Shiv Sena Symbol: పార్టీ పేరు గుర్తు కోసం కోట్లు ఖర్చు చేశారు , త్వరలోనే ఈ డీల్ వివరాలు బయటకొస్తాయ్ - సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
Shiv Sena Symbol:సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు.
Shiv Sena Symbol:
డీల్ కుదిరింది: సంజయ్ రౌత్
శివసేన పార్టీ పేరు, గుర్తుని శిందే వర్గానికి కేటాయించడంపై థాక్రే సేన తీవ్ర అసహనంతో ఉంది. ఇప్పటికే ఉద్దవ్ థాక్రే ఎన్నికల సంఘంపై మండి పడ్డారు. ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. ఇప్పుడు మరో సీనియర్ నేత సంజయ్ రౌత్ కూడా స్పందించారు. సంచలన ఆరోపణలు చేశారు. శివసేన పార్టీ పేరు, గుర్తు దక్కించుకునేందుకు శిందే వర్గం దాదాపు రూ.2 వేల కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. ఇదేదో నోటి మాట కాదని. ఇది నిజమని స్పష్టం చేశారు. త్వరలోనే ఈ డీల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వస్తాయని వెల్లడించారు. దేశ చరిత్రలోనే ఇలాంటిదెప్పుడూ జరగలేదని అన్నారు.
"మా పార్టీ పేరుని, గుర్తుని దొంగిలించారు. త్వరలోనే ఆ దొంగ ఎవరో తేలిపోతుంది. మేమే స్వయంగా విచారిస్తాం. ఇందుకు కచ్చితంగా బదులు తీర్చుకుంటాం"
- సంజయ్ రౌత్
#WATCH शिवसेना और उसका निशान (तीर-कमान) चिह्न छीना गया है और ऐसा करने के लिए इस मामले में अब तक 2,000 करोड़ रुपए की लेनदेन हुई है: उद्धव ठाकरे गुट के नेता व सांसद संजय राउत, मुंबई pic.twitter.com/6hyQHLjMZr
— ANI_HindiNews (@AHindinews) February 19, 2023
मुझे यकीन है...
— Sanjay Raut (@rautsanjay61) February 19, 2023
चुनाव चिन्ह और नाम हासिल करने के लिए अब तक 2000 करोड़ के सौदे और लेन-देन हो चुके हैं...
यह प्रारंभिक आंकड़ा है और 100 फीसदी सच है..
जल्द ही कई बातों का खुलासा होगा.. देश के इतिहास में ऐसा कभी नहीं हुआ था.@ECISVEEP @PMOIndia pic.twitter.com/qokcT3LkBC
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే...ప్రస్తుత సీఎం ఏక్నాథ్ శిందేపై ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీపైనా విరుచుకుపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం శివసేన పార్టీ పేరుని, గుర్తుని శిందే వర్గానికి ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేశారు. తమ పార్టీ పేరుని దొంగిలించారంటూ మండి పడ్డారు.
"మా పార్టీ గుర్తుని దొంగిలించారు. ఆ దొంగలకు తగిన బుద్ధి చెప్పాలి. ఆ దొంగ ఎవరో అందరికీ తెలుసు. ఇప్పటికే పట్టుబడ్డాడు కూడా. నేనా దొంగకు సవాల్ విసురుతున్నాను. బాణం విల్లుతో వచ్చి ఎదురు నిలబడితే...కాగడాలతో బదులు చెబుతాం. వాళ్లకు కావాల్సింది శివసేన కుటుంబం కాదు. కేవలం బాలాసాహెబ్ థాక్రే పేరు మాత్రమే. ఆ పార్టీ గుర్తు ఉంటే చాలు. ప్రధాని నరేంద్ర మోదీ బాలాసాహెబ్ మాస్క్ వేసుకోవాలని చూస్తున్నారు. మహారాష్ట్రకు రావడానికి అదో మార్గం అని భావిస్తున్నారు. ఏది నిజమైన ముఖమో, ఏది కాదో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు"
-ఉద్దవ్ థాక్రే, మహారాష్ట్ర మాజీ సీఎం
Also Read: BJP South Tension : దక్షిణాదిలో బీజేపీ ఆశలు ఎంత వరకూ ఫలిస్తాయి ? తెలంగాణలో లక్ష్యం చేరుకుంటుందా ?