అన్వేషించండి

Shiv Sena Crisis: శివసేనను కాదని ఎంత దూరం వెళ్తారో చూస్తాను, ఉద్దవ్ థాక్రే ఉద్వేగం

కొంత మంది ఎమ్మెల్యేలు షిండేతో చేతులు కలిపి శివసేనను ముక్కలు చేయాలని చూస్తున్నారని ఉద్దవ్ థాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్టీని ముక్కలు చేసేందుకు చూస్తున్నారు: ఉద్దవ్ థాక్రే 

మహారాష్ట్రలో ప్రస్తుతానికి ఉద్దవ్ థాక్రే ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. రెబల్ లీడర్‌ ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో శివసేనకు కష్టకాలం మొదలైంది. షిండే శిబిరానికి వలస వెళ్లిన వారిని ఉద్దేశిస్తూ ఉద్దవ్ థాక్రే చురకలు అంటించారు. ఏక్‌నాథ్ షిండేకు మద్దతు ఇచ్చే వారంతాశివసేన పార్టీని ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. వెళ్లిపోయిన వాళ్ల గురించి తానెందుకు బాధపడాలంటూ అసహనం వ్యక్తం చేశారు. పార్టీ నేతలతో వర్చువల్‌గా సమావేశమైన థాక్రే ఈ వ్యాఖ్యలు చేశారు. శివసేనను వీడాల్సిన పరిస్థితి వస్తే చనిపోవటానికైనా సిద్ధమేనని, ఎంత కష్టకాలం వచ్చినా పార్టీని వీడమని ఒకప్పుడు ప్రగల్బాలు పలికిన వారంతా ఇప్పుడు షిండే వద్దకు పారిపోయారంటూ ఆగ్రహించారు. 

రంగంలోకి దిగిన ఆదిత్య థాక్రే 

శివసేనను, థాక్రే కుటుంబాన్ని కాదని ఎంత దూరం వెళతారో చూస్తానని అన్నారు. చెట్ల నుంచి పూలు, పండ్లు తీసుకోవచ్చని, కానీ వేర్లనుధ్వంసం చేయటం ఎవరి తరమూ కాదని స్పష్టం చేశారు. ఉద్దవ్ థాక్రే కొడుకు ఆదిత్య థాక్రే, రాష్ట్రంలోని ప్రస్తుతపరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఉన్నట్టుండి అంత మంది ఎమ్మెల్యేలు షిండే వైపు వెళ్లటానికి కారణాలేంటో ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పార్టీ నేతలతో సమావేశమయ్యారు ఆదిత్య థాక్రే. కొందరు ఎమ్మెల్యేలు, రెబల్ నేతలపై విరుచుపడ్డారని, కొందరైతే భావోద్వేగానికిలోనై ఏడ్చారని తెలుస్తోంది. 

గువాహటిలోని ఓ హోటల్‌లో షిండేకు మద్దతు తెలిపే ఎమ్మెల్యేలందరూ ఉన్నారు. ఈ వారాంతానికి ఆ శిబిరంలోని ఎమ్మెల్యేల సంఖ్య 50 దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదిత్య థాక్రే రంగంలోకి దిగటం వల్ల షిండే శిబిరం అప్రమత్తమైనట్టు సమాచారం. ఇప్పటికే ఆదిత్యథాక్రేపై కోపంగా ఉన్నారు షిండే. పార్టీలోని సీనియర్ నేతలంతా ఆదిత్యథాక్రేకే గౌరవం ఇస్తుండటాన్ని షిండే తట్టుకోలేకపోయారు. అయితే ఇదే విషయాన్ని ఉద్దవ్ థాక్రే ప్రస్తావించారు. "ఏక్‌నాథ్ షిండే తన కొడుకుని ఎంపీగా చేసినప్పుడు, నా కొడుకు రాజకీయంగా ఎదిగితే తప్పేముంది" అని అంటూ చురకలు అంటించారు. 

పవర్‌ గేమ్స్‌పై నాకు ఆసక్తి లేదు: ఉద్దవ్ థాక్రే 

"ప్రస్తుతానికి నా ఆరోగ్యం ఏమీ బాగాలేదు. శరీరమంతా నొప్పులుగా ఉంది. కళ్లు కూడా సరిగా తెరవలేకపోతున్నా. కానీ ఇదేమీ నేను లెక్క చేయటం లేదు. ఈ పవర్ గేమ్స్‌ నాకు నచ్చదు" అని స్పష్టం చేశారు ఉద్దవ్ థాక్రే. రాజకీయ అనిశ్చితి మొదలైనప్పటి నుంచి ఇలా రెండోసారిభావోద్వేగ ప్రసంగం చేశారు థాక్రే. రాజీనామా చేయాలని ఏ ఒక్క ఎమ్మెల్యే నేరుగా వచ్చి చెప్పినా వెంటనే పదవి నుంచి తప్పుకుంటాని వెల్లడించారు. అటు షిండే శిబిరంలో ఎమ్మెల్యేల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం వల్ల థాక్రే ప్రభుత్వం పడిపోక తప్పదన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Fact Check: రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Embed widget