అన్వేషించండి

Ranil Wickremesinghe India Visit: ఈనెల 21న భారత్ కు రానున్న శ్రీలంక అధ్యక్షుడు - రెండ్రోజుల పాటు ఇక్కడే

Ranil Wickremesinghe India Visit: శ్రీలంక అధ్యక్షుడు విక్రమ సింఘే ఈనెల 21వ తేదీన భారత్ కు రాబోతున్నారు. రెండ్రోజుల పాటు ఇక్కేడ ఉండి పర్యటించనున్నారు. 

Ranil Wickremesinghe India Visit: శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే రెండు రోజుల పర్యటన నిమిత్తం జూలై 21న భారత్‌లో పర్యటించనున్నారు. తన పర్యటనలో విక్రమసింఘే ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలవనున్నట్లు అధికారులు ఆదివారం తెలిపారు. జులైలో జరిగిన ప్రజా తిరుగుబాటులో గోటబయ రాజపక్సేను గద్దె దించిన తర్వాత గత ఏడాది నగదు కొరత ఉన్న దేశానికి అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత ఆయన భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. అతను సెప్టెంబర్ 2024 వరకు రాజపక్సే బ్యాలెన్స్ పదవీ కాలానికి అధ్యక్షుడిగా నియమితుడయ్యారు. న్యూ ఢిల్లీ పర్యటన కోసం అన్ని ఏర్పాట్లను రూపొందించడానికి, భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా వచ్చే వారం ప్రారంభంలో శ్రీలంకకు చేరుకుంటారని సమాచారం. విక్రమ సింఘే ప్రధాని మోదీని కలవాలని భావిస్తున్నారని, ఆయన న్యూఢిల్లీకి బయలుదేరే ముందు ద్వీప దేశంలో విద్యుత్, ఇంధనం, వ్యవసాయం, సముద్ర సమస్యలకు సంబంధించిన అనేక భారతీయ ప్రాజెక్టుల అమలును కూడా ఖరారు చేస్తారని అధికారులు తెలిపారు. ఈ పర్యటనలో ఆయనతోపాటు మత్స్య శాఖ మంత్రి డగ్లస్ దేవానంద, విద్యుత్, ఇంధన శాఖ మంత్రి కాంచన విజేశేఖర, విదేశాంగ మంత్రి అలీ సబ్రీ, అధ్యక్షుడి స్టాఫ్ చీఫ్ సాగలా రత్నాయక్ కూడా ఉన్నారని సమాచారం. 

శ్రీలంక దివాళా తీసిన ఆర్థిక వ్యవస్థ "మెరుగుదల సంకేతాలను" చూపించిన సమయంలో విక్రమ సింఘే భారత పర్యటన జరుగుతుంది. శ్రీలంక ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి విక్రమసింఘే అనేక ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టారు. గత ఏడాది ఏప్రిల్ మధ్యలో దేశం తన మొట్ట మొదటి క్రెడిట్ డిఫాల్ట్‌ను ప్రకటించవలసి వచ్చింది. ఇది ఈ సంవత్సరం మార్చిలో IMF నుంచి USD 2.9 బిలియన్ల బెయిలౌట్‌ను పొందింది. ఇది సంస్కరణలకు లోబడి 4 సంవత్సరాల పాటు విస్తరించింది.

నాటి నుంచే ప్రజాదారణ పతనం

కొలంబో హోటల్‌లో 2019 ఈస్టర్ ఆదివారం బాంబు పేలుళ్లతో శ్రీలంక రాజపక్స కుటుంబ ప్రజాదరణ పతనమవ్వడం మొదలైంది. ఈ తీవ్రవాద దాడిలో వందలాది మంది మరణించారు. మరెంతో మంది వికలాంగులుగా మారారు. దీనికి తోడు కొవిడ్‌ మొదలైంది. మొత్తంగా విదేశీ మారక ద్రవ్య నిల్వలకు కీలకమైన శ్రీలంక పర్యాటక రంగం దెబ్బతింది. ఉద్యోగాలు పోవడం దెబ్బ మీద దెబ్బగా మారింది. ఇదే సమయంలో రాజపక్స ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం లంకను నాశనం చేసింది. సేంద్రియ ఆహార ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయాలన్న ఉద్దేశంతో రసాయనాలు, పురుగు మందులను నిషేధించింది. ఆరు నెలల్లో ధాన్యం ఉత్పత్తి దాదాపు 43% తగ్గింది. విదేశీ ఎగుమతుల ఆర్జన 15% తగ్గింది. హడావుడిగా ఈ పాలసీ రద్దు చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

పర్యాటకం తిరోగమనం, కోవిడ్-19, ఎరువుల నిషేధం శ్రీలంక విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోయాయి.  ఇంధనం నుంచి బియ్యం వరకు దిగుమతి చేసుకొనేందుకు డాలర్లు కరవయ్యాయి. ఒకప్పుడు శ్రీలంక తలసరి ఆదాయం భారత్‌ కన్నా ఎక్కువుండేది. ప్రభుత్వ నిర్ణయాలతో ఇదంతా నాశనమైంది. ఈ ద్వీప దేశం నాలుగు దశాబ్దాలలోనే ఘోరమైన ఆర్థిక సంక్షోభానికి గురైంది. విద్యుత్‌ కోతలతో కొలంబోలోని ఆసుపత్రులల్లో శస్త్ర చికిత్సలను వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రజలు తమ దుస్థితికి రాజపక్సే కుటుంబాన్ని నిందించారు. కొలంబోలో నిరసనలు పూర్తి స్థాయి తిరుగుబాటుగా మారాయి. ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ప్రధాని మహింద రాజపక్సే రాజీనామా చేసినా ఫలితం లేకుండా పోయింది. ప్రజలు గుంపులుగా చేరి అధికార పార్టీ శాసనసభ్యులపై దాడి చేశారు. అధ్యక్ష భవనానికి నిప్పు పెట్టారు. గోటాబయ రాజపక్సే తన బద్ధ శత్రువైన రణిల్ విక్రమసింఘేకు పగ్గాలు అప్పగించి నౌకలో దేశం విడిచి పారిపోయారు. అయినప్పటికీ ప్రజలు శాంతించలేదు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనేసీఎస్‌కేలోకి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఎమ్‌ఎస్ ధోని, రిటెన్షన్ కొత్త రూల్స్‌తో సస్పెన్స్తిరుమలలో మరోసారి చిరుత కలకలం, సీసీటీవీ ఫుటేజ్‌తో సంచలనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget