By: ABP Desam | Updated at : 16 Dec 2022 05:22 PM (IST)
Edited By: Murali Krishna
పార్లమెంటు మెట్ల పైనుంచి జారిపడిన కాంగ్రెస్ నేత శశిథరూర్! ( Image Source : Getty )
Shashi Tharoor: కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ పార్లమెంటు మెట్లు దిగుతుండగా గురువారం జారిపడ్డారు. దీంతో ఆయన కాలికి గాయమైంది. పార్లమెంట్ సమావేశాలకు హాజరైన సందర్భంగా ఈ ఘటన జరిగింది.
జారిపడటంతో శశిథరూర్ ఎడమ కాలి మడమ బెణికింది. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. నడవలేని పరిస్థితిలో ఉన్నందున నియోజవర్గ పరిధిలో తాను హాజరుకావాల్సి ఉన్న కార్యక్రమాలను రద్దు చేసుకున్నట్లు శశిథరూర్ ట్వీట్ చేశారు. కాలికి పాస్లర్ వేసి ఉన్న కొన్ని ఫొటోలను షేర్ చేశారు.
A bit of an inconvenience: I badly sprained my left foot in missing a step in Parliament yesterday. After ignoring it for a few hours the pain had become so acute that I had to go to hospital. Am now immobilised w/a cast, missing Parliament today&cancelled wknd constituency plans pic.twitter.com/Ksj0FuchZZ
— Shashi Tharoor (@ShashiTharoor) December 16, 2022
తవాంగ్ ఘర్షణపై
భారత్- చైనా సైనికుల మధ్య ఇటీవల జరిగిన ఘర్షణపై శశిథరూర్ స్పందించారు. చైనా విషయంలో మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వ్యవహరించిన తీరుని గుర్తు చేశారు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంట్‌లో జవాబుదారీతనం ఉండాలని శశిథరూర్ అన్నారు. జాతీయ భద్రత అంశమైనా, అందులో కొన్ని రహస్యంగా ఉంచాల్సినవైనా...కొన్నింటిపై మాత్రం తప్పకుండా చర్చించే అవకాశం కల్పించాలని సూచించారు. రాజ్‌నాథ్ సింగ్ ఇచ్చిన వివరణ కూడా సంతృప్తికరంగా లేదని థరూర్ అన్నారు. ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా, ఏదో పొడిపొడిగా వివరణ ఇచ్చారని..ఇది ప్రజాస్వామ్యం అనిపించుకోదని మండి పడ్డారు.
Also Read: Viral Video: మంచులో ఒంటె ఎంజాయ్‌మెంట్ మామూలుగా లేదుగా!
Avalon IPO: ఏప్రిల్ 3 నుంచి అవలాన్ ఐపీవో - షేర్ ధర ఎంతో తెలుసా?
Breaking News Live Telugu Updates: రేపు మరోసారి ఢిల్లీకి సీఎం జగన్, రెండు వారాల్లోనే రెండోసారి హస్తినకు
Umesh Pal Case Verdict : యూపీ మాఫియా డాన్ అతీక్ అహ్మద్‌కు జీవిత ఖైదు - ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో యూపీ కోర్టు తీర్పు
MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్ భాషలో ఛాటింగ్!
Five Planets Alignment: రాత్రికి ఆకాశంలో అద్భుతం - ఆకట్టుకోనున్న పంచగ్రహ కూటమి..!
Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ, ఈడీ ఆఫీస్కు లీగల్ అడ్వైజర్ సోమా భరత్
Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్
Hyderabad Metro: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు భూసార పరీక్షలు ప్రారంభం - ఎలా చేస్తారంటే!
పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి క్లారిటీ - అనుమానంగా ఫోన్లు పెట్టేశారని ఆవేదన
Pan-Aadhaar: పాన్-ఆధార్ లింక్ గడువును పొడిగించే ఛాన్స్, మరో 3 నెలలు అవకాశం