Sudan Protest: సూడాన్‌లో సైనిక తిరుగుబాటు.. ప్రధాని సహా పలువురు అరెస్ట్!
సూడాన్‌లో సైన్యం తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. ప్రధాని సహా ముఖ్య అధికారులను అరెస్ట్ చేసింది.
సూడాన్ ప్రధాని అబ్దల్లా హమ్‌డోక్‌కు ఆ దేశ సైన్యం షాకిిచ్చింది. ప్రధానితో పాటు అనేకమంది సీనియర్ అధికారులను సైనికులు అరెస్ట్ చేశారు. అయితే ప్రధాని అబ్దుల్లాను గృహనిర్బంధంలో ఉంచినట్లు స్థానిక మీడియా చెబుతోంది. తమకు మద్దతుగా ప్రకటన చేయాలని ప్రధానిని సైన్యం ఒత్తిడి చేస్తోందని ఆ దేశ సమాచార మంత్రిత్వశాఖ ట్వీట్ చేసింది.
#BREAKING Sudan protesters fired upon near army headquarters: ministry pic.twitter.com/4IcRiLTfWg
— AFP News Agency (@AFP) October 25, 2021
తిరుగుబాటు..
సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు చేపట్టాలని దేశంలోని ప్రజాస్వామ్య పార్టీలు పిలుపునిచ్చాయి. పలు నగరాల్లోని ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. అయితే నిరసనలు ఉద్ధృతం కాకుండా చూసేందుకు సైన్యం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అంతర్జాల సేవలను నిలిపివేసింది. అయినప్పటికీ నిరసనకారులు వెనక్కి తగ్గకపోవడంతో పరిస్థితిని అదుపుచేసేందుకు భద్రతాదళాలు బాష్పవాయువును ప్రయోగించాయి.
VIDEO: 🇸🇩 Demonstrators burn car tyres and march in #Sudan's capital #Khartoum as they protest against the detention of civilian members of the country's ruling council and ministers in the transitional government pic.twitter.com/087Lh4DPCY
— AFP News Agency (@AFP) October 25, 2021
ప్రజాస్వామ్యం వైపు..
ఓవైపు పేదరికం.. మరోవైపు కరోనా భయం, నిరుద్యోగం వంటి సమస్యలతో సతమతమవుతోన్న సూడాన్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అంతర్యుద్ధాలు, రాజకీయ అస్థిరతలకు తోడు ఇప్పుడు సైన్యం తిరుగుబాటు చేయడం ఆందోళన కలిగిస్తోంది. రెండేళ్ల క్రితమే ఒమర్ అల్ బషీర్ సుదీర్ఘ పాలన నుంచి బయటపడి ప్రజాస్వామ్యంవైపు సూడాన్ అడుగులు వేస్తోంది .
ఇప్పటికి కుదిరింది..
సైనికాధికారులు తిరుగుబాటుకు సెప్టెంబర్‌లోనే ప్రయత్నించినా విఫలమైంది. అప్పటి నుంచి సుడాన్ రాజకీయ నేతలు, మిలిటరీ అధికారుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే ఎట్టకేలకు సైన్యం అనుకున్నది చేసింది. సుడాన్లో తాజా పరిణామాలపై అమెరికా, ఐరోపా సమాఖ్య ఆందోళన వ్యక్తం చేశాయి.
Also Read: Mumbai News: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్.. వాంఖడేపై విజిలెన్స్ విచారణ!
Also Read: UP Polls 2022: ఉత్తర్‌ప్రదేశ్ ప్రజలకు ప్రియాంక వాగ్దానం.. ఈసారి ఉచిత వైద్యంపై హామీ
Also Read: Study: కరోనా వ్యాక్సిన్ ఇతర వ్యాధుల మరణాల రేటును కూడా ప్రభావితం చేస్తుందా?
Also Read: Corona virus: కరోనా కారణంగా భారతీయుల ఆయుర్ధాయం తగ్గిపోయిందా? కొత్త అధ్యయనంలో కలవరపెట్టే నిజాలు