అన్వేషించండి

Prakash Raj Ram controversy: రాముడు, లక్ష్మణులను వలస కూలీలతో పోల్చిన ప్రకాష్ రాజ్ - హిందూవాదుల తీవ్ర ఆగ్రహం

Lord Rama: ప్రకాష్ రాజ్ కేరళలో జరిగిన ఒక సాహిత్య ఉత్సవంలో రామాయణాన్ని కల్పిత కథగా మలిచి చెప్పడం వివాదాస్పదమయింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Prakash Raj controversial comments on Lord Rama: ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కేరళలో జరిగిన ఒక సాహిత్య ఉత్సవంలో రామాయణంపై చేసిన వింత వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిణామాలను విమర్శించే క్రమంలో ఆయన రామాయణాన్ని ఒక కల్పిత కథగా మలిచి చెప్పడం వివాదానికి కేంద్రబిందువైంది. శ్రీరాముడు ,లక్ష్మణుడిని ఉత్తర భారతం నుండి వచ్చిన వలస కార్మికులుగా ఆయన అభివర్ణించడంపై హిందూ సంఘాలు, నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆయన తన ప్రసంగంలో రామాయణ పాత్రలను కించపరిచేలా మాట్లాడుతూ.. రాముడు, లక్ష్మణుడు దక్షిణాదిలోని ఒక తోటలోకి ప్రవేశించి అక్కడ పండ్లను దొంగతనంగా తిన్నారని ఎద్దేవా చేశారు. ఆ సమయంలో ఆ తోట యజమాని అయిన రావణుడితో వారికి గొడవ జరిగిందని, అదే రామాయణ యుద్ధానికి కారణమన్నట్లుగా ఒక కొత్త వెర్షన్‌ను వినిపించారు. పవిత్రంగా భావించే పురాణేతిహాసాన్ని ఇలా అపహాస్యం చేయడం వెనుక ఆయనకు హిందూ ధర్మంపై ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని విమర్శలు వస్తున్నాయి.

సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రకాష్ రాజ్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం లేదా ఒక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడం కోసం రామాయణాన్ని వక్రీకరించడం క్షమించరాని నేరమని వారు మండిపడుతున్నారు. ముఖ్యంగా ఉత్తర ,దక్షిణ భారత దేశాల మధ్య ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని, వలస కూలీల ప్రస్తావన తీసుకురావడం వెనుక దురుద్దేశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.           

ఈ వివాదంపై స్పందిస్తూ పలువురు ప్రముఖులు,  సామాన్య ప్రజలు ప్రకాష్ రాజ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో మత విశ్వాసాలను దెబ్బతీయడం సరైంది కాదని హితవు పలుకుతున్నారు. అంతేకాకుండా, ఆయనకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వకూడదని, చిత్ర పరిశ్రమ నుంచి ఆయనను బహిష్కరించాలనే డిమాండ్లు కూడా నెట్టింట గట్టిగా వినిపిస్తున్నాయి.     

మరోవైపు, ప్రకాష్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు సభలో ఉన్నవారు నిరసన తెలపకుండా చప్పట్లు కొట్టి ప్రోత్సహించడంపై కూడా విస్మయం వ్యక్తమవుతోంది. గతంలో కూడా అనేకసార్లు తన రాజకీయ,  సామాజిక వ్యాఖ్యల వల్ల వివాదాల్లో నిలిచిన ప్రకాష్ రాజ్, ఈసారి నేరుగా పురాణ పురుషులను దొంగలుగా చిత్రించడం ఆయన కెరీర్‌పై మరియు వ్యక్తిగత ప్రతిష్ఠపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

TTD LIC Insurance Scheme: తిరుమల భక్తులకు టీటీడీ భరోసా.. సహజ మరణానికీ రూ.2 లక్షల బీమా.. తొలిసారిగా బీమా మొత్తం అందజేత
తిరుమల భక్తులకు టీటీడీ భరోసా.. సహజ మరణానికీ రూ.2 లక్షల బీమా.. తొలిసారిగా బీమా మొత్తం అందజేత
Kakinada Fishermen Boat Missing: సముద్రంలో గల్లంతైన ఉప్పాడ మత్స్యకారుల బోటు.. గాలింపు చర్యలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆదేశాలు
సముద్రంలో గల్లంతైన ఉప్పాడ మత్స్యకారుల బోటు.. గాలింపు చర్యలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆదేశాలు
Vaibhav Sooryavanshi World Record: చరిత్రను తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీతో అరుదైన ప్రపంచ రికార్డు, 28 బంతుల్లో శతకంతో పాటు 28 సిక్సర్లతో సునామీ
చరిత్రను తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీతో అరుదైన ప్రపంచ రికార్డు, 28 బంతుల్లో శతకంతో పాటు 28 సిక్సర్లతో సునామీ
Gaganayan Mission: గగన్‌యాన్‌కు సిద్ధమవుతున్న భారత వ్యోమగాములు.. రష్యాలో Zero Gravity Training!
గగన్‌యాన్‌కు సిద్ధమవుతున్న భారత వ్యోమగాములు.. రష్యాలో Zero Gravity Training!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vaibhav Sooryavanshi World Record: చరిత్రను తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీతో అరుదైన ప్రపంచ రికార్డు, 28 బంతుల్లో శతకంతో పాటు 28 సిక్సర్లతో సునామీ
చరిత్రను తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీతో అరుదైన ప్రపంచ రికార్డు, 28 బంతుల్లో శతకంతో పాటు 28 సిక్సర్లతో సునామీ
TVK MLA Arul Vignesh: మహిళా కలెక్టర్‌కు వేధింపులు.. సీఎం విజయ్‌కి తలనొప్పిగా టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌ వ్యవహారం!
మహిళా కలెక్టర్‌కు వేధింపులు.. సీఎం విజయ్‌కి తలనొప్పిగా TVK ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌ వ్యవహారం
బాచుపల్లిలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌ క్లీన్ చేస్తూ ఊపిరాడక ముగ్గురు యువకులు మృతి!
బాచుపల్లిలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌ క్లీన్ చేస్తూ ఊపిరాడక ముగ్గురు యువకులు మృతి!
Trainee IPS Harassment Case: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ట్విస్ట్.. ఏ2గా సోదరుడు ప్రణయ్ పేరు చేర్చిన పోలీసులు
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ట్విస్ట్.. ఏ2గా సోదరుడు ప్రణయ్ పేరు
దేవ దీపావళి 2026: వారణాసిలో లేజర్, డ్రోన్ షోలతో 11 లక్షల దీపాల వెలుగులు!
దేవ దీపావళి 2026: వారణాసిలో లేజర్, డ్రోన్ షోలతో 11 లక్షల దీపాల వెలుగులు!
MIM Murtuza Pahalwan Murder: శంషాబాద్‌లో ఎంఐఎం నేత ముర్తుజ పైల్వాన్ దారుణ హత్య.. కత్తులతో 10 మంది మెరుపు దాడి!
శంషాబాద్‌లో ఎంఐఎం నేత ముర్తుజ పైల్వాన్ దారుణ హత్య.. కత్తులతో 10 మంది మెరుపు దాడి!
లాంచ్‌కు ముందే షోరూమ్‌లో దర్శనమిచ్చిన Bajaj Pulsar 125 Neon.. పాత క్లాసిక్ లుక్‌తో అదరగొడుతున్న బైక్!
తక్కువ ధరలో కొత్త పల్సర్ 125 వస్తోందా? లాంచ్‌కు ముందే కనిపించిన Bajaj Pulsar 125 Neon
Contaminated Drinking Water : కలుషితమైన నీరు తాగుతున్నారా? కిడ్నీలు, లివర్‌పై ప్రభావం ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కలుషితమైన నీరు తాగుతున్నారా? కిడ్నీలు, లివర్‌పై ప్రభావం ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
Embed widget