అన్వేషించండి
Advertisement
Top Headlines Today 11th September 2024 : తెలుగు రాష్ట్రాలకు కొత్త మెడికల్ కాలేజీలు మంజూరు, కోఠి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు వంటి మార్నింగ్ టాప్ న్యూస్
11th September 2024 News Headlines Today: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తాజా వార్తల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఇది మీ స్కూల్ అసెంబ్లీలో చదవడానికి పనికొస్తాయి.
11 th September 2024 News Headlines:
నేటి ప్రత్యేకత
- జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం
- మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహం ప్రారంభించాడు.
- స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది వినోబా భావే వర్ధంతి
- పాకిస్థాన్ జాతిపిత ముహమ్మద్ అలీ జిన్నా వర్థంతి
- నటుడు కృష్ణంరాజు వర్ధంతి
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు
- తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణకు నాలుగు, ఏపీకి రెండు కొత్త మెడికల్ కాలేజీలను కేటాయించింది. తెలంగాణలో యాదాద్రి భువనగిరి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్‌లో కాలేజీలకు అనుమతి ఇచ్చింది. ఏపీలో కడప, పాడేరుకు కేటాయించింది. ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభం అవుతాయని కేంద్రం పేర్కొంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
- ప్రకాశం బ్యారేజీ వద్ద భారీ బోట్ల తొలగింపు సాధ్యం కాలేదు. ఒక్కో బోటు బరువు 20 టన్నులపైనే ఉండటం.. ఇసుకలో కూరుకుపోవడంతో భారీ క్రేన్లు వినియోగించినా భారీ పడవలు ఇంచు కూడా కదల్లేదు. ప్లాన్-ఏ విఫలం కావడంతో ప్లాన్-బీ అమలు చేయనున్నారు. బోట్లను ముక్కలుగా కత్తిరించి తొలగించాలని నిర్ణయించారు.
- ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఆపరేషన్ బుడమేరును ప్రారంభిస్తామని ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. మున్సిపల్, ఇరిగేషన్ శాఖ, ఇతర సమన్వయ శాఖల అధికారులతో కలిసి ఈ ఆపరేషన్ చేపట్టనున్నట్లు వివరించారు.
తెలంగాణ వార్తలు
- సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరబాద్‌లోని కోఠి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టనున్నట్లు ప్రకటించారు. రవీంద్రభారతిలో జరిగిన ఐలమ్మ 39వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. చాకలి ఐలమ్మ చరిత్ర మరువలేనిదని చెప్పారు. ఆమె స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
- తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు జిల్లా టి. నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామం నుంచి జీడిపిక్కల లోడుతో బయలుదేరిన మినీ లారీ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అతి వేగం వల్లే లారీ బోల్తా పడినట్లు అనుమానిస్తున్నారు.
జాతీయ వార్తలు:
- ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా భారత్‌లోనూ తొలి కేసు నమోదైంది. అయితే నిర్దిష్ట వయసుగల వ్యక్తుల్లో మంకీపాక్స్ సంక్రమణ రేటు ఎక్కువగా ఉందని.. కేంద్రం తెలిపింది. యువకుల్లోనే ఎక్కువగా మంకీపాక్స్ కేసులు కనిపిస్తున్నాయని.. 18-44 ఏళ్ల వారు ఎక్కువగా ప్రమాదంలో ఉన్నట్లు హెచ్చరించింది.
- ఉత్తర్‌ప్రదేశ్ బహరయిచ్ జిల్లాలో తోడేళ్ల దాడులు... 50 గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అయితే, తోడేళ్లు వరుస దాడులకు పాల్పడటం అసాధారణమని నిపుణులు చెప్పారు. తోడేళ్లు రేబిస్ బారినపడటం వల్ల కాని కెనైన్ డిస్టెంపర్ వైరస్ సోకడం వల్లే అవి దాడులకు పాల్పడుతూ ఉండొచ్చని పేర్కొన్నారు.
- సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు రానున్న ఐదేళ్లలో 5 వేల సైబర్ కమాండోలను శిక్షణ ద్వారా సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. సైబర్ ప్రపంచాన్ని సురక్షితంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు.
- ఢిల్లీలో పారాలింపిక్స్ పతక విజేతలను కేంద్ర క్రీడామంత్రి మన్‌సుఖ్ మాండవియా ఘనంగా సన్మానించారు. గోల్డ్ మెడల్స్ సాధించిన క్రీడాకారులకు రూ.75 లక్షలు, రజతం గెలిచిన వారికి రూ.50 లక్షలు, కాంస్య పతక విజేతలకు రూ.30 లక్షలు నగదు బహుమతి అందజేస్తామని మాండవీయ తెలిపారు.
హైల్త్ టిప్:
- మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ 7 నుంచి 9 గంటల నిద్ర తప్పనిసరి. అలా నిద్ర లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. తక్కువగా నిద్రపోతే బరువు పెరిగి ఊబకాయం సమస్య ఏర్పడుతుంది. అంతే కాకుండా దీర్ఘకాలిక నిద్ర లేమి అధిక రక్తపోటుకు దారితీస్తుంది. నిద్రలేమి సమస్య క్రమంగా జ్ఞాపకశక్తి కోల్పోయేలా చేస్తుంది. నిద్ర లేమి సమస్య శరీరంలో ఒత్తిడిని పెంచుతుంది. మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
మంచిమాట
- మీరు గొప్ప పనులు చేయలేకపోతే... చిన్న పనులను గొప్పగా చేయండి..
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
క్రైమ్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement