PM Modi: మెట్రో స్టేషన్ గోడలపై మోదీకి వ్యతిరేకంగా ఖలిస్థానీల రాతలు, అలెర్ట్ అయిన పోలీసులు
Graffiti Slogans Agianst PM Modi: ఢిల్లీ మెట్రో స్టేషన్ గోడలపై ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఖలిస్థాన్‌కి మద్దతుగా కొందరు గ్రాఫిటీతో రాతలు రాయడం కలకలం రేపుతోంది.

Graffiti Slogans on Metro Walls: ఢిల్లీ మెట్రో స్టేషన్ గోడలపై ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కొందరు దుండగులు అభ్యంతరకర రాతలు రాశారు. ఖలిస్థాన్‌కి మద్దతుగా గ్రాఫిటీతో నినాదాలు రాశారు. కరోల్‌బాగ్, ఝండేవాలా మెట్రో స్టేషన్‌ల వద్ద ఇవి కనిపించడం కలకలం సృష్టించింది. వెంటనే అధికారులు అప్రమత్తమై వాటిని చెరిపేశారు. ఢిల్లీ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఈ రెండు మెట్రో స్టేషన్‌ల వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ ఫుటేజ్ ఆధారంగా ఎవరు ఈ పని చేశారో గుర్తిస్తామని వెల్లడించారు.
#WATCH | Delhi: Pro-Khalistan graffiti and slogans against PM Modi were found written on pillars of Karol Bagh and Jhandewalan Metro stations today. Police lodged an FIR in the case and requested CCTV footage from the concerned metro stations. pic.twitter.com/SG9nKX9sJS
— ANI (@ANI) May 12, 2024
గతంలోనూ నిహార్ విహార్ ప్రాంతంలో ఇదే విధంగా ఓ గవర్నమెంట్ స్కూల్‌పై గోడలపై ఇలాగే గ్రాఫిటీతో ఖలిస్థాన్ నినాదాలు రాయడం కలకలం రేపింది. "జనవరి 26 ఖలిస్థాన్" అని రాశారు. ఎవరూ పెద్దగా గమనించని ప్రాంతాల్లో,సీసీ కెమెరాలు లేని చోట ఇలాంటి రాస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. అప్పట్లో ఖలిస్థాన్ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నున్ భారత్‌పై దాడి చేస్తామంటూ బెదిరించారు. సరిగ్గా ఆ సమయంలోనే గోడలపై ఈ రాతలు కనిపించడం అలజడి సృష్టించింది. ఇప్పుడు మరోసారి ఢిల్లీ మెట్రో గోడలపై ఇలాంటి రాతలే కనిపించడంపై పోలీసులు అప్రమత్తమయ్యారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

