Breaking News: హైదరాబాద్‌లో కారులో ఎగసిపడ్డ మంటలు.. వ్యక్తి సజీవ దహనం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 18న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
LIVE
Background
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 18న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
కారులో మంటలు, వ్యక్తి సజీవ దహనం
గోల్కొండ ప్రాంతం సమీపంలో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. శంషాబాద్ నుంచి తుక్కుగూడ వైపు వస్తున్న కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పెద్ద గోల్కొండ ఎగ్జిట్ నెంబరు 17 వద్దకు రాగానే ఈ మంటలు వచ్చాయి. క్షణాల్లో మంటలు కారు మొత్తం వ్యాపించడంతో అందులో ప్రయాణిస్తు్న్న వ్యక్తి సజీవ దహనమైయ్యాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.
ఏపీ ఫైబర్ నెట్ కేసులో సాంబశివరావు అరెస్ట్
ఏపీ ఫైబర్ నెట్ కేసులో సాంబశివరావు అరెస్ట్ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీగా సాంబశివరావు పని చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి డిప్యుటేషన్‌పై వచ్చి ఏపీలో పని చేశారు. ఇప్పటికే సాంబశివరావుతో పాటు హరి ప్రసాద్‌ను సీఐడీ అధికారులు విచారణ జరిపారు. సాంబశివరావుకు వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు.. గుంటూరు కోర్ట్‌లో హాజరుపరచనున్నారు.
డ్రగ్స్ కేసు: పూరీ, తరుణ్‌కు క్లీన్ చిట్
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్శకుడు పూరీ జగన్నాథ్, నటుడు తరుణ్‌కు ఈ కేసు నుంచి ఎక్సైజ్ శాఖ క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ ఇద్దరూ డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఎలాంటి ఆనవాళ్లు లేవని ఎక్సైజ్ శాఖ తన ఛార్జిషీటులో వెల్లడించింది.
టీఎంసీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత బాబుల్ సుప్రియో టీఎంసీలో చేరారు. ఇటీవలె ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి వర్గ విస్తరణ తర్వాత రాజీనామా చేశారు.
Former Union Minister and ex-BJP MP Babul Supriyo formally joins Trinamool Congress (TMC). Supriyo had quit BJP following the recent Union Cabinet reshuffle. pic.twitter.com/Uc5uOU2Izx
— ANI (@ANI) September 18, 2021
ఉస్మానియా పరీక్షలు వాయిదా..
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో ఎల్లుండి (సెప్టెంబర్ 20) జరగాల్సిన అన్ని రకాల పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు వర్సిటీ అధికారులు ప్రకటించారు. గణేష్ నిమజ్జనం కారణంగా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. వాయిదా పడిన పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనే వివరాలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం https://www.osmania.ac.in/ను సంప్రదించవచ్చని విద్యార్థులకు సూచించారు.