అన్వేషించండి

సుప్రీంకోర్టు దెబ్బకి దిగొచ్చిన పతంజలి, క్షమాపణలు కోరుతూ న్యూస్‌పేపర్‌లలో భారీ ప్రకటనలు

Patanjali Misleading Ads Case: సుప్రీంకోర్టు మందలించడంతో పతంజలి సారీ చెబుతూ న్యూస్ పేపర్‌లలో భారీ ఎత్తున ప్రకటనలు చేసింది.

Ramdev's Apology in News Papers: పతంజలి ప్రకటనల వివాదం (Patanjali misleading ads case) ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్నిసార్లు మందలించినా తీరు మార్చుకోవడం లేదంటూ సుప్రీంకోర్టు ఇప్పటికే అక్షింతలు వేసింది. ఆ తరవాత రామ్‌దేవ్‌ బాబాతో పాటు ఆచార్య బాలకృష్ణ స్పందించారు. కోర్టుకు క్షమాపణలు చెప్పారు. అయితే...పేపర్లలో పతంజలి ప్రకటనలు ఏ సైజ్‌లో అయితే వేస్తారో అదే సైజ్‌లో క్షమాపణలు చెబుతూ ప్రకటనలు వేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఇప్పటికే ఓ రోజు యాడ్స్‌ వేసిన పతంజలి వరుసగా రెండోరోజూ ప్రకటన ఇచ్చింది. "unconditionally apologise" పేరుతో పెద్ద పెద్ద ప్రకటనలు వేయించింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసినందుకు అందరినీ క్షమాపణలు కోరుతున్నట్టు అందులో పేర్కొంది. 

"ఇప్పటి వరకూ మా ప్రకటనల్లో వచ్చిన తప్పులకు క్షమాపణలు కోరుతున్నాను. ఇలాంటి పొరపాటు మళ్లీ జరగకుండా జాగ్రత్తపడతాం. ఇకపై నిబద్ధతగా ఉంటాం"

- పతంజలి 

సుప్రీంకోర్టు దెబ్బకి దిగొచ్చిన పతంజలి, క్షమాపణలు కోరుతూ న్యూస్‌పేపర్‌లలో భారీ ప్రకటనలు

అంతకు ముందు సుప్రీంకోర్టు పతంజలిపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపింది. పతంజలి ఉత్పత్తులపై న్యూస్‌ పేపర్‌లలో భారీ ఎత్తున ప్రకటనలు ఇస్తున్న విషయాన్ని ప్రస్తావించింది. క్షమాపణలు కూడా అదే స్థాయిలో చెప్పాలని స్పష్టం చేసింది. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహ్‌సనుద్దీన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనానికి రామ్‌దేవ్‌ బాబా వివరణ ఇచ్చారు. దాదాపు 67 వార్తాపత్రికల్లో క్షమాపణలు కోరుతూ ప్రకటనలు ఇచ్చినట్టు వెల్లడించారు. వీటి కోసం తమ సంస్థ రూ.10 లక్షలు ఖర్చు చేసినట్టు తెలిపారు. అయితే...క్షమాపణలు చెప్పిన తీరునీ తప్పుబట్టింది కోర్టు. 

"మీరు ఇచ్చిన ప్రకటనల సైజ్‌ని మార్చి మాకు చూపించకండి. వాటిని ఏ సైజ్‌లో ప్రింట్ చేయించారో చెప్పండి. ఇంత చిన్నగా ఉంటే మైక్రోస్కోప్‌లు పెట్టుకుని చూడాలా..? కేవలం పేపర్‌మీద కనిపిస్తే చాలదు. అందరికీ కనిపించాలి"

- సుప్రీంకోర్టు 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

JC Prabhakar Reddy: చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Ram Charan Unstoppable 4: బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
Ind Vs Aus Test Series; మళ్లీ తోకను తెంచలేకపోయారు.. టెయింలెండర్ల చలవతో ఆసీస్‌కు భారీ ఆధిక్యం- 70 ఏళ్ల రికార్డ్ కొడితేనే నెగ్గుతాం
మళ్లీ తోకను తెంచలేకపోయారు.. టెయింలెండర్ల చలవతో ఆసీస్‌కు భారీ ఆధిక్యం- 70 ఏళ్ల రికార్డ్ కొడితేనే నెగ్గుతాం
Satirical Song On Allu Arjun: అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JC Prabhakar Reddy: చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Ram Charan Unstoppable 4: బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
Ind Vs Aus Test Series; మళ్లీ తోకను తెంచలేకపోయారు.. టెయింలెండర్ల చలవతో ఆసీస్‌కు భారీ ఆధిక్యం- 70 ఏళ్ల రికార్డ్ కొడితేనే నెగ్గుతాం
మళ్లీ తోకను తెంచలేకపోయారు.. టెయింలెండర్ల చలవతో ఆసీస్‌కు భారీ ఆధిక్యం- 70 ఏళ్ల రికార్డ్ కొడితేనే నెగ్గుతాం
Satirical Song On Allu Arjun: అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
Small Saving Schemes: పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు పెరుగుతాయా, గుడ్‌ న్యూస్‌ వింటామా?
పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు పెరుగుతాయా, గుడ్‌ న్యూస్‌ వింటామా?
Bumrah Record Alert: బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
Komatireddy Venkat Reddy: నిరుపేద విద్యార్ధినికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అండ, ఇటలీ విద్యకు ఆర్థిక సాయం
నిరుపేద విద్యార్ధినికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అండ, ఇటలీ విద్యకు ఆర్థిక సాయం
Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Embed widget