అన్వేషించండి
Advertisement
14 th August 2024 News Headlines: దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీలు, భారత రెజ్లర్ వినేశ్ అప్పీల్‌పై తీర్పు మరోసారి వాయిదా వంటి మార్నింగ్ టాప్ న్యూస్
14h August 2024 School News Headlines Today: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తాజా వార్తల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఇది మీ స్కూల్ అసెంబ్లీలో చదవడానికి పనికొస్తాయి.
14h August 2024 School News Headlines Today:
నేటీ ప్రత్యేకత
- భారత దేశ విభజన జరిగి పాకిస్తాన్ ఏర్పడింది.
జాతీయ వార్తలు
- 78వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలకు దేశం సిద్ధమైంది. స్వాతంత్ర సంగ్రామంలో ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ దేశం స్వాతంత్ర్య దినోత్సవానికి సిద్ధమైంది. ప్రధాని మోదీ 11వసారి ఎర్రకోటపై జెండా ఎగరవేయన్నారు. స్వాతంత్ర సంబరాల వేళ ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎర్రకోట పరిసరాల్లో 700 ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
- స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీలు ఘనంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లోనూ త్రివర్ణ పతాకాలను చేతపట్టి భారీ ర్యాలీలను నిర్వహిస్తున్నారు. హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో పాల్గొనాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ వార్తలు
- విద్యాశాఖపై సచివాయలంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. విలువలతో కూడిన నాణ్యమైన విద్య అందించడం తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు అన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేస్తామని తెలిపారు. ప్రతిభ అవార్డులు, పేరెంట్ మీటింగులు ప్రభుత్వ స్కూళ్లలోనూ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
- ఇస్రో శాస్త్రవేత్తలు అసలైన హీరోలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. శ్రీహరికోటలో జరిగిన జాతీయ అంతరిక్ష ఉత్సవాల్లో పవన్ పాల్గొన్నారు. యువత, విద్యార్థులు సైంటిస్ట్‌లను ఆదర్శంగా తీసుకొని ప్రయోగాలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ వార్తలు
- తెలంగాణలో విద్యాసంస్థల్లో లోటుపాట్లపై గురుకులాల మాజీ కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలో అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తామని బీఆర్‌ఎస్ కార్య నిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. నాలుగైదు రోజుల్లో లోపాలు, సమస్యలపై నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని వెల్లడించారు.
- తెలంగాణలో డీఎస్సీ ప్రిలిమినరీ కీ విడుదలైంది. ప్రిలిమినరీ కీతో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్ ను పాఠశాల విద్యా శాఖ అధికారులు వెబ్ సైట్ లో ఉంచారు. ఈ నెల 20వ తేదీ వరకు ఆన్ లైన్ లో అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం ఇచ్చారు.
అంతర్జాతీయ వార్తలు
- బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 15న జాతీయ సంతాప దినంగా పాటించాలని పిలుపునిచ్చారు. షేక్ హసీనా తరపున ఆమె కుమారుడు సాజిబ్ వాజెద్ జాయ్ ఈ ప్రకటన చేశారు. ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపాన్ని తెలిపేందుకు ఆగస్టు 15న సంతాప దినంగా పాటించాలని పిలుపునిచ్చారు.
- ఇజ్రాయెల్‌పై హమాస్ రాకెట్ల వర్షం కురిపిస్తోంది. ఇజ్రాయెల్ రాజధాని టెల్‌అవీవ్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు హమాస్ ప్రకటించడం ఇప్పుడు ఉద్రిక్తతలను మరింత పెంచింది. హమాస్ దాడులను ఇజ్రాయెల్ ధ్రువీకరించింది.
క్రీడా వార్తలు
- కాస్‌లో భారత రెజ్లర్ వినేశ్ అప్పీల్‌పై తీర్పు మరోసారి వాయిదా పడింది. ఒలింపిక్స్‌లో తనపై అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తనకు కనీసం రజతమైనా ఇవ్వాలని వినేశ్.. కాస్‌ను అభ్యర్థించింది. దీనిపై తీర్పును కోర్టు ఈ నెల 16కు వాయిదా వేసింది.
మంచిమాట:
- జ్ఞానాన్ని ఒక మార్గంలో, అనుభవ మార్గంలో మాత్రమే పొందవచ్చు. తెలుసుకోవడానికి వేరే మార్గం లేదు. - -స్వామి వివేకానంద
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion