Mourning Day in India: భారత్‌లో సంతాప దినం ఎందుకు పాటిస్తారు, గతంలోనూ ఇలా ప్రకటించారా?
గతంలో పలువురు అంతర్జాతీయ నేతలు మృతి చెందినప్పుడూ భారత్ సంతాప దినాలు ప్రకటించి నివాళులర్పించింది.
షింజో అబే మృతికి గౌరవంగా సంతాప దినం..
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతి, ఆ దేశాన్నే కాదు. భారత్‌నూ షాక్ గురి చేసింది. తనకు అత్యంత సన్నిహితుడైన అబే హత్యకు గురికావటం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగానికి గురయ్యారు. వరుస ట్వీట్‌లతో విచారం వ్యక్తం చేశారు. అంతే కాదు. దేశంలో "ఒకరోజు సంతాప దినం" పాటించాలని ప్రకటించారు. ఆయనపై ఉన్న గౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రధాని మోదీ. ఈ సంతాప దిన సందర్భంగా దేశంలోని అన్ని భవంతులపై త్రివర్ణ పతాకాన్ని సగం మాత్రమే ఎగర వేసి ఉంచుతారు. ఈ ఒక్క రోజు వినోదాలు, వేడుకలు పక్కన పెట్టాలని హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడే కాదు. గతంలోనూ భారత్, అంతర్జాతీయ నేతలు మృతి చెందినప్పుడు వారికి గౌరవ సూచకంగా సంతాప దినం నిర్వహించింది.
గతంలో వీరికీ సంతాప దినాలు ప్రకటించిన భారత్..
ఇరాన్‌కు తొలి సుప్రీమ్ లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన సయ్యిద్ రుహొల్లా ముసవి కొమినేని అలియాస్ అయతొల్ల కొమినేని మృతి చెందినప్పుడూ భారత్ సంతాప దినం ప్రకటించింది. 1979 నుంచి 1989 వరకూ అధికారంలో ఉన్నారు కొమినేని. 1989లో జూన్3 వ తేదీన కన్నుమూశారు. ఆ తరవాత పోప్ జాన్ పాల్-2 కూడా ఈ జాబితాలో ఉన్నారు. క్యాథలిక్ చర్చ్ హెడ్‌గా, వాటికన్ సిటీ అధిపతిగా ఉన్న జాన్‌పాప్ పోల్-2,2005లో ఏప్రిల్ 2వ తేదీన మృతి చెందారు. అప్పుడు ఏకంగా మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది భారత ప్రభుత్వం. దక్షిణాఫ్రికా తొలి అధ్యక్షుడిగా, ప్రజల పక్షాన నిలబడిన నాయకుడిగా చిరస్థాయిలో నిలిచిపోయే నెల్సన్ మండేలానూ ఇదే విధంగా గౌరవించింది భారత్. 2013లో జొహెన్నస్‌బర్గ్‌లో తుది శ్వాస విడిచారు మండేలా. ఆ సమయంలో భారత్‌లో 5 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు.
సింగపూర్ తొలి ప్రధాని లీ క్వాన్ యూ 2015లో మృతి చెందగా, ఒక రోజు సంతాప దినం ప్రకటించారు. లీ క్వాన్ అంత్యక్రియలకు ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. మధ్యప్రాచ్యంలో, అరబ్‌లో సుదీర్ఘ కాలం పాటు పరిపాలించిన సుల్తాన్ కబూస్ బిన్ సయ్యద్ అల్ సయ్యద్ 2020 జనవరిలో మృతి చెందారు. ఒమన్‌కు చాన్నాళ్లు సుల్తాన్‌గా వ్యవహరించారు. ఆ ఏడాది జనవరి 13వ తేదీన సంతాప దినం పాటించారు. మారిషస్ ప్రధానిగా, అధ్యక్షుడిగా వ్యవహరించిన అనిరూద్ జుగ్నౌత్ 2021లో మృతి చెందారు. అప్పుడూ ఒక రోజు సంతాప దినం పాటించారు. ఇటీవలే యూఏఈ రెండో అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జయెద్ అల్ తుది శ్వాస విడిచారు. ఈ ఏడాది మే 13న ఆయన మృతి చెందగా, 14వ తేదీన సంతాప దినం పాటించింది భారత ప్రభుత్వం.
Also Read: Cloudburst Near Amarnath Shrine : అమర్‌నాథ్ టెంపుల్ దగ్గర వరద బీభత్సం - ముప్పులో వేల మంది భక్తులు !