అన్వేషించండి

Paragliding Accident: కులూలో పారాగ్లైడింగ్ ప్రమాదంలో తెలంగాణ యువతి మృతి - కులూలో పైలట్ అజాగ్రత్త కారణంగా గాల్లో నుంచి కిందపడిపోయిన నవ్య

Paragliding Accident: కులూలో పారాగ్లైెడింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు గాల్లో నుంచి కిందపడి తెలంగాణకు చెందిన యువతి మృతి, పైలెట్ అజాగ్రత్త వల్లే ప్రమాదం

Paragliding Accident: పారాగ్లైడింగ్ సరదా ఓ యువతి నిండు ప్రాణాలను బలితీసుకుంది. పైలట్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదవశాత్తు వందల అడుగుల పైనుంచి కిందకుపడి ప్రాణాలు విడిచింది. హిమాచల్ ప్రదేశ్(Himachalpradesh) లోని కులూ(Kulu)లో జరిగిన ఈ ప్రమాదంలో తెలంగాణ(Telangana)కు చెందిన యువతి కన్నుమూసింది.

విహార యాత్రలో విషాదం

గాల్లో చక్కర్లు, వందల అడుగుల ఎత్తులో విహారం, దూదిపింజలా తేలిపోతున్న శరీరం. ఇవన్నీ మాటల్లో చెబితే సరిపోదు పారాగ్లైడింగ్(Paragliding) అనుభవించి తీరిన వారికే అర్థమవుతుంది. ఎత్తైన కొండల మీద నుంచి లోయలోకి దూకడం, ఎగిరే విమానం డోరు తెరుచుకుని బయటకు దూకేయడం వంటివి మనం సినిమాలో చూస్తుంటాం. ఆ వెంటనే గొడుగు వంటి పరికరం తెరుచుకుని గాల్లో అలా అలా విహరిస్తుంటారు. దీన్నే పారాగ్లైండింగ్(Paragliding) అంటారు. ఈ ఆట ఎంత సరదాగా ఉంటుందో అజాగ్రత్తగా ఉంటే అంతకన్నా ప్రమాదకరంగా ఉంటుంది. ఊపిరి సినిమా చూశాం కదా..అందులో నాగార్జున(Nagarjuna) వందల అడుగుల ఎత్తు నుంచి పడిపోయి ఎలా జీవచ్ఛవంలా మారిపోయాడు. వందలకోట్లు ఉండి కూడా చక్రాల కుర్చీకే పరిమితమయ్యాడు. కనీసం అక్కడ నాగార్జున బ్రతికే ఉన్నాడు. కానీ కొంతమంది అక్కడికక్కడే మృతిచెందుతారు. సరిగ్గా అలాంటి ఘటనలే హిమాచల్ ప్రదేశ్ లోని కులూలో జరిగింది. తెలంగాణలోని జహీరాబాద్(Jahirabad) కు చెందిన హైదరాబాద్ కు చెందిన ఓ మహిళా పర్యాటకురాలు ప్రమాదవశాత్తూ మృతి చెందారు. పారాగ్లైడింగ్ ప్రమాదంలో హిమాచల్ ప్రదేశ్ లోని కులులో ఈ ఘటన జరిగింది.తెలంగాణలోని జహీరాబాద్ కు చెందిన నవ్య(Navya) పారాగ్లైడింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు గాల్లో నుంచి కిందపడిపోయి కన్నుమూసింది. సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న మోహన్, నవ్య దంపతులు విహారయాత్ర కోసం హిమాచల్ ప్రదేశ్ లోని కులూ వెళ్లారు. నవ్య పారాగ్లైడింగ్ చేస్తుండగా పైలట్(Pilot) అజాగ్రత్తగా వ్యవహరించి సీట్ బెల్ట్ సరిగా పెట్టుకోకపోవడంతో ప్రమాదవశాత్తు జారి కిందపడిపోయింది.

ఫైలట్ నిర్లక్ష్యం

నవ్య ప్రమాదానికి గురైన ప్రాంతం పారాగ్లైడింగ్ కు ఎంతో అనువైన ప్రదేశమే. వందల మంది యాత్రికులు ఇక్కడ గాల్లో విహరించి ఆనందం పొందారు. అయితే కేవలం మానవ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కులూ పోలీసులు నిర్థరించారు. పైలట్ టూరిస్ట్ సేప్టీ బెల్ట్ సరిగా పెట్టుకోకపోవడం వల్ల నవ్య జారికిందపడిపోయిందని తెలిపారు. పారాగ్లైడింగ్ కు అన్ని సేప్టీ మెజర్ మెంట్స్ ఉన్నాయని....పైలట్ కూడా పారాగ్లైడింగ్ లైసెన్స్ కలిగి ఉన్నవాడేనని తేల్చారు. అయితే అజాగ్రత్తే పర్యాటకురాలి ప్రాణాలు తీసిందని వారు తెలిపారు.మృతదేహానికి కులు ప్రాంతీయ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులకు అప్పగించారు.ప్రమాదానికి కారణమైన పైలెట్ పై కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన కులులోని దోభీ గ్రామంలో పారాగ్లైడింగ్ కార్యకలాపాలన్నీ నిలిపివేశారు. ఆనందంగా గడిపేందుకు విహార యాత్రకు వెళితే విషాదం చోటుచేసుకుందని నవ్య కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. పర్యాటక ప్రాంతాల్లో సేప్టీ ఫ్రికాషన్స్ తీసుకోకపోవడం వల్లే నవ్య చనిపోయిందని..మరొక కుటుంబానికి ఇలాంటి పరిస్థితి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు 

Also Read: మేడిగడ్డలో దెబ్బతిన్న పిల్లర్లను సీఎం రేవంత్ నేడు పరిశీలించనున్నారు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన ప్రాజెక్ట్ సందర్శిన

Also Read: టీఎస్‌పీఎస్సీ అకౌంట్స్‌ ఆఫీసర్‌ తుది ఆన్సర్ కీ విడుదల, సమాధానాలు చెక్ చేసుకోండి

టాప్ హెడ్ లైన్స్

TVK Vijay Target AIADMK MLAs 2026: అన్నాడీఎంకే ఖాళీ అవ్వడమే విజయ్‌కి కావాలా? టీవీకే ఉప ఎన్నికల ప్లాన్ వెనుక ద్రవిడ రాజకీయ రహస్యం ఇదే!
అన్నాడీఎంకే ఖాళీ అవ్వడమే విజయ్‌కి కావాలా? టీవీకే ఉప ఎన్నికల ప్లాన్ వెనుక ద్రవిడ రాజకీయ రహస్యం ఇదే!
MGNREGA Replaced by VBG RAM G: మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీ జీరామ్‌జీ స్కీమ్ అమల్లోకి.. పెరిగిన పని దినాలు
మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీ జీరామ్‌జీ స్కీమ్ అమల్లోకి.. పెరిగిన పని దినాలు
Modi Shah BJP Party Overhaul: బీజేపీలో భారీ సంస్థాగత మార్పులు - జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ అవుట్?.. మోదీ-షా జనరేషన్ షిఫ్ట్ ప్లాన్ ?
బీజేపీలో భారీ సంస్థాగత మార్పులు - జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ అవుట్?.. మోదీ-షా జనరేషన్ షిఫ్ట్ ప్లాన్ ?
Yadagirigutta Temple Board: యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు.. చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు కీలక బాధ్యతలు
యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు.. చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు కీలక బాధ్యతలు

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Donald Trump Order: ట్రంప్ వలస విధానానికి గట్టి దెబ్బ ! జన్మహక్కు పౌరసత్వంపై ఉత్తర్వు కొట్టేసిన సుప్రీంకోర్టు! 
ట్రంప్ వలస విధానానికి గట్టి దెబ్బ ! జన్మహక్కు పౌరసత్వంపై ఉత్తర్వు కొట్టేసిన సుప్రీంకోర్టు! 
Yadagirigutta Temple Board: యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు.. చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు కీలక బాధ్యతలు
యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు.. చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు కీలక బాధ్యతలు
Hyderabad Crime News: హైదరాబాద్‌ ఓఆర్ఆర్ వద్ద పోలీసుల కాల్పులు.. హత్య కేసులో నిందితుడి అరెస్ట్
హైదరాబాద్‌ ఓఆర్ఆర్ వద్ద పోలీసుల కాల్పులు.. హత్య కేసులో నిందితుడి అరెస్ట్
Maggi Size: మ్యాగీ ప్రియులకు బిగ్‌షాక్‌! కంపెనీ కీలక నిర్ణయం, ధర మారలేదు కానీ...!
మ్యాగీ ప్రియులకు బిగ్‌షాక్‌! కంపెనీ కీలక నిర్ణయం, ధర మారలేదు కానీ...!
Revanth Reddy : ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
Tata Sierra EV Price: ఏ కాంపాక్ట్ SUVకి లేని శక్తితో వచ్చిన టాటా సియరా EV!బేసిక్‌, టాప్‌ వేరియంట్‌ ధరలు ఎలా ఉన్నాయి? 
ఏ కాంపాక్ట్ SUVకి లేని శక్తితో వచ్చిన టాటా సియరా EV!బేసిక్‌, టాప్‌ వేరియంట్‌ ధరలు ఎలా ఉన్నాయి? 
WhatsApp Username: వాట్సాప్‌లో నంబర్‌ను చెప్పకుండానే ఎలా చాట్ చేయవచ్చు! 
వాట్సాప్‌లో నంబర్‌ను చెప్పకుండానే ఎలా చాట్ చేయవచ్చు! 
Akhil Raj: అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... ధైర్యం కోసం 'జై శ్రీరామ్' అంటూ...
అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... ధైర్యం కోసం 'జై శ్రీరామ్' అంటూ...
Embed widget