Rajasthan BJP MLA: అసెంబ్లీకి ఆవుని తీసుకొచ్చిన ఎమ్మెల్యే, ఉన్నట్టుండి పరుగో పరుగు
Rajasthan BJP MLA: రాజస్థాన్ భాజపా ఎమ్మెల్యే ఆవుని అసెంబ్లీకి తీసుకువచ్చారు.
Rajasthan BJP MLA:
లంపీ స్కిన్ సమస్యను చెప్పేందుకే..
రాజస్థాన్‌లో భాజపా ఎమ్మెల్యే సురేష్ సింగ్ రావత్ ఇటీవల అసెంబ్లీకి ఆవును పట్టుకుని వచ్చారు. లంపీ స్కిన్ ( Lumpy Skin Disease)వ్యాధితో పశువులు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ఇలా ఆవును అసెంబ్లీకి తోలుకుని వచ్చారు సురేష్ సింగ్. అయితే..ఆయన అసెంబ్లీ ప్రాంగణంలోకి అడుగు పెట్టకముందే...అది అక్కడి నుంచి పారిపోయింది. ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడు తుండగా ఉన్నట్టుండి అక్కడి నుంచి పరుగులు తీసింది ఆవు. పలుపు తాడు పట్టుకున్న వ్యక్తి ఆవుని కట్టడి చేసేందుకు ప్రయత్నించినా...అది ఆగకుండా వేగంగా పారిపోయింది. అయితే...ఈ ఘటననూ తనకు అనుకూలంగా మలుచుకున్నారు రావత్. కాంగ్రెస్ ఎమ్మెల్యే గోవింద్ సింగ్ దొతాస్రాకు బదులిస్తూ.."ప్రభుత్వ తీరుతో ఆవులు కూడా కోపంగా ఉన్నాయి" అని కామెంట్ చేశారు. అసెంబ్లీకి ఆవుని తీసుకొచ్చిన సమయంలో చేతిలో కర్ర పట్టుకుని మీడియాతో రావత్ మాట్లాడారు. ఆవులు లంపీ స్కిన్ వ్యాధితో బాధ పడుతున్నాయని, కానీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టనట్టుగా వ్యవహరిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. "ప్రభుత్వం దృష్టిని ఈ సమస్య వైపు మరల్చేందుకే...విధాన సభకు నేను ఆవుని తీసుకుని వచ్చాను" అని చెప్పారు రావత్. పశుసంవర్ధక శాఖ లెక్కల ప్రకారం...ఈ నెల 19వ తేదీన 59 వేలకుపైగా పశువులు ఈ వ్యాధి బారిన పడి మృతి చెందాయి. ఇప్పటికే 13 లక్షల పశువులకు ఈ వ్యాధి సోకింది.
What happened when Bjp mla from Pushkar reached Rajasthan assembly with a cow🤣🤣🤣 pic.twitter.com/I7UHaxjqQ6
— Surbhi✨ (@SurrbhiM) September 20, 2022
नौटंकी करने का काम सिर्फ कांग्रेस का है। किसान आंदोलन पर बेवजह हल्ला मचाने वाली कांग्रेस अब प्रदेश में हो रही गौवंश की दुर्दशा पर चुप क्यों है ??
— Suresh Singh Rawat (@SureshRawatIN) September 20, 2022
और रही बात गाय के वहां से जाने कि तो शायद उसे आपके कुशासन वाली सत्तासीन विधानसभा में जाने का मन नहीं था। https://t.co/7s6c7Fdgux
Also Read: Ant Research: ఈ భూమి మీద మొత్తం ఎన్ని చీమలున్నాయో తెలుసా?अब तो गौ माता को भी भाजपा की "नौटंकी" समझ आ गई, आज राजस्थान विधानसभा के सामने भाजपा की झूठी गौभक्ति की पोल खुद गौ माता ने खोली। pic.twitter.com/mNctgrLXJj
— Govind Singh Dotasra (@GovindDotasra) September 19, 2022
Also Read: Viral News: ట్రాఫిక్ వల్లే మా లవ్ సక్సెస్ అయింది, ఓ నెటిజన్ ప్రేమకథ చదువుతారా?