అన్వేషించండి

Tamil Nadu Assembly Elections 2026: ఆ పార్టీని గెలిపిస్తే తమిళనాడుకు ఐదు రాజధానులు - రికార్డులు బద్దలు కొట్టేసిన సీమాన్

Seeman party : తమిళ రాజకీయాల్లోకి వచ్చిన దర్శకుడు సీమాన్ తన పార్టీ మేనిఫెస్టోలో కీలక విషయాలు వెల్లడించారు. తమను గెలిపిస్తే ఏకంగా ఐదు రాజధానులు చేస్తామని ప్రకటించారు.

Seeman party manifesto: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నామ్ తమిళర్ కట్చి తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. పార్టీ చీఫ్ కోఆర్డినేటర్ సీమాన్ చెన్నైలోని గిండీలో ఈ నివేదికను ప్రకటిస్తూ అనేక సంచలన హామీలను గుప్పించారు. 234 నియోజకవర్గాల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతున్న సీమాన్, అధికారంలోకి వస్తే రాష్ట్ర ముఖచిత్రాన్నే మారుస్తామని హామీ వస్తున్నాయి. 

సీమాన్ ఇచ్చిన హామీల్లో కీలకమైనది ఐదు రాజధానులు ఏర్పాటు చేయడం.  పాలనా సౌలభ్యం కోసం 5 రాజధానులు ఏర్పాటు చేసి.. తమిళనాడు సర్వతోముఖాభివృద్ధి చేస్తానని  మేనిఫెస్టోలో పేర్కొన్నారు. తిరుచ్చిని పరిపాలనా రాజధానిగా, కోయంబత్తూర్ ను వాణిజ్య రాజధాని గా..  కన్యాకుమారిని ఆధ్యాత్మిక/తత్వశాస్త్ర రాజధాని గా మారుస్తామని ప్రకటించారు. మిగిలిన రెండు నగరాలను కూడా ప్రత్యేక హంగులతో అభివృద్ధి చేస్తామన్నారు.

కుల ప్రాతిపదికన రిజర్వేషన్ల రద్దు 

సామాజిక సంస్కరణల్లో భాగంగా ప్రస్తుతమున్న కుల ఆధారిత రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేస్తామని సీమాన్ ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీనికి బదులుగా తమిళ పౌరసత్వ రిజర్వేషన్ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. అలాగే పార్లమెంటులో మహిళలకు ప్రత్యేక నియోజకవర్గాల కోసం పోరాడతామని తెలిపారు.

 రాష్ట్ర స్వయంప్రతిపత్తి - కీలక మార్పులు 

 రాష్ట్రంలో స్వయంప్రతిపత్తి - కేంద్రంలో కూటమి అనే నినాదంతో సాగుతామని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా రాష్ట్ర పరిధిలోని  రైల్వే యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండేలా చట్టం తీసుకొస్తామన్నారు.  నీటి వ్యాపారాన్ని పూర్తిగా రద్దు చేసి, ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటిని ఉచితంగా అందిస్తామని.. ప్రకృతి వైద్యానికి పెద్దపీట వేస్తూ ప్రత్యేకంగా సిద్ధ వైద్య మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే  మద్యం, పొగాకు, గంజాయి , ఇతర మాదకద్రవ్యాలను రాష్ట్రం నుండి పూర్తిగా తొలగిస్తామన్నారు.

  ఒంటరిగానే పోరు 

తమిళనాడులో ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి. డిఎంకె (DMK) 21 పార్టీలతో, అన్నాడిఎంకె (AIADMK) 10కి పైగా పార్టీలతో కూటములు కట్టి బరిలోకి దిగుతుండగా.. సీమాన్ సారథ్యంలోని నామ్ తమిళర్ కట్చి, విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీలు మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తున్నాయి. ఆవిర్భావం నుండి నామ్ తమిళర్ కట్చి ఏ కూటమితో కలవకుండా స్వతంత్రంగానే పోటీ చేస్తూ తన పంథాను కొనసాగిస్తోంది.                                                                   

 

టాప్ హెడ్ లైన్స్

Most Sugar Produced States: భారత్‌లో అత్యధికంగా చక్కెర ఉత్పత్తి చేసే టాప్ 5 రాష్ట్రాల జాబితా
భారత్‌లో అత్యధికంగా చక్కెర ఉత్పత్తి చేసే టాప్ 5 రాష్ట్రాల జాబితా
ABP Desam Top 10, 23 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 23 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
Adilabad Crime News: మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
Breaking News: హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Crime News: మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Mirai Japan Advance Booking: జపాన్‌లో మిరాయ్ సంచలనం.. బాహుబలి, దురంధర్‌ను దాటి దూకుడు
జపాన్‌లో మిరాయ్ సంచలనం.. బాహుబలి, దురంధర్‌ను దాటి దూకుడు
Most Sugar Produced States: భారత్‌లో అత్యధికంగా చక్కెర ఉత్పత్తి చేసే టాప్ 5 రాష్ట్రాల జాబితా
భారత్‌లో అత్యధికంగా చక్కెర ఉత్పత్తి చేసే టాప్ 5 రాష్ట్రాల జాబితా
రూ.10 వేలు చెల్లించి Hero Splendor Plus కొంటే ప్రతినెలా EMI ఎంత
రూ.10 వేలు చెల్లించి Hero Splendor Plus కొంటే ప్రతినెలా EMI ఎంత
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
Embed widget