ఏఆర్ రెహమాన్ (AR Rahman)... ఇది కేవలం ఒక పేరు మాత్రమే కాదు, భారతీయ సంగీతానికి చిరునామాల్లో ఒకటి. సంగీతంలో దేశానికి తొలి ఆస్కార్ తీసుకొచ్చిన ఘనత ఆయనది. ఆస్కార్ అందుకున్న తొలి భారతీయ మ్యూజిక్ డైరెక్టర్ సైతం ఆయనే. చెన్నైలో వర్షం ఆయన అభిమానులకు నిరాశ కలిగించింది. పూర్తి వివరాల్లోకి వెళితే... 


సంగీత దర్శకుడిగా 30 ఏళ్ళు
సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ప్రయాణం ప్రారంభమై 30 ఏళ్ళు. ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం తీసిన 'రోజా'తో ఆయన చిత్రసీమకు పరిచయం అయ్యారు. ఆ సినిమా ఆగస్టు 15, 1992లో విడుదలైంది. ఈ సందర్భంగా చెన్నైలో ఈ రోజు మ్యూజికల్ కాన్సర్ట్ ఏర్పాటు చేశారు. అయితే, అది వర్షాల కారణంగా జరగడం లేదు. వర్షం కారణంగా ఈవెంట్ నిర్వహించాలని అనుకున్న ప్రాంగణం అంతా బురద బురద అయ్యింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన రెహమాన్... త్వరలో మళ్ళీ క్యాన్సర్ట్ నిర్వహిస్తామని తెలిపారు. 


అభిమానుల ఆరోగ్యం, సేఫ్టీ దృష్టిలో పెట్టుకుని... 
''మై డియర్ ఫ్రెండ్స్... వర్షాలు, వాతావరణ పరిస్థితులను చూసి, అభిమానులతో పాటు స్నేహితుల ఆరోగ్యం & సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని మ్యూజిక్ కాన్సర్ట్ రీ షెడ్యూల్ చేయడమే మంచిదని అధికారులు సలహా ఇచ్చారు. సంబంధిత అధికారుల సూచనలను స్వీకరించి వాయిదా వేశాం. త్వరలో మ్యూజిక్ కాన్సర్ట్ ఎప్పుడు నిర్వహించేది చెబుతాం'' అని రెహమాన్ ట్వీట్ చేశారు.


Also Read బాక్సాఫీస్ బరిలో బోల్తా కొట్టిన 'భోళా శంకర్' - మొదటి రోజు కలెక్షన్లు సంక్రాంతి హిట్‌లో సగమే?









 
మ్యూజిక్ కాన్సర్ట్ క్యాన్సిల్ అయిన సందర్భంగా అభిమానులు సైతం విచారం వ్యక్తం చేశారు. క్యాన్సిల్ కావడం వల్ల అందరి కంటే రెహమాన్ ఎక్కువ డిజప్పాయింట్ అయ్యి ఉంటారని ఓ అభిమాని ట్వీట్ చేయగా... 'మంచి వాళ్లకు వివరించాల్సిన అవసరం లేదు. లవ్ యు' అని రెహమాన్ బదులు ఇచ్చారు. అన్నిటి కంటే ప్రజల సేఫ్టీ ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. 


రెహమాన్ 30 ఏళ్ళ ప్రయాణంలో ఎన్నో అవార్డులు
సంగీత దర్శకుడిగా రెహమాన్ 30 ఏళ్ళ ప్రయాణంలో ఆయన ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఆస్కార్ ఒక్కటే ఆయన ప్రతిభకు కొలమానం కాదు. ఆస్కార్ కంటే ముందు... ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకున్నారు. అలాగే, భారత ప్రభుత్వ ఇచ్చే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మ విభూషణ్ ఆయన్ను వరించింది. దేశ విదేశాల నుంచి ఇంకా మరెన్నో అవార్డులు, గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. 


రెహమాన్ సినిమాలు రీ రిలీజ్
రెహమాన్ 30 ఏళ్ల ప్రయాణాన్ని అభిమానులు వేడుకలా నిర్వహిస్తున్నారు. కేవలం మ్యూజిక్ కాన్సర్ట్లు మాత్రమే కాదు... రెహమాన్ సంగీతం అందించిన సినిమాలను సైతం రీ రిలీజ్ చేస్తున్నారు. ఆయన అభిమానులు ఇవన్నీ చేస్తున్నారు. ఆగస్టు తొలి వారంలో రెహమాన్ సంగీతం అందించిన 15 సినిమాలను రిలీజ్ చేశారు.


Also Read 'ఉస్తాద్' రివ్యూ : హీరోగా, నటుడిగా కీరవాణి కుమారుడు శ్రీ సింహా హిట్టు - మరి, సినిమా?


 


ఏఆర్ రెహమాన్‌ (AR Rahman Music Concert Chennai)తో పాటు ఆయన సంగీతం అందించిన సినిమాల్లో పాటలు పాడిన జోనితా గాంధీ, శక్తిశ్రీ గోపాలన్, శ్వేతా మోహన్ సహా పలువురు గాయకులు మ్యూజిక్ కాన్సర్ట్లకు హాజరు కానున్నారు.