By: Ram Manohar | Updated at : 10 Apr 2023 03:05 PM (IST)
అమృత్ పాల్ సింగ్ సన్నిహితుడు పపల్ ప్రీత్ సింగ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. (Image Credits: Twitter)
Amritpal Singh News:
పపల్ ప్రీత్ సింగ్ అరెస్ట్..
ఖలిస్థాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ సన్నిహితుడు పపల్ ప్రీత్ సింగ్ (Papalpreet Singh Arrest)ను పోలీసులు అరెస్ట్ చేశారు. హోషియార్‌పూర్‌లో పంజాబ్ పోలీసులు ఢిల్లీ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. మార్చి 18 నుంచి అమృత్ పాల్ సింగ్, పపల్‌ప్రీత్ సింగ్ పరారీలో ఉన్నారు. చాలా చోట్ల ఇద్దరూ కలిసే తిరిగినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే..హోషియార్‌పూర్‌లో మాత్రం ఎవరికి వాళ్లు వేరు వేరు దారుల్లో వెళ్లినట్టు తెలిపారు. సెర్చ్ ఆపరేషన్ చేసిన పోలీసులు పపల్ ప్రీత్‌ను అరెస్ట్ చేశారు. అమృత్ పాల్కి రైట్ హ్యాండ్ అయిన పపల్ ప్రీత్ అరెస్ట్‌తో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. అయితే..ABP News సోర్సెస్ ప్రకారం..పపల్ ప్రీత్ సింగ్ తన కుటుంబంతో కొన్ని కీలక విషయాలు చెప్పినట్టు తెలుస్తోంది. "అమృత్ పాల్ సింగ్ ఇలా తప్పించుకుని తిరుగుతూ బాగా అలిసిపోయాడు. అందుకే తాను ఎక్కడున్నది కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఆ తరవాతే పోలీసులకు వీడియో పంపాడు. పోలీసులు పట్టుకోలేకపోతే తనంతట తానుగా లొంగిపోతాడు" అని పపల్ ప్రీత్ తన సన్నిహితులకు చెప్పినట్టు సమాచారం.
Pro-Khalistani sympathiser Amritpal Singh's aide Papalpreet Singh arrested from Hoshiarpur in an operation conducted by Punjab Police and its counter-intelligence unit: Sources pic.twitter.com/viDBYofrNd
— ANI (@ANI) April 10, 2023
పోలీసుల సెలవులు రద్దు..
ఖలిస్థాన్ వేర్పాటు వాది అమృత్ పాల్ సింగ్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. రేపో మాపో పోలీసుల ఎదుట లొంగిపోతారని వార్తలు వస్తున్నప్పటికీ...అవేవీ నిజం కావడం లేదు. పైగా పోలీసులకే సవాలు విసురుతూ వీడియోలు విడుదల చేస్తున్నాడు అమృత్ పాల్. నేరుగా మా ఇంటికే వచ్చి పట్టుకోవచ్చుగా అంటూ సెటైర్లు వేస్తున్నాడు. పంజాబ్ పోలీసులు మాత్రం ఇంకా అమృత్ పాల్ కోసం గాలిస్తూనే ఉన్నారు. క్షణం కూడా తీరిక లేకుండా డ్యూటీలోనే ఉండాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే పంజాబ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 14వ తేదీ వరకూ అందరి లీవ్స్ క్యాన్సిల్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఏప్రిల్ 14న పంజాబీలకు కీలకమైన సర్బత్ ఖల్సా కార్యక్రమం జరగనుంది. ఆ సందర్భంగా అకల్ తక్త్ సంస్థ ఆధ్వర్యంలో వేడుకలు జరగనున్నాయి. పైగా..ఈ వేడుకలు చేయాలని అమృత్ పాల్ సింగే సూచించాడు. ఆ రోజే అమృత్ పాల్ లొంగిపోతాడన్న వాదనా వినిపిస్తోంది. అందుకే అప్పటి వరకూ పోలీసులు నిఘా పెట్టాలన్న ఉద్దేశంతో అందరి సెలవులనూ రద్దు చేశారు. ఇప్పటికే లీవ్ సాంక్షన్ చేసిన వారికీ క్యాన్సిల్ చేసేశారు. పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. గెజిటెడ్తో పాటు నాన్ గెజిటెడ్ ఆఫీసర్ల సెలవులనూ రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. అకల్ తక్త్ చీఫ్ జతేర్దాస్తోనూ మాట్లాడాడు అమృత్ పాల్. అయితే...సిక్కుల్లోని ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులను సంప్రదించి సర్బత్ ఖల్సా నిర్వహించాలా వద్దా అన్న నిర్ణయం తీసుకోనుంది అకల్ తక్త్.
Also Read: Congress message to Pilot: సచిన్ పైలట్‌కు హైకమాండ్ వార్నింగ్? క్రమశిక్షణా చర్యలు తప్పవా!
Raghunandan Rao: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు లీగల్ నోటీసులు, రూ.1000 కోట్ల పరువునష్టం దావా
CEERI: రాజస్థాన్ సీఎస్ఐఆర్-సీఈఈఆర్‌ఐలో 20 సైంటిస్ట్ పోస్టులు
Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
Bonda Uma: టీడీపీ సంక్షేమ మేనిఫెస్టోతో తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి- బొండా ఉమా
Anakapalli Lovers: లాడ్జిలో రూం తీసుకొని లవర్స్ ఆత్మహత్యాయత్నం, యువతి మృతి, కొనఊపిరితో యువకుడు!
4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం
'యూత్ ను ఎంకరేజ్ చేయాలే, ధమ్ ధమ్ చేయొద్దు' - జక్కన్న ట్వీట్ వైరల్!
లవ్ బూత్‌లో మెహ్రీన్ - హలో హనీ హార్ట్ మిస్సాయే అంటున్న ఫ్యాన్స్!
AP Land Registrations: ఏపీలో నిలిచిన ల్యాండ్ రిజిస్ట్రేషన్లు! సర్వర్ డౌన్ అంటున్న స్టాఫ్ - జనాల పడిగాపులు!