Seema Patra: పని మనిషిని దారుణంగా హింసించిన కేసులో భాజపా నేత అరెస్ట్
Seema Patra: పని మనిషిని అత్యంత దారుణంగా వేధించిన కేసులో భాజపా నేత సీమా పాత్రను పోలీసులు అరెస్ట్ చేశారు.
Seema Patra Arrested:
విషయం తెలియగానే సస్పెండ్..
ఝార్ఖండ్‌లో సస్పెండ్‌కు గురైన భాజపా నేత సీమా పాత్రను రాంచీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంట్లో పని చేసే మహిళను దారుణంగా హింసించిన కేసులో ఆమె అరెస్ట్ అయ్యారు. అర్గోరా పోలీస్ స్టేషన్‌లో ఆమెపై కేసు నమోదైంది. ఆమె చేతిలో హింసకు గురైన మహిళ వీడియో బయటకు రావటం వల్ల ఒక్కసారిగా ఇది సంచలనమైంది. ఝార్ఖండ్‌లోని బీజేపీ మహిళా విభాగం నేషనల్ వర్కింగ్ కమిటీ సభ్యురాలిగా పని చేసిన సీమా పాత్ర...మాజీ ఐఏఎస్ అధికారి భార్య. ఆమె ఇంట్లో పని చేస్తున్న సునీత అనే మహిళను ఆగస్టు 22న పోలీసులు రక్షించారు. సీమా...ఆమెను దారుణంగా కొట్టినట్టు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతానికి రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS)లో చికిత్స
పొందుతోంది. ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే...ఝార్ఖండ్ భాజపా అధ్యక్షుడు దీపక్ ప్రకాశ్...సీమా పాత్రను సస్పెండ్ చేశారు. అప్పటికే సోషల్ మీడియాలో బాధితురాలు వీడియోలు వైరల్ అయ్యాయి. సీమా పాత్రను సస్పెండ్ చేయాలన్న డిమాండ్ వినిపించటం వల్ల వెంటనే ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సీమా పాత్రను అరెస్ట్ చేసిన పోలీసులు...బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.
#UPDATE | Jharkhand | Ranchi police arrested Seema Patra, suspended BJP leader and wife of ex-IAS officer for torturing her maid. The case was registered at Argora police station: Ranchi police https://t.co/ggg2IYoXpj
— ANI (@ANI) August 31, 2022
Ranchi, Jharkhand | Police team rescued a 29-yr-old woman working as a domestic help at the residence of an-ex IAS officer on Aug 22, after she was allegedly physically tortured by her employer. Case registered; probe on. The woman is currently undergoing medical treatment:Police
— ANI (@ANI) August 30, 2022
సీరియస్‌గా తీసుకున్న గవర్నర్
ఆసుపత్రి బెడ్‌పై నుంచే బాధితురాలు సంచలన నిజాలు వెల్లడించింది. తాను ఎంత హింసకు గురైందో వివరించింది. సీమా పాత్ర...తనను రాడ్స్‌తో, ఐరన్ పాన్‌తో కొట్టినట్టు తెలిపింది. చెప్పటానికి కూడా వీల్లేని విధంగా హింసించినట్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఐరన్ రాడ్‌తో కొట్టటం వల్ల పళ్లు రాలిపోయాయని చెప్పింది. సీమా పాత్ర కొడుకు ఆయుష్‌మాన్ తనకు సాయం అందించాడని తెలిపింది. బాధితురాలి దీన స్థితిని చూసిన ఆయుష్‌మాన్...తన స్నేహితుడితో ఇదంతా చెప్పాడు. ఎలాగైనా ఆమెను కాపాడాలని నిర్ణయించుకున్నారు. ఆ ఇద్దరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి ఆ చెర నుంచి బాధితురాలిని రక్షించారు. ఈ విషయంలో బాధితురాలికి సాయం చేసిన తన కొడుకుని సీమా పాత్ర..రాంచీలోని ఓ ఆసుపత్రిలో బలవంతంగా చేర్పించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి సునీత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఝార్ఖండ్ గవర్నర్ రమేశ్ బియాస్ కూడా ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. నిందితురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతానికి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
Also Read: Hyderabad: మూడేళ్ల చిన్నారి మలద్వారంలోకి ఇనుప రాడ్, కన్నతల్లిదే అసలు ప్లాన్! ఆమె ప్రియుడు ఘోరం