TN Weather Update: భారీ వానలకు చెన్నై విలవిల.. మరో 2 రోజుల పాటు కుండపోత వర్షాలు
చెన్నైలో కురుస్తోన్న భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. మరో 2 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
భారీ వర్షాలకు తమిళనాడు అతలాకుతలమైంది. చెన్నై సహా ప్రధాన నగరాల్లో రెండు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రాబోయే 2 రోజుల పాటు చెన్నై సహా మరో 9 జిల్లాలతో పాటు పుదుచ్చేరిలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది.
Rains continue to lash Chennai; visuals from Marina Beach pic.twitter.com/aqR7dLSnqh
— ANI (@ANI) December 31, 2021
రోడ్లన్నీ జలమయం..
ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు రోడ్లపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎగ్మూర్, సెంట్రల్, గిండి తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ చెరువలను తలపించాయి.
Tamil Nadu: Waterlogging in several parts of Chennai in aftermath of heavy rains; earlier visuals from Ashok Nagar pic.twitter.com/gBwn9trFOH
— ANI (@ANI) December 31, 2021
బంగాళాఖాతంలో తూర్పు వైపు దిశగా గాలులు దూసుకుస్తున్నాయి. తీరం వెంబడి నగరాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. రాబోయే రెండు రోజుల్లో కోస్తా జిల్లాలు, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ పరిసర జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది.
స్టాలిన్ పర్యటన..
చెన్నై, కాంచీపురం, తిరువల్లూర్, చెంగళ్పట్టు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పర్యటించారు. అధికారులతో సమీక్ష నిర్వహించి సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎం స్టాలిన్ అధికారులను ఆదేశించారు.
Also Read: Omicron Death: దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం.. గజగజ వణుకుతోన్న జనం!
Also Read: Omicron Cases India: దేశంలో కొత్తగా 16,764 మందికి కరోనా.. 1200 దాటిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య
Also Read: Kannauj IT Raid: పుష్ప.. పుష్పరాజ్.. ఫ్లవర్ అనుకుంటివా? అత్తరు.. ఈ కథే వేరు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.