అన్వేషించండి

Massive Crowd At Prajavani: ప్రజావాణికి విశేష స్పందన-తెల్లవారుజాము నుంచే క్యూలైన్లు

Telangana News: తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణికి విశేష స్పందన వస్తోంది. సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చేందుకు ప్రజలు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు.

Huge Response To Prajavani: తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సరికొత్త నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ఒకటి ప్రజావాణి  కార్యక్రమం. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని... సమస్యలతో సతమతమయ్యారని కాంగ్రెస్‌ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ప్రజాసమస్యలు  తెలుసుకునేందుకు ప్రజావాణి కార్యక్రమం చేపట్టింది. ప్రగతిభవన్‌ను జ్యోతిరావ్‌ పూలే ప్రజాభవన్‌గా పేరు మార్చి... అక్కడే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ  కార్యక్రమానికి మొదటి నుంచి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజావాణి కార్యక్రమానికి తరలివస్తున్నారు జనం. ప్రజావాణిలో  ఎక్కువగా భూముల సంబంధిత సమ్యలు, ధరణి, ఆరోగ్యం,నిరుద్యోగం అంశాలపైనే ఎక్కువ వనతిపత్రాలు వస్తున్నట్లు తెలుస్తోంది. 

తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం.. వారానికి రెండు రోజులు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తోంది. మంగళవారం, శుక్రవారాల్లో కచ్చితంగా ప్రజావాణి నిర్వహించాలని ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. దీంతో ఆ రెండు రోజుల్లో జ్యోతిరావ్‌ పూలే ప్రజాభవన్‌కు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు ప్రజలు. సమస్యలు చెప్పుకునేందుకు తెల్లవారుజాము  నుంచే ప్రజాభవన్‌ ముందు క్యూకడుతున్నారు. దీంతో ప్రజావాణి నిర్వహిస్తున్న రెండు రోజుల్లో ప్రజాభవన్‌ దగ్గర రద్దీ కనిపిస్తోంది. 

ఇవాళ (శుక్రవారం) కూడా ప్రజావాణి నిర్వహిస్తుండటంతో ప్రజలు భారీగా ప్రజాభవన్‌కు తరలివచ్చారు. తెల్లవారుజామున 5గంటల నుంచే ప్రజాభవన్‌కు పోటెత్తారు. ఉదయం  9గంటల అయ్యే సరికి.. ప్రజాభవన్‌ ముందు కిలోమీటర్ మేర క్యూలైన్‌ పెరిగిపోయింది. అయితే... పెద్దసంఖ్యలో తరలివస్తున్న ప్రజలను ఒక క్రమపద్ధతిలో ఉంచి... వారందరినీ  ఒక్కొక్కరిగా లోపలికి పంపడం అక్కడి భద్రతా సిబ్బందికి ఒక టాస్క్‌ అనే చెప్పాలి. ప్రజావాణికి విశేష స్పందన వస్తుండటం... సమస్యలు చెప్పుకునేందుకు రాష్ట్రం  నలుమూలల నుంచి ప్రజలు హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కు వస్తుండటంతో... రద్దీ విపరీతంగా పెరుగుతోందని అధికారులు భావిస్తున్నారు. Image

ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో మాత్రమే ప్రజావాణి నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. జిల్లాల నుంచి హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కు వచ్చేందుకు ప్రజలు కూడా  ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో... ప్రభుత్వం ప్రత్నామ్యాయ మార్గాలు అన్వేషిస్తే బెటరని పలువురు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో  మాత్రమే కాకుండా... అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో ప్రజావాణి నిర్వహిస్తే బాగుటుందని సూచిస్తున్నారు. దీని వల్ల.. ఆయా నియోజకవర్గ ప్రజల సమస్యలకు... ఆయా  నియోజకవర్గాల పరిధిలోనే పరిష్కారం చూపినట్టు అవుతుంది. అంతేకాదు.. వారంతా హైదరాబాద్‌ వరకు రావాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు ప్రజాభవన్‌ దగ్గర రద్దీ  కూడా తగ్గుకుంది. దీని వల్ల అటు ప్రభుత్వ యంత్రాంగానికి... ఇటు ప్రజలకు భారం, ఒత్తిడి తగ్గే అవకాశం కూడా ఉంటుంది.Image

ఇక... తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజాదర్భార్‌ పేరుతో కార్యక్రమం మొదలుపెట్టింది. మొదటి రోజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా.. ప్రజల నుంచి వినతిపత్రాలు తీసుకున్నారు. వారి సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత ప్రజాదర్భార్‌ను.. ప్రజావాణిగా పేరు మార్చారు. వారానికి రెండు సార్లు ప్రజావాణి నిర్వహించాలని నిర్ణయించారు. ఒక్కో రోజు ఒక్కో మంత్రు ప్రజావాణిలో పాల్గొని ప్రజా సమస్యలు తెలుసుకోవాలని... వారి నుంచి వినతిపత్రాలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం... ప్రజావాణి కార్యక్రమానికి రోజుకో మంత్రి హాజరవుతూ.. ప్రజల నుంచి వినతిపత్రాలు తీసుకుంటున్నారు.
Massive Crowd At Prajavani: ప్రజావాణికి విశేష స్పందన-తెల్లవారుజాము నుంచే క్యూలైన్లు

Massive Crowd At Prajavani: ప్రజావాణికి విశేష స్పందన-తెల్లవారుజాము నుంచే క్యూలైన్లు
Massive Crowd At Prajavani: ప్రజావాణికి విశేష స్పందన-తెల్లవారుజాము నుంచే క్యూలైన్లు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Radhika Sarathkumar: ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
Jio 5G Upgrade Voucher: సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Radhika Sarathkumar: ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
Jio 5G Upgrade Voucher: సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
PM Modi US Tour: జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
Lagacharla Incident: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Viral News: స్టార్టప్ నెలకొల్పాలనే ఆశయం - ఓ ఆటోవాలా వినూత్న ఆలోచన
స్టార్టప్ నెలకొల్పాలనే ఆశయం - ఓ ఆటోవాలా వినూత్న ఆలోచన
Embed widget