FIR Against Sadhguru: సద్గురు జగ్గీ వాసుదేవ్, అసోం సీఎం హిమంతపై కేసు- ఎందుకంటే?
FIR Against Sadhguru: ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మపై కేసు నమోదైంది.
FIR Against Sadhguru: అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్‌పై కేసు నమోదైంది. ఆదివారం కజిరంగా జాతీయ పార్కులో సూర్యాస్తమయం తర్వాత వీరు జీపులో సఫారీ యాత్రకు వెళ్లినందుకు ఈ కేసు పెట్టినట్లు తెలుస్తోంది.
సీఎం, సద్గురుతో పాటు వారితో వెళ్లిన మంత్రి, ఇతరులపైనా గ్రామస్థులు కేసు పెట్టారు. చట్టాన్ని ఉల్లంఘించినందుకు వీరందరినీ వెంటనే అరెస్టు చేయాలని అందులో పేర్కొన్నారు.
Delighted to see @kaziranga_ reopen after a 2-year gap & Congratulations to the creators of these lifelike Rhinos, rising from the ashes of horns. The horn is of real value to the Rhino & of imagined value to human beings! -Sg @himantabiswa @jayanta_malla https://t.co/tGaGoHFfJq
— Sadhguru (@SadhguruJV) September 25, 2022
విరుద్ధం
వన్యప్రాణుల పరిరక్షణ చట్టం నిబంధనలకు విరుద్దంగా వీరు పార్కులో సూర్యాస్తమయం తర్వాత సఫారీ యాత్ర చేసినట్లు సమాచారం. పార్కు సమీపంలోని గ్రామస్థులు బోకాఖాట్ పోలీస్ స్టేషన్‌లో ఈ మేరకు కేసు పెట్టారు. దీనిపై పోలీసులు కూడా స్పందించారు.
అటవీ శాఖ
ఈ వ్యవహారంపై అటవీ శాఖ అధికారులు స్పందించారు. కేసు పెట్టే హక్కు ప్రజలకు ఉందన్నారు. కానీ సీఎం అధికారిక కార్యక్రమంలో భాగంగానే సఫారీ యాత్రకు వెళ్లారని, ఇది నిబంధనలను అతిక్రమించినట్లు కాదని తాము భావిస్తున్నట్లు చెప్పారు. కొన్నిసార్లు సీఎం కార్యక్రమాలు ఆలస్యం అవుతాయన్నారు.
సీఎం రియాక్షన్
ఈ ఘటనపై సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. జాతీయ పార్కులోకి సూర్యాస్తమయం తర్వాత వెళ్లొద్దని చట్టంలో ఎక్కడా నిబంధన లేదన్నారు.
Also Read: Kullu Bus Accident: లోయలో పడిపోయిన టెంపో ట్రావెలర్- ఏడుగురు మృతి!
Also Read: Jacqueline Fernandez Bail: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు బెయిల్!