News
News
X

Cow Hug Day: కౌ హగ్‌ డే పై శశి థరూర్ ట్వీట్, అపార్థం చేసుకున్నారంటూ సెటైర్లు

Cow Hug Day: కౌ హగ్‌డే పై కాంగ్రెస్ నేత శశి థరూర్ సెటైర్లు వేశారు.

FOLLOW US: 
Share:

Shashi Tharoor on Cow Hug Day:

ట్విటర్‌లో సెటైర్‌..

ఫిబ్రవరి 14వ తేదీన Cow Hug Day జరుపుకోవాలంటూ కేంద్ర పశు సంక్షేమ శాఖ ప్రకటన చేసింది. తీవ్ర విమర్శలు రావడం వల్ల రెండ్రోజులకో మరో ప్రకటన చేసింది. ఈ నిర్ణయాన్నివెనక్కి తీసుకుంటున్నట్టు వెల్లడించింది. అయితే...ఈ మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ తనదైన స్టైల్‌లో సెటైర్లు వేశారు. ప్రతి అంశానికీ ఫన్నీ టచ్ ఇస్తూ ట్వీట్‌లు చేయడం శశి థరూర్‌కు అలవాటు. ఈ విషయంలోనూ అదే చేశారు. 

"నాకు తెలిసి కౌ హగ్ డే విషయంలో తప్పు దొర్లింది. కొందరు దీన్ని అపార్థం చేసుకున్నారు. అందరూ తమ పార్ట్‌నర్స్‌ని (Guy)ని కౌగిలించుకోవాలని చెప్పి ఉంటారు. కానీ కొందరు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. Guy కిగా బదులుగా Gaay(ఆవు)అని పొరపడి ఉంటారు" 

శశి థరూర్,కాంగ్రెస్ ఎంపీ 

కౌ హగ్ డే విషయంలో కేంద్రం వెనక్కి తగ్గిందా అని ప్రశ్నించగా...ఇలా ట్వీట్‌లో ఫన్నీగా రెస్పాండ్ అయ్యారు. ఇప్పటికే సోషల్ మీజియాలో కౌ హగ్ డేపై బోలెడన్ని మీమ్స్ వచ్చాయి. కొందరు సపోర్ట్ చేస్తూ పోస్ట్‌లు పెడుతుండగా మరి కొందరు మీమ్స్ షేర్ చేస్తున్నారు. మొత్తానికి మాటల యుద్ధానికి దారి తీసింది. ఇది గమనించిన కేంద్ర పశుసంక్షేమ శాఖ కీలక ప్రకటన చేసింది. కౌ హగ్‌ డే జరుపుకోవాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు వెల్లడించింది. 

ఇదీ జరిగింది..

కేంద్ర పశుసంక్షేమ శాఖ రెండ్రోజుల క్రితం కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవానికి బదులుగా "Cow Hug Day" జరుపుకోవాలని సూచించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. వాలెంటైన్స్ డే...పాశ్చాత్య సంస్కృతికి చెందిందని..దానికి బదులుగా ఆవుని కౌగిలించుకుని వాటితో మన బంధాన్ని బల పరుచుకోవాలంటూ పిలుపునిచ్చింది. భారతదేశ సంస్కృతిలో ఆవులకు ప్రత్యేక స్థానముంది. "గోమాత" అని కొలుస్తారు కూడా. భారతీయులకు, గోవులకు ఉన్న విడదీయలేని అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని పశు సంక్షేమ శాఖ లీగల్ అడ్వైజర్ వెల్లడించారు. 

"భారత దేశ ఆర్థిక వ్యవస్థకు, సంస్కృతికి ఆవులే వెన్నెముక లాంటివి. వాటితోనే మన మనుగడ కొనసాగుతోంది. జీవ వైవిధ్యానికి అవి ప్రతీకలు. అందుకే కామధేను, గోమాత అని రకరకాల పేర్లతో పిలుచుకుంటాం. అమ్మలా మనకు అన్నీ సమకూర్చుతుంది. మానవత్వాన్నీ కాపాడుతుంది. గోమాతను పూజించే వాళ్లందరూ ఫిబ్రవరి 14వ తేదీన Cow Hug Day జరుపుకోండి. గోమాత ప్రాధాన్యతను గుర్తించండి"

- పశు సంక్షేమ శాఖ 

Also Read: Turkey Earthquake: 94 గంటల పాటు శిథిలాల కిందే, బతకడం కోసం తన మూత్రం తానే తాగాడు

Published at : 11 Feb 2023 04:28 PM (IST) Tags: Shashi Tharoor Cow Hug Day Animal Welfare Board Cow Hug

సంబంధిత కథనాలు

నిజామాబాద్ జిల్లాకు గోల్డ్‌ మెడల్, భద్రాద్రి, హన్మకొండకు వెండి, ఖమ్మంకు కాంస్యం

నిజామాబాద్ జిల్లాకు గోల్డ్‌ మెడల్, భద్రాద్రి, హన్మకొండకు వెండి, ఖమ్మంకు కాంస్యం

LPG Cylinder Subsidy: పీఎంయూవై లబ్దిదారులకు గుడ్ న్యూస్, ఎల్పీజీ సిలిండర్ పై సబ్సిడీ మరో ఏడాది పొడిగింపు

LPG Cylinder Subsidy:  పీఎంయూవై లబ్దిదారులకు గుడ్ న్యూస్, ఎల్పీజీ సిలిండర్ పై సబ్సిడీ మరో ఏడాది పొడిగింపు

Bhatti Vikramarka Padayatra : టీఎస్పీఎస్పీ పేపర్ల లీకేజీకి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి - భట్టి విక్రమార్క

Bhatti Vikramarka Padayatra : టీఎస్పీఎస్పీ పేపర్ల లీకేజీకి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి - భట్టి విక్రమార్క

IGNOU: ఇగ్నోలో 200 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు- అర్హతలివే!

IGNOU: ఇగ్నోలో 200 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు- అర్హతలివే!

APPSC Group-4 Exam: 'గ్రూప్-4' మెయిన్స్ తేదీ ఖరారు, హాల్‌టికెట్లు ఎప్పటినుంచంటే?

APPSC Group-4 Exam: 'గ్రూప్-4' మెయిన్స్ తేదీ ఖరారు, హాల్‌టికెట్లు ఎప్పటినుంచంటే?

టాప్ స్టోరీస్

YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

YSRCP Reverse :   దెబ్బ మీద దెబ్బ  - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

AP Cag Report :  13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ,  మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల