సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) స్టార్‌డమ్, ఇమేజ్ గురించి చెప్పడానికి 'జైలర్' మంచి ఉదాహరణ. ఆయన కథానాయకుడిగా నటించిన 'జైలర్' (Jailer Movie) సినిమాకు బాక్సాఫీస్ బరిలో వస్తున్న వసూళ్లే ఉదాహరణ. రజనీకాంత్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సన్నివేశాలు కొన్ని, ఆయన వీరాభిమానులను సంతృప్తి పరిచే సన్నివేశాలు మరికొన్ని ఉంటే చాలు అని బంపర్ కలెక్షన్స్ గ్యారెంటీ అని చెప్పవచ్చు. 


మూడు రోజుల్లో 200 కోట్లురజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన 'జైలర్'కు పూర్తి స్థాయిలో తమిళనాడులో హిట్ టాక్ లభించింది. తెలుగులో, ఇతర రాష్ట్రాల్లో అబౌవ్ ఏవరేజ్ టు హిట్ టాక్ వచ్చింది. అయితే... రజనీ అద్భుతంగా యాక్ట్ చేశారని పేరు రావడంతో అభిమానులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. దాంతో మూడు రోజుల్లో సినిమా 200 కోట్ల మార్క్ చేరుకుంది. 


Jailer Enters 200 Crore Club : 'జైలర్'కు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 91 కోట్ల గ్రాస్ లభించింది. తెలుగులో అయితే 12 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. ఇక, రెండో రోజు అయితే... వరల్డ్ వైడ్ సుమారు 53 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. దాంతో రెండు రోజుల్లో 140 కోట్ల మార్క్ చేరుకుంది. సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో శనివారం థియేటర్లు అన్నీ కళకళలాడాయి. గేట్ల బయట హౌస్ ఫుల్ బోర్డులు పెట్టారు. లాంగ్ వీకెండ్ కూడా కలిసి వచ్చింది. సినిమా విడుదలైన గురువారం కంటే శనివారం ఎక్కువ కలెక్షన్లు వచ్చాయని... శనివారం 60 కోట్ల రూపాయల షేర్ అందుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. శనివారంతో సినిమా 200 కోట్ల క్లబ్‌లో చేరిందని టాక్. 


'జైలర్'కు మరో మూడు రోజులు బాక్సాఫీస్ బరిలో భారీ వసూళ్లు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆదివారం, ఆ తర్వాత నేషనల్ హాలిడే అయిన ఆగస్టు 15న కూడా భారీ వసూళ్లు రావచ్చు.


Also Read : మెహర్ 'భోళా శంకర్' దెబ్బకు పెరిగిన 'జైలర్' టికెట్ సేల్స్!


'జైలర్' ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగింది.తమిళనాట 'జైలర్'ను రూ. 62 కోట్లకు అమ్మారు. అక్కడ సూపర్ స్టార్ ఇమేజ్ ఇంపాక్ట్ చూపించింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 కోట్ల బిజినెస్ జరిగింది. కర్ణాటక రూ. 10 కోట్లు, కేరళ రూ. 5.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియా రూ. 3 కోట్లు, ఓవర్సీస్ రూ. 30 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగాయి. వరల్డ్ వైడ్ 'జైలర్' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 122.50 కోట్లు జరిగాయి. 


Also Read : 'జైలర్' సినిమా రివ్యూ : రజనీకాంత్ సినిమా హిట్టా? ఫట్టా?


'జైలర్' కొన్న డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రావాలి, బ్రేక్ ఈవెన్ కావాలి అంటే... ఎలా లేదన్నా 124 కోట్ల రూపాయల షేర్ రాబట్టాలి. ఇప్పటి వరకు రూపో. 70 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. ప్రస్తుతం బాక్సాఫీస్ బరిలో రజనీకాంత్ దూకుడు చూస్తుంటే... 150 షేర్ ఈజీగా వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  తెలుగులో సినిమాను కేవలం 12 కోట్లకు కొన్నారు. మొదటి రెండు రోజుల్లో సుమారు 10 కోట్ల రూపాయల షేర్ లభించింది. మిగతా రెండు కోట్లు శనివారం వచ్చింది. ఇకపై వచ్చేవన్నీ లాభాలే. 



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial