Farmers Protest: సాగు చట్టాలకు వ్యతిరేకంగా ర్యాలీ.. అకాలీదళ్ చీఫ్, హర్‌సిమ్రత్ కౌర్ అరెస్ట్
రైతులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించినందుకు శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రధాని మోదీ సర్కార్ నూతన వ్యవసాయ చట్టాలను అమల్లోకి తీసుకొచ్చి నేటికి ఏడాది కావడంతో శిరోమణి అకాలీదళ్ సెప్టెంబర్ 17ను 'బ్లాక్ డే'గా ప్రకటించింది. కొత్త సాగు చట్టాలకు నిరసనగా దిల్లీలోని గురుద్వారా తాలాబ్‌గంజ్ సాహెబ్ నుంచి పార్లమెంట్ వరకు ర్యాలీ నిర్వహించాలని రైతులకు, పార్టీ కార్యకర్తలకు బాదల్ పిలుపునిచ్చారు. అయితే ఈ నిరసనలో పంజాబ్ నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చారు. సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
Delhi: Shiromani Akali Dal takes out a protest march from Gurdwara Rakab Ganj Sahib to the Parliament building on the completion of one year of the Centre's three farm laws pic.twitter.com/MV0x0ZTRur
— ANI (@ANI) September 17, 2021
బాదల్, హర్ సిమ్రత్ కౌర్ అరెస్ట్..
Leaders of Shiromani Akali Dal have been detained and are being taken to Sansad Marg Police Station: Delhi Police
— ANI (@ANI) September 17, 2021
They were taking out a protest march in the national capital on the completion of one year of Centre's three farm laws
అయితే ఎలాంటి అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహించిన కారణంగా శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్‌బీర్‌సింగ్ బాదల్, హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ సహా 11 మందిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
Modi govt & Haryana govt stopped our workers. They resorted to baton charge&broke our vehicles. A peaceful protest was stopped. We've come here to give a message to PM Modi that not only Punjab but entire country is against his govt: Sukhbir Singh Badal, Shiromani Akali Dal chief pic.twitter.com/aSWzRNdxpm
— ANI (@ANI) September 17, 2021
ఈ విషయం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో దిల్లీ సహా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.