Horoscope Today 2023 August 13th


మేష రాశి
ఈ రాశివారికి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు పరీక్షలలో మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. స్నేహితులతో సామరస్యాన్ని కాపాడుకోండి. పనికిరాని చర్చలకు దూరంగా ఉండండి. క్షణికావేశం వీడండి. ప్రారంభించిన పనులకు ఉత్సాహంగా పూర్తిచేస్తారు. కోపం తగ్గించుకుంటే మంచిది.  రుచికరమైన ఆహారం పట్ల ఆసక్తి ఉంటుంది.


వృషభ రాశి
ఈ రాశివారి మనస్సులో ప్రతికూల ప్రభావం ఉంటుంది. మానసిక ప్రశాంతతను కాపాడుకునేందుకు ప్రయత్నించండి. పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కోపం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే సరైన సమయం. కుటుంబానికి దూరంగా వెళ్లాల్సి రావొచ్చు. సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. 


మిథున రాశి
చదువుపై ఆసక్తి పెరుగుతుంది. పరిశోధన పనులపట్ల ఆసక్తి ఉంటుంది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే అవకాశాలున్నాయి. కుటుంబ సమస్యలు తగ్గుతాయి, సంతోషంగా ఉంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. సోదర సోదరీమణుల సపోర్ట్ లభిస్తుంది.


Also Read: కన్యారాశిలో కుజుడి సంచారం, ఈ రాశులవారికి గుడ్ టైమ్!


కర్కాటక రాశి 
ఈ రాశివారు సంతోషంగా కనిపిస్తారు కానీ ఏదో తెలియని భయం మనసులో ఉంటుంది. సంభాషణలో సమతుల్యతను కాపాడుకోవాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. స్నేహితులతో సామరస్యాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. పనికిరాని చర్చలకు దూరంగా ఉండండి. మానసిక ప్రశాంతత ఉంటుంది. కుటుంబ పెద్దల నుంచి ధనం పొందే అవకాశం ఉంది. స్నేహితుల సహకారంతో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. రుచికరమైన ఆహారం పట్ల ఆసక్తి పెరుగుతుంది. 


సింహ రాశి 
ఈ రాశివారు ఈ రోజు ఏదో విషయంలో ఆలోచనలో పడతారు. స్నేహితుడి నుంచి వ్యాపార ప్రతిపాదనను పొందవచ్చు. మతపరమైన పనులలో బిజీగా ఉంటారు. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు. ఉద్యోగ వ్యవహారాల్లో భాగంగా ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఎన్ని పనులు చేస్తున్నప్పటికీ రోజంతా గందరగోళంగా అనిపిస్తుంది. ఆత్మవిశ్వాసం సడలనివ్వకండి. 


కన్యా రాశి
ఈ రాశివారు సహనాన్ని కోల్పోవద్దు. ఉద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది. ఆదాయానికి మంచిన ఖర్చులు ఇబ్బందిపెడతాయి. తల్లి కారణంగా సంతోషంగా ఉంటారు. పుణ్యస్థల సందర్శనకు వెళ్లేందుకు ప్రణాళికలు వేస్తారు. ఈ రాశి విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. రచన-మేధోపరమైన పనులు సంపాదనకు మార్గంగా మారతాయి.


తులా రాశి
ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆదాయం,  ఖర్చులు రెండూ పెరుగుతాయి. వ్యాపారం విస్తరించేందుకు ప్లాన్ చేస్తారు. అనారోగ్యం పాలవుతారు. మనసులో ఏదో నిరుత్సాహం, అసంతృప్తి ఉంటుంది. ప్రారంభించిన పనులకు స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది. 


వృశ్చిక రాశి
ఈ రాశివారి మనసులో ఏదో నిరుత్సాహం ఉంటుంది. ఉద్యోగులకు  కార్యాలయంలో ఇబ్బందులు ఉండవచ్చు. అవసరమైన సమయంలో స్నేహితుల నుంచి సహాయం పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు కూడా బాగా ఉంటాయి. మానసిక ప్రశాంతత కోసం కృషి చేయండి.  వ్యాపారంలో సమస్యలు ఎదురుకావొచ్చు. దూర ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు మెరుగుపడతాయి.


ధనుస్సు  రాశి
ఈ రాశివారు వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. తలపెట్టిన పనుల్లో అప్రమత్తంగా ఉండాలి. స్నేహితుడితో కలసి విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. తోబుట్టువుల నుంచి మద్దతు లభిస్తుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. నూతన ఆస్తి కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు వేసుకుంటారు.


మకర రాశి
విద్యార్థులకు కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. స్నేహితుల సహాయంతో ఉద్యోగం పొందుతారు. ఆదాయం మెరుగుపడుతుంది. మాటల్లో మాధుర్యాన్ని కోల్పోవద్దు. తండ్రి నుంచి ధనం పొందే అవకాశం ఉంది. రచనారంగంలో ఉండేవారు మంచి ఫలితాలు పొందుతారు. ఆదాయం మెరుగుపడుతుంది. ప్రారంభించిన పనులకు కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. మనసులో నిరుత్సాహం, అసంతృప్తి నెలకొంటాయి.


Also Read: సౌభాగ్యం, సత్సంతానం కోసం వివాహితలు ఆచరించే నోము ఇది!


కుంభ రాశి
ఈ రాశివారు ఈ రోజు ఆహ్లాదంగా గడుపుతారు. జీవిత భాగస్వామి కారణంగా సంతోషంగా ఉంటారు. వ్యాపారాల్లో లాభాలుంటాయి. సంగీతంపై ఆసక్తి పెరుగుతుంది. మానసిక ప్రశాంతతను నిలుపుకోండి. కొన్ని సందర్భాల్లో మితిమీరిన కోపం ప్రదర్శిస్తారు. ఫలితంగా సంతోషకరమైన వాతావరణం దెబ్బతింటుంది. విద్యార్థుల చదువుపై శ్రద్ధ పెడతారు. 


మీన రాశి
ఈ రాశివారికి కన్నవారి నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఉద్యోగంలో అధికారుల సహకారం ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్నేహితుల మద్దతు లభిస్తుంది.  పరిస్థితులు మెరుగుపడతాయి. వ్యాపారం పుంజుకుంటుంది. ఎక్కువ కష్టపడతారు కానీ అంతకు మించిన లాభాలుంటాయి. దాంపత్య సంతోషం ఉంటుంది. ఏదో విషయంలో చికాకుగా ఉంటారు.