(Source: ECI/ABP News/ABP Majha)
Hindu Holocaust Memorial: 'హిందువుల మద్దతుతోనే అప్పుడు గెలిచా- మళ్లీ అధికారంలోకి వస్తే'
Hindu Holocaust Memorial: ఫ్లోరిడాలో జరిగిన దీపావళి వేడుకల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్నారు.
Hindu Holocaust Memorial: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఫ్లోరిడాలో రిపబ్లికన్ హిందూ కూటమి (ఆర్‌హెచ్‌సీ) ఏర్పాటు చేసిన దీపావళి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Donald Trump :
— narne kumar06 (@narne_kumar06) October 27, 2022
"I think it's time to build Hindu Holocaust memorial in Washington "
Video @ 00:50 secs ❤️ Trump
pic.twitter.com/n0sI8mXPrd
పరువునష్టం దావా
ప్రముఖ వార్తా సంస్థ సీఎన్‌ఎన్‌పై కోర్టులో ఇటీవల పరువు నష్టం దావా వేశారు డొనాల్డ్ ట్రంప్. తనపై సీఎన్‌ఎన్ అసత్య ప్రచారానికి పాల్పడుతున్నట్లుగా ట్రంప్ ఆరోపించారు.
సీఎన్‌ఎన్ ఉద్దేశపూర్వకంగా తనపై దుష్ప్రచారం చేస్తుందని ట్రంప్ ఆరోపించారు. భవిష్యత్తులో తాను అధ్యక్ష బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని, వాటిని దెబ్బతీసేలా సీఎన్‌ఎన్ తప్పుడు కథనాలు ప్రసారం చేస్తోందని ట్రంప్ అన్నారు. తన పరువుకు భంగం కలిగించినందున సీఎన్ఎన్.. 475 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.3,867.71 కోట్లు) పరిహారాన్ని ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. ఈ మేరకు ఫ్లోరిడా డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేశారు.
దాని వల్లే
2020లో తాను పోటీ చేసిన అధ్యక్ష ఎన్నికల సమయంలో 'ది బిగ్ లై' పేరిట సీఎన్‌ఎన్ ప్రచారం నిర్వహించిందని ట్రంప్ అన్నారు. దీని వల్ల తనకు ఆ ఎన్నికల్లో నష్టం కలిగిందని ట్రంప్ అన్నారు.
" 'ది బిగ్ లై' పేరిట సీఎన్‌ఎన్ జరిపిన దుష్ప్రచారంలో దాదాపు 7,700 సార్లు నా గురించి ప్రస్తావించారు. ప్రజల్ని భయ పెట్టడానికే వాళ్లు అలా చేశారు. ఈ తరహా ప్రచారం నిర్వహిస్తున్న మరికొన్ని ఛానళ్లపై కూడా నేను దావా వేస్తాను. నేను మళ్లీ అధ్యక్ష బరిలో నిలుస్తున్నానే భయంతోనే సీఎన్‌ఎన్ దుష్ప్రచారం చేస్తోంది. "
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా మాజీ అధ్యక్షుడు