అన్వేషించండి

Tamil Nadu: కెమికల్స్ పరిశ్రమలో క్లోరిన్ గ్యాస్ లీక్... యజమాని మృతి, 13 మంది కార్మికులకు అస్వస్థత

తమిళనాడు ఈరోడ్ జిల్లాలో ఓ పరిశ్రమలో ప్రమాదం జరిగింది. పరిశ్రమ నుంచి క్లోరిన్ వాయువు లీకైంది. ఈ ప్రమాదంలో పరిశ్రమ యజమాని మరణించాడు. మరో 13 మంది అస్వస్థతకు గురైయ్యారు.

తమిళనాడు ఈరోడ్ జిల్లాలో చితోడ్ లో ఓ పరిశ్రమలో విష వాయువు లీక్ అయింది. ఈ ప్రమాదంలో ఆ పరిశ్రమ యజమాని మృతి చెందగా, 13 మంది ఆసుపత్రి పాలయ్యారు. లిక్విడ్ క్లోరిన్ గ్యాస్ లీకేజీ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీధర్ కెమికల్స్ లో శనివారం మధ్యాహ్నం క్లోరిన్ గ్యాస్ పైపులో సమస్య తలెత్తి గ్యాస్ లీక్ అయింది. ప్రమాద సమయంలో పరిశ్రమలో ఉన్న యజమాని దామోదరన్(40) క్లోరిన్ గ్యాస్ పీల్చి అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మరో 13 మంది ఈ విషవాయువు పీల్చడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో  వారిని ఈరోడ్‌లోని తాంథై పెరియార్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Also Read: Night Curfew: మళ్లీ నైట్ కర్ఫ్యూలు .. రాష్ట్రాలకు కేంద్రం సూచనలు !

గ్యాస్ వ్యాప్తిని నియంత్రిస్తున్న రెస్క్యూ టీమ్స్

పరిశ్రమలోని ఇతర కార్మికులను రక్షించేందుకు నాలుగు ఫైర్, రెస్క్యూ సర్వీస్ వాహనాలను ఘటన స్థలంలో మోహరించారు. గ్యాస్ లీక్ వ్యాప్తి చెందకముందే నియంత్రించేందుకు అగ్ని మాపక బృందాలు పనిచేస్తున్నాయి. సంఘటనా స్థలాన్ని ఈరోడ్ కలెక్టర్ హెచ్ కృష్ణనున్ని, ఎస్పీ శశిమోహన్ పరిశీలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

Also Read: PM Modi: సైనికుడు మిలటరీలో ఉన్నంతవరకే కాదు.. జీవితాంతం యోధుడే 

వైజాగ్ లోనూ ఇలాంటి ప్రమాదం

ఇలాంటి ఘటనే గత ఏడాది మేలో ఏపీలోని వైజాగ్‌లో చోటుచేసుకుంది. ఈ విషాద సంఘటనలో స్టైరిన్ గ్యాస్ లీక్‌ అయ్యి 12 మంది మరణించారు. 585 మంది అస్వస్థతకు గురయ్యారు. లీకేజీ కారణంగా చుట్టుపక్కల ఉన్న జంతువులు, మొక్కలు కూడా దెబ్బతిన్నాయి. ఈ కేసుకు సంబంధించి ఎల్‌జీ పాలిమర్స్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సుంకీ జియాంగ్, టెక్నికల్ డైరెక్టర్ డీఎస్ కిమ్, అడిషనల్ డైరెక్టర్ (ఆపరేషన్స్) పూర్ణ చంద్రమోహన్ రావులను విశాఖపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన మిగిలిన ఉద్యోగులలో ప్రొడక్షన్ టీమ్ లీడర్, ముగ్గురు ఇంజనీర్లు, ఒక ఆపరేటర్, ఆపరేషన్ కోసం నైట్ డ్యూటీ ఆఫీసర్, నైట్ షిఫ్ట్ సేఫ్టీ ఆఫీసర్ ఉన్నారు. ఈ ఘటనపై అప్పట్లో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ముఖ్యమంత్రి జగన్‌ కు నివేదిక అందించింది. 

Also Read : వామ్మో ఒమిక్రాన్.. ఒక్క రోజులో 4 వేల మందికా? గత వైరస్‌ల కంటే వేగంగా కొత్త వైరస్!

టాప్ హెడ్ లైన్స్

AP JAC Demands: ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
SaiKrishna Custodial Death: గాదె సాయికృష్ణ డెత్ కేసు.. నిందితుడు సురేష్ ఆచూకీ కోసం సిట్ ప్రకటన
విజయవాడ గాదె సాయికృష్ణ డెత్ కేసు.. నిందితుడు సురేష్ ఆచూకీ కోసం సిట్ ప్రకటన
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Ritika Nayak: కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
AP JAC Demands: ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
Hrithik Roshan Vs Kangana Ranaut: సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?
సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?
Embed widget