అన్వేషించండి

RIMS Hospital RMO: మీడియాపై రిమ్స్ ఆర్ఎంఓ దౌర్జన్యం  - ఆస్పత్రిలోకి రానివ్వనంటూ తొడకొట్టి సవాల్

RIMS Hospital RMO: శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రి ఆర్ఎంఓ శంకర్ రావు జర్నలిస్టులపై దౌర్జన్యం ప్రదర్శించారు. అసభ్య పదజాలం వాడుతూ.. ఆస్పత్రిలోకి రానివ్వనంటూ తొడకట్టి మరీ సవాల్ విసిరారు. 

RIMS Hospital RMO: శ్రీకాకుళం రిమ్స్‌ ఆర్ఎంఓ శంకర్‌ రావు.. తానొక వైద్యాధికారినని మరిచిపోయి మరీ రెచ్చిపోయారు. మీడియా పట్ల దురుసుగా ప్రవర్తించి వీరంగం సృష్టించారు. అసభ్య పదజాలం వాడుతూ.. జర్నలిస్టులపై నోరు పారేసుకున్నారు. అలాగే తొడకొడుతూ ఏం చేసుకుంటారో చేసుకోండంటూ పెట్రేగిపోయారు. చివరకు మహిళా పారిశుద్ధ్య కార్మికులు సైతం ఆర్ఎంఓ శంకర్ రావు తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు. తమతోనూ అసభ్యకర మాటలు, చేష్టలతో ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ఇలాంటి వ్యక్తి ఆస్పత్రిలో ఉంటే పనిచేయలేమంటూ ఆసహనం వ్యక్తం చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే?

జిల్లాలోని ఎచ్చెర్ల మండలం కుప్పిలిలో ఓ తండ్రి కన్న కొడుకునే అతి కిరాతకంగా నరికి చంపేశాడు. మిగతా కుటుంబ సభ్యులనూ చంపేందుకు ప్రయత్నించాడు. కానీ వారంతా గట్టిగా కేకలు వేయగా.. స్థానికులు వచ్చారు. దీంతో నిందితుడు పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన పెద్ద కుమారుడు తాతారావు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. అయితే తండ్రి కుమారుడిని చంపడానికి కారణం.. ఆయన భార్యేనని పోలీసులు భావిస్తున్నారు. అర్ధరాత్రి జరిగిన ఘటన.. స్థానికంగా కలకలం రేపింది. అయితే స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. అయితే ఈ ఘటనను చిత్రీకరించేందుకు మీడియా ప్రతినిధులు అంతా ఆస్పత్రికి వెళ్లారు. 

కానీ ఆస్పత్రిలో ఉన్న ఆర్‌ఎంఓ శంకర్ రావు.. మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లోపలికి రానివ్వనంటూ అసభ్య పదజాలంతో దూషించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించనంటూ.. మీడియాను పోలీసులతో అడ్డగించారు. వారి ముందే గేటు వద్ద నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఏం చేసుకుంటారో చేసుకొండంటూ తొడకొడుతూ మీడియా ప్రతినిధులను రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. అంతేకాకుండా శ్రీకాకుళం జిల్లా వాసులు వెనుకబడినవారంటూ దూషించారు. తనను ఎవరూ ఏం చేయలేరంటూ విర్రవీగారు. ఆర్ఎంఓ ప్రవర్తనపై మీడియా ప్రతినిధులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Prabhas Marriage: వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!
వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!
Golconda Bonalu 2024: ఘనంగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు, పోటెత్తిన భక్తులు- జగదాంబికకు తొలిబోనం
ఘనంగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు, పోటెత్తిన భక్తులు- జగదాంబికకు తొలిబోనం
Jr NTR: ఎన్టీఆర్ షాకింగ్ డెసిషన్... ఒక్క సినిమా తీసిన దర్శకుడికి ఛాన్స్!
ఎన్టీఆర్ షాకింగ్ డెసిషన్... ఒక్క సినిమా తీసిన దర్శకుడికి ఛాన్స్!
Embed widget