అన్వేషించండి

ఆశ్చర్యం.. గుహలో 28 వేల ఏళ్లనాటి సింహం పిల్ల.. ఇప్పటికీ చెక్కుచెదరకుండా..

సైబిరియలో లభించిన రెండు సింహం పిల్లలు పరిశోధకులను ఆశ్చర్యానికి గురిచేశాయి. వేల ఏళ్లు గడుస్తున్నా.. వాటి శరీరాలు ఇప్పటికీ పదిలంగానే ఉన్నాయి.

సాధారణంగా కళేబరాలు రోజులు.. నెలల వ్యవధిలోనే కనుమరుగవుతాయనే సంగతి మనకు తెలిసిందే. కొన్నాళ్ల తర్వాత కేవలం వాటి అస్థికలు మాత్రమే కనిపిస్తాయి. అవి ఎన్నేళ్లైనా చెక్కు చెదరవు. వాటి ఆధారంగానే ఒకప్పుడు ఈ భూమిపై డైనోసార్ వంటి భారీ జంతువులు జీవించి ఉండేవని తెలుసుకోగలిగారు. ఇప్పటికీ ఏదో ఒక చోట ప్రాచీన కాలం నాటి జీవుల అస్థికలు లభిస్తూనే ఉన్నాయి. వాటి ఎముకలను వరుసగా పేర్చి అప్పట్లో వాటి ఆకారం ఏ విధంగా ఉండేవి, ఏ సైజులో ఉండవనే విషయాలు తెలుసుకొనేవారు. అయితే, తాజాగా సైబీరియాలోని ఓ గుహలో బయటపడిన ఓ సింహం పిల్ల కళేబరాన్ని చూసి పరిశోధకులు ఆశ్చర్యపోయారు. 28 వేల ఏళ్లు గడిచినా దాని కళేబరం చెక్కు చెదరకపోవడమే ఇందుకు కారణం. 

‘‘అన్నేళ్లు గడిచినా కళేబరం చెక్కు చెదరలేదా? ఆశ్చర్యంగా ఉందే’’ అని అనుకుంటున్నారా? ఔనండి.. అది ఇన్నేళ్లుగా కుళ్లిపోకుండా ఉండటం చిత్రమే. ఇందుకు కారణం.. అది నివసించిన ప్రాంతంలో దట్టంగా మంచు పేరుకుపోవడమే. ఇది ‘ఐస్ ఏజ్’ (మంచు యుగపు కాలం) నాటి ఆడ సింహం పిల్ల అని స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌కు చెందిన సెంటర్ ఫర్ పాలియోజెనెటిక్స్ పరిశోధకులు తెలిపారు. ఈ సింహం పిల్లకు ‘స్పార్టా’ అని పేరు పెట్టారు. 

అది చనిపోయి 28 వేల ఏళ్లు అవుతుందని, అప్పటికి దాని వయస్సు సుమారు రెండు నెలలు ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. అయితే, దాని దంతాలు, చర్మం, బొచ్చు (శరీరంపై ఉండే వెంటుకలు) ఇప్పటీ చెక్కుచెదరకపోవడం గమనార్హం. ఈ సింహం పిల్ల లభించిన చోటుకు 49 అడుగుల దూరంలోనే మరో సింహం పిల్ల కూడా లభించింది. దానికి బోరిస్ అని పేరు పెట్టారు. మొదట్లో అవి రెండు ఒకే సింహం బిడ్డలని భావించారు. కానీ, తాజా అధ్యయనంలో మాత్రం స్పార్టా కంటే బోరిస్ వయస్సులో పెద్దదని, పైగా అది దాని కంటే 15 వేల ఏళ్ల ముందు చనిపోయిందని నిర్ధరించారు. 

స్పార్టా, బొరిస్‌లను 2017, 2018 సంవత్సరాల్లో కనుగొన్నారు. ఇవి రెండు వేరే జంతువుల దాడిలో చనిపోయినట్లు రష్యా, జపాన్ పరిశోధకులు పేర్కొన్నారు. వాటి పుర్రె, పక్కటెముకలు, కణజాలం ఇప్పటికీ పాడవ్వలేదన్నారు. స్పార్టా కళేబరంతో పోల్చితే బొరీస్ శరీరమే కాస్త ఎక్కువ దెబ్బతిన్నట్లు తెలిపారు. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే నాటి కాలంలో బురదలో కూరుకుపోవడం లేదా మంచు గడ్డలు పగిలి వాటి మీద పడటం వల్ల వాటి శరీరాలు గడ్డకట్టి ఉండవచ్చని భావిస్తున్నారు. 

Also Read: ‘ఫస్ట్‌ నైట్’ బెడ్‌ను రోజా పూలతోనే అలంకరించాలట.. ఎందుకో తెలుసా?

Also Read: విచిత్రం.. ఇతడికి కడుపు లేదు, పేగుల్లేవు.. అయినా బతికేస్తున్నాడు!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jubilee Hills by-elections: జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటమి అంగీకరించారా? రెఫరెండం సవాల్‌పై కాంగ్రెస్ కౌంటర్ ఏంటీ?
జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటమి అంగీకరించారా? రెఫరెండం సవాల్‌పై కాంగ్రెస్ కౌంటర్ ఏంటీ?
Vande Bharat Trains:నాలుగు మార్గాల్లో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రధాని మోదీ పచ్చజెండా! ఐదు పుణ్యక్షేత్రాలను కలుపుతున్న వందే భారత్ నెట్‌వర్క్‌
నాలుగు మార్గాల్లో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రధాని మోదీ పచ్చజెండా! ఐదు పుణ్యక్షేత్రాలను కలుపుతున్న వందే భారత్ నెట్‌వర్క్‌
Bank Holiday: నేడు బ్యాంకు తెరిచి ఉంటుందా లేదా హాలిడేనా? వెళ్లే ముందు సెలవుల జాబితా చూడండి
నేడు బ్యాంకు తెరిచి ఉంటుందా లేదా హాలిడేనా? వెళ్లే ముందు సెలవుల జాబితా చూడండి
Car Safety Tips: కారు 1.20 లక్షల కిలోమీటర్లు నడిస్తే ఏయే విడిభాగాలను మార్చడం చాలా అవసరం?
కారు 1.20 లక్షల కిలోమీటర్లు నడిస్తే ఏయే విడిభాగాలను మార్చడం చాలా అవసరం?
Advertisement

వీడియోలు

Harman Preet Kaur Smriti Mandhana | చిరస్మరణీయ విజయం చిరకాలం గుర్తుండాలని టాటూలు వేయించుకున్న హర్మన్, స్మృతి | ABP Desam
గంభీర్ భాయ్.. నీకో దండం! బ్యాటింగ్‌ పొజిషన్ ఇలా సెలక్ట్ చేస్తున్నావా?
చిరస్మరణీయ విజయం చిరకాలం గుర్తుండాలని టాటూలు వేయించుకున్న హర్మన్, స్మృతి
పీఎం మోదీని కలిసినప్పుడు అలా ఎందుకు చేసానంటే..!
అల్లటప్పా ఆటగాడనుకున్నారా.. రీప్లేస్ చేయాలంటే బాబులు దిగిరావాల!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jubilee Hills by-elections: జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటమి అంగీకరించారా? రెఫరెండం సవాల్‌పై కాంగ్రెస్ కౌంటర్ ఏంటీ?
జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటమి అంగీకరించారా? రెఫరెండం సవాల్‌పై కాంగ్రెస్ కౌంటర్ ఏంటీ?
Vande Bharat Trains:నాలుగు మార్గాల్లో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రధాని మోదీ పచ్చజెండా! ఐదు పుణ్యక్షేత్రాలను కలుపుతున్న వందే భారత్ నెట్‌వర్క్‌
నాలుగు మార్గాల్లో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రధాని మోదీ పచ్చజెండా! ఐదు పుణ్యక్షేత్రాలను కలుపుతున్న వందే భారత్ నెట్‌వర్క్‌
Bank Holiday: నేడు బ్యాంకు తెరిచి ఉంటుందా లేదా హాలిడేనా? వెళ్లే ముందు సెలవుల జాబితా చూడండి
నేడు బ్యాంకు తెరిచి ఉంటుందా లేదా హాలిడేనా? వెళ్లే ముందు సెలవుల జాబితా చూడండి
Car Safety Tips: కారు 1.20 లక్షల కిలోమీటర్లు నడిస్తే ఏయే విడిభాగాలను మార్చడం చాలా అవసరం?
కారు 1.20 లక్షల కిలోమీటర్లు నడిస్తే ఏయే విడిభాగాలను మార్చడం చాలా అవసరం?
Telangana Srirangam: తమిళనాడు ఆలయానికి ప్రతిరూపం తెలంగాణ శ్రీరంగం దర్శించుకున్నారా? వివాహాలకు ప్రసిద్ధి ఈ ఆలయం!
తమిళనాడు ఆలయానికి ప్రతిరూపం తెలంగాణ శ్రీరంగం దర్శించుకున్నారా? వివాహాలకు ప్రసిద్ధి ఈ ఆలయం!
Sree Vishnu : హీరో శ్రీవిష్ణు కూతురిని చూశారా? - ఎంత క్యూట్‌గా ఉందో
హీరో శ్రీవిష్ణు కూతురిని చూశారా? - ఎంత క్యూట్‌గా ఉందో
హ్యాకర్ల ప్రపంచం: తెలుపు, నలుపు, బూడిద టోపీల రహస్య కథ! సైబర్ నేరగాళ్ల గురించి తెలుసుకోండి
సైబర్ ప్రపంచంలో హ్యాకర్లకు రంగుల టోపీల కేటాయింపు - ఎందుకో, ఏంటో తెలుసా?
Predator Badlands Review In Telugu - 'ప్రెడేటర్: బ్యాడ్ ల్యాండ్స్' రివ్యూ: ఇన్నాళ్లకు దారిలో పడ్డ ఫ్రాంచైజీ... సినిమా ఎలా ఉందంటే?
'ప్రెడేటర్: బ్యాడ్ ల్యాండ్స్' రివ్యూ: ఇన్నాళ్లకు దారిలో పడ్డ ఫ్రాంచైజీ... సినిమా ఎలా ఉందంటే?
Embed widget