Kullu Bus Accident: లోయలో పడిపోయిన టెంపో ట్రావెలర్- ఏడుగురు మృతి!
Kullu Bus Accident: హిమాచల్ ప్రదేశ్‌లో ఓ టెంపో ట్రావెలర్ లోయల్ పడింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు.
Kullu Bus Accident: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పర్యటకులతో వెళుతున్న టెంపో ట్రావెలర్ కులు జిల్లాలోని బంజార్ సబ్ డివిజన్ సమీపంలో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. 10 మందికి గాయాలయ్యాయి.
ఇదీ జరిగింది
ఆదివారం రాత్రి 8.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కులులోని బంజార్ సబ్ డివిజన్ సమీపంలో వేగంగా వెళ్తోన్న టెంపో ట్రావెలర్ అదుపు తప్పి లోయలో పడింది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బాధితులంతా రాజస్థాన్, మధ్యప్రదేశ్, హరియాణా, దిల్లీ సహా పలు రాష్ట్రాలకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రధాని సంతాపం
ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
हिमाचल प्रदेश के कुल्लू में टूरिस्ट वाहन के खाई में गिरने की घटना अत्यंत दुखदायी है। इस दुर्घटना में जिन्होंने अपनों को खो दिया है, उनके परिजनों के प्रति मैं गहरी संवेदना प्रकट करता हूं। इसके साथ ही घायलों की हरसंभव मदद की जा रही है। उनके शीघ्र स्वस्थ होने की कामना करता हूं: PM
— PMO India (@PMOIndia) September 26, 2022
Also Read: Jacqueline Fernandez Bail: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు బెయిల్!
Also Read: Rajasthan Congress Crisis: రాజస్థాన్‌లో రాత్రికి రాత్రే హైడ్రామా- 90 మంది ఎమ్మెల్యేల రాజీనామా!