Hanuman Statue : అమెరికాలో మూడో అతి పెద్ద విగ్రహం మన హనుమంతుడిదే - చినజీయర్ స్వామి కృషితోనే !
Texas : మన దేశంలో సుదీర్ఘమైన రోడ్ జర్నీ చేస్తే చాలా చోట్ల ఎత్తయిన హనుమాన్ విగ్రహాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు యూఎస్ లోని టెక్సాస్‌లోనూ 90 అడుగుల విగ్రహం ఆ రాష్ట్రం మీదుగా వెళ్లేవారికి కనిపించనుంది.
Texas Gets A 90 Ft Hanuman Statue Tallest Idol Outside India : అమెరికాలో హిందువులు పెద్ద పెద్ద ఆలయాలను నిర్మించారు. ఇప్పుడు అతి పెద్ద విగ్రహాలను కూడా ఆవిష్కరిస్తున్నారు. హనుమాన్ విగ్రహాలు భారత్ లో చాలా ఉంటాయి. అతి పెద్దవైన విగ్రహాలు కూడా ఉంటాయి. భారత్ బయట కూడా వివిధ దేశాల్లో హనుమంతుడి విగ్రహాలు ఉంటాయి... కానీ భారత్ తర్ాత అమెరికాలోనే అతి పెద్ద అమెరికా విగ్రహం ఏర్పాటయింది. టెక్సాస్ హిందువులు అందరూ కలిసి అతి పెద్ద హనుమాన్ విగ్రహాన్ని నెలకొల్పారు. అధ్యాత్మకిక ఉట్టిపడే కార్యక్రమాలతో ప్రాణప్రతిష్ట కూడా నిర్వహించారు. ఈ విగ్రహం భారత్ కాకుండా ఇతర దేశాలన్నింటితో పోలిస్తే అతి పెద్ద విగ్రహం. అమెరికాకే బ్రాండ్ గా ఉండే న్యూయార్క్ లోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ 151 అడుగులు ఉంటుంది.
ఈ విగ్రహం ఏర్పాటు వెనుక చిన్న జీయర్ స్వామి కృషి ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. నార్త్ అమెరికా హిందూ సమాజంలో అనేక కార్యక్రమాలు చేపట్టారని.. చిన్నజీయర్ వల్ల ఎన్నో అద్భుతమైన అధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నామని వారు చెబుతున్నారు. అందుకే ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి చినజీయర్ స్వామి కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా హనుమాన్ విగ్రహంపై హెలికాఫ్టర్ తో పూలు కూడా చల్లే కార్యక్రమం చేపట్టారు. అలాగే 72 అడుగుల అతిపెద్ద పూల దండను కూడా స్వామిజీ కోసం ప్రత్యేకంగా చేయించారు. అమెరికాలో హిందూ సంస్కృతి సంప్రదాయాలు పెరిగేలా .. ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
The Indian community in the US inaugurated a 90 foot tall statue of Lord Hanuman, in Texas.
— Indians of Canada (@IndiansOfCanada) August 20, 2024
Indian Americans are the highest earning ethnic group in America and run most of their major companies.
INDIANS OF CANADA should also be wealth creators and model immigrants. Agreed? pic.twitter.com/kYGR8sCZNs
అమెరికా క్రిస్టియన్ మెజార్టీ దేశం అయినప్పటికీ మత స్వాతంత్రం ఉంది. ఎవరికి ఇష్టం వచ్చిన మతాన్ని వారు అనుసరించుకోవచ్చు. ఇండియా నుంచి వెళ్లిన వారు హిందువులుగా అన్ని కార్యక్రమాల చేపడుతున్నారు. అతి పెద్ద ఆలయాలను నిర్మించుకున్నారు. ఇప్పుడు అతి పెద్ద విగ్రహాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అమెరికా పాలకులు కూడా హిందూ సంప్రదాయాన్ని గౌరవిస్తారు. దీపావళి పండుగను.. స్వయంగా ఎవరు అధ్యక్షుడు ఉన్నా సరే వైట్ హౌస్ లో జరుపుకుంటారు.
90-foot statue of Hindu demon Hanuman erected in Houston, Texas.
— AF Post (@AFpost) August 20, 2024
It is now the third tallest statue in America.
Follow: @AFpost pic.twitter.com/KEF4sbxzM4
అమెరికాలో ఇది మూడో అతి పెద్ద విగ్రహం కావడంతో.. ఈ విగ్రహం చర్చనీయాంశమయింది.