అన్వేషించండి

Skyroot Aerospace : మన స్పేస్ ఎక్స్.. స్కైరూట్! గ్లోబల్ స్పేస్ వార్‌లో ఎలోన్ మస్క్‌కు పోటీగా నిలుస్తున్న తెలుగు కుర్రాళ్లు

Mission Aagaman : స్కైరూట్ ఏరోస్పేస్ విక్రమ్-1 రాకెట్‌ను అంతరిక్ష కక్ష్యలోకి పంపి సరికొత్త రికార్డు సృష్టించింది. స్పేస్ ఎక్స్ మోడల్‌తో స్కైరూట్ .. ఎక్కడికో దూసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

India Private Space Company:   అంతరిక్ష వాణిజ్య రంగం  అంటే నిన్నటిదాకా ఎలోన్ మస్క్‌కు చెందిన  స్పేస్ ఎక్స్ మాత్రమే గుర్తుకొచ్చేది. కానీ, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న  స్కైరూట్ ఏరోస్పేస్  శ్రీహరికోట నుంచి  మిషన్ ఆగమన్  ద్వారా తమ మొట్టమొదటి ఆర్బిటల్ రాకెట్  విక్రమ్-1 ను విజయవంతంగా అంతరిక్ష కక్ష్యలోకి పంపి సరికొత్త చరిత్ర సృష్టించింది. దీంతో అమెరికా, చైనాల తర్వాత ప్రైవేట్ రంగంలో స్పేస్ ఆర్బిట్‌లోకి రాకెట్‌ను పంపిన మూడో దేశంగా భారత్‌ నిలవగా, ఆ ఘనత సాధించిన ఏకైక భారతీయ ప్రైవేట్ సంస్థగా స్కైరూట్ రికార్డు సృష్టించింది. ఐఐటీ పూర్వ విద్యార్థులైన పవన్ కుమార్ చందన, నాగ భరత్ డాక అనే ఇద్దరు తెలుగు యువకులు 2018లో స్థాపించిన ఈ స్టార్టప్, నేడు నాసా, ఇస్రోల స్థాయికి తగ్గకుండా దూసుకుపోతూ గ్లోబల్ స్పేస్ మార్కెట్‌లో భారతదేశపు ఎలోన్ మస్క్‌లుగా హాట్ టాపిక్‌గా మారారు.

స్పేస్ ఎక్స్ తరహాలోనే ముందుకు

ఈ రెండు సంస్థల ప్రస్థానాన్ని గమనిస్తే అద్భుతమైన పోలికలు కనిపిస్తాయి. 2002లో ఎలోన్ మస్క్  స్పేస్ ఎక్స్ ను స్థాపించినప్పుడు సాంప్రదాయ అంతరిక్ష సంస్థలు ఎగతాళి చేశాయి. వరుసగా మూడు ఫాల్కన్-1  రాకెట్ లాంచ్‌లు విఫలమై, దివాలా తీసే దశ నుంచి నాలుగో ప్రయత్నంలో మస్క్ అంతరిక్ష కక్ష్యను అందుకున్నారు. ఆ పట్టుదలే నేడు స్పేస్ ఎక్స్‌ను 200 బిలియన్ డాలర్ల సామ్రాజ్యంగా మార్చింది. సరిగ్గా అదే తరహా కసితో, ఇస్రో  మాజీ శాస్త్రవేత్తలైన పవన్, భరత్‌లు కేవలం ఐదేళ్లలోనే చిన్న గది నుంచి యూనికార్న్ స్థాయికి స్కైరూట్‌ను తీసుకెళ్లారు. 2022 లోనే  విక్రమ్-ఎస్ సబ్‌ఆర్బిటల్ రాకెట్‌తో మొదటి అడుగు వేసిన వీరు, ఇప్పుడు  విక్రమ్-1 ద్వారా ఏకంగా 450 కిలోమీటర్ల ఎత్తులోని లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోకి శాటిలైట్లను విజయవంతంగా ప్రవేశపెట్టి అంతర్జాతీయంగా స్పేస్ ఎక్స్ తొలి రోజులను గుర్తుచేస్తున్నారు.

ఆర్థికంగా స్థిరపడే ఫైనాన్షియల్ మోడల్

ఈ రెండు గ్లోబల్ కంపెనీల పోటీని శాసించేది వాటి వినూత్న  ఫైనాన్షియల్ అండ్ టెక్నాలజీ మోడల్ . స్పేస్ ఎక్స్ విజయానికి మూలస్తంభం  పునర్వినియోగ రాకెట్లు, భారీ పేలోడ్ సామర్థ్యం. అయితే స్కైరూట్ ఎంచుకున్న వ్యూహం పూర్తిగా భిన్నమైనది ,  అత్యంత పొదుపైనది. స్కైరూట్ తన రాకెట్ నిర్మాణంలో భారీగా  3D-ప్రింటింగ్ టెక్నాలజీ ని ,  కార్బన్ ఫైబర్ బాడీని వాడుతోంది. దీనివల్ల రాకెట్ తయారీ ఖర్చు ,  సమయం విపరీతంగా తగ్గుతాయి. స్పేస్ ఎక్స్ పెద్ద పెద్ద ఉపగ్రహాలను భారీ ఖర్చుతో కూడిన ఫాల్కన్ రాకెట్ల ద్వారా పంపుతుంటే, స్కైరూట్ చిన్న , మధ్య తరహా ఉపగ్రహాలను అత్యంత తక్కువ ఖర్చుతో, ఆన్-డిమాండ్  పద్ధతిలో కేవలం కొన్ని రోజుల్లోనే లాంచ్ చేయగల ఫైనాన్షియల్ అడ్వాంటేజ్‌ను క్లియర్‌గా కలిగి ఉంది.

భవిష్యత్ లో స్పేస్ ఎక్స్‌కు పోటీ ఇవ్వొచ్చు!

గ్లోబల్ మార్కెట్‌లో స్పేస్ ఎక్స్‌కు గట్టి పోటీనిచ్చే సత్తా స్కైరూట్‌కు ఎందుకు ఉందంటే—వీరి వద్ద ఉన్న  కాస్ట్ ఎఫెక్టివ్ లాంచ్ ఆర్కిటెక్చర్ . అంతర్జాతీయంగా ఒక కిలోగ్రాము బరువును అంతరిక్షంలోకి పంపడానికి స్పేస్ ఎక్స్ ఛార్జ్ చేసే మొత్తంతో పోలిస్తే, స్కైరూట్ తన తక్కువ నిర్వహణ ఖర్చులు ,  భారతీయ ఇంజనీరింగ్ నైపుణ్యం ఆధారంగా గ్లోబల్ క్లయింట్లకు మరింత డిస్కౌంట్ ధరలకే సేవలు అందించగలదు. ఇప్పటికే సింగపూర్, యూరప్,  అమెరికాకు చెందిన పలు శాటిలైట్ కంపెనీలు స్కైరూట్‌తో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి క్యూ కడుతున్నాయి.  1.1 బిలియన్ డాలర్ల వ్యాల్యుయేషన్‌తో దూసుకుపోతున్న ఈ తెలుగు స్టార్టప్, రాబోయే రోజుల్లో 3D-ప్రింటెడ్ క్రయోజెనిక్ ఇంజన్లతో పనిచేసే భారీ  విక్రమ్-2 ,  విక్రమ్-3  రాకెట్లను రంగంలోకి దించడం ద్వారా గ్లోబల్ కమర్షియల్ స్పేస్ మార్కెట్‌లో బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించే రేసులో ముందంజలో నిలవనుంది.

ప్రస్తుతం స్కైరూట్ ఏరోస్పేస్ ప్రదర్శిస్తున్న వేగం, సాంకేతిక పరిణతి చూస్తుంటే భవిష్యత్తులో గ్లోబల్ స్పేస్ దిగ్గజం స్పేస్ ఎక్స్‌ను అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదని అంతరిక్ష విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎలోన్ మస్క్ పశ్చిమ దేశాల మార్కెట్‌ను శాసిస్తుంటే, మన తెలుగు కుర్రాళ్లు తక్కువ బడ్జెట్ , అత్యుత్తమ టెక్నాలజీతో ఆసియా ,  గ్లోబల్ స్మాల్-శాటిలైట్ మార్కెట్‌లో తిరుగులేని శక్తిగా ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది. సాంప్రదాయ స్పేస్ ఇండస్ట్రీ మైండ్‌సెట్‌ను బద్దలు కొడుతూ దూసుకెళ్తున్న ఈ టీమ్, భవిష్యత్తులో స్పేస్ ఎక్స్‌కు ప్రత్యామ్నాయంగా నిలిచి, అంతరిక్ష వాణిజ్యంలో భారతదేశ పతాకాన్ని గ్లోబల్ టాప్‌లో ఎగరేయడం ఖాయం. 

టాప్ హెడ్ లైన్స్

Virat Kohli  Storm: అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
Ongole Mayor Result: కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
CM Revanth Reddy: సదర్ అంటే జల్సా కాదు.. రాష్ట్ర పండుగ, యాదవుల ఆత్మగౌరవ ప్రతీక: సీఎం రేవంత్ రెడ్డి
సదర్ అంటే జల్సా కాదు.. రాష్ట్ర పండుగ, యాదవుల ఆత్మగౌరవ ప్రతీక: సీఎం రేవంత్ రెడ్డి
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Virat Kohli  Storm: అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
Ongole Mayor Result: కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
RTC Conductor Dies: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
Medical College Ragging: కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
KTR Help: మాట నిలబెట్టుకున్న కేటీఆర్.. మస్కట్‌లో చిక్కుకున్న కొడంగల్ మహిళకు సాయం
మాట నిలబెట్టుకున్న కేటీఆర్. మస్కట్‌లో చిక్కుకున్న కొడంగల్ మహిళకు సాయం
Embed widget