు ఎల్దండి), 'తాగుబోతు' రమేష్, ఉత్తేజ్, తరుణ్ అరోరా తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి కథా పర్యవేక్షణ : సత్యానంద్, మాటలు : తిరుపతి మామిడాల, పాటలు : రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, శ్రీమణి, సిరాశ్రీ.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial