UP News : పిల్లలను బయటకు పంపించాలంటే ఇలాంటి వాళ్ల గురించి ఆలోచించాలి - యూపీలో చిన్నపిల్లపై దారణం - వీడియో
Viral News: యూపీలోని ఘజియాబాద్ లో చిన్న పిల్లపై లైంగిక దాడికి పాల్పడిన వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు. మరో సారి ఎవరూ అలాంటి పని చేయకుండా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Viral Video: గుడ్ టచ్ , బ్యాడ్ టచ్‌ల గురించి పిల్లలకు ఎప్పటికప్పుడు నేర్పుతూ ఉండాలి. లేకపోతే మానవ మృగాలు మన చుట్టూనే ఉంటాయి. వారు పిల్లలపై ఎలాంటి అఘాయిత్యం చేస్తారో .. చేస్తున్నారో తెలిస్తే.. షాక్ కు గురవుతారు. మృగాల ప్రపంచంలో పిల్లలకు రక్షణ ఎలా కల్పించాలా అని వేదనకు గురవుతాం. అలాంటి ఘటన యూపీలోని ఘజియాబాద్‌లో జరిగింది.
ఘజియాబాద్‌లో ఓ స్ట్రీట్ వెండర్ .. తన బండిపై వస్తువులు ఏవో అమ్ముతున్నాడు. అతని బండి దగ్గరకు పదేళ్ల చిన్న పిల్ల వచ్చింది. అంతే ఆ స్ట్రీట్ వెండర్ లోని కామాంధుడు బయటకు వచ్చాడు. ఆ పిల్లకు వస్తువుల విషయంలో సాయం చేస్తున్నట్లుగా నటిస్తూ.. ఎక్కడ పడితే అక్కడ అసభ్యంగా తాకాడు. ఈ వీడియో రికార్డు కావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
हर जगह नरभक्षी बैठे हैं, छोटी छोटी बच्चियों को कहां न भेजा जाए? स्कूल-मार्केट हर जगह हवसी बैठे हैं।
— Anuj Agnihotri Swatntra (@ASwatntra) April 15, 2025
देखिए यह वीडियो गाजियाबाद का जहां ११ साल की अबोध बच्ची मार्केट गई थी जहां बाप नहीं बाबा की उम्र का आदमी उसके साथ छेड़छाड़ कर रहा है। pic.twitter.com/TUWeBkJRWO
ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. అతడు ఎవరో గుర్తు పట్టి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అతను ఇంకెవరిపై అయినా ఇలాంటి ఘాతుకాలకు పాల్పడ్డాడేమో అని విచారణ ప్రారంభించారు. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలలపై ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడేవారికి బతికి ఉండే అర్హత లేదని స్పందిస్తున్నారు.
In #Ghaziabad district of #UttarPradesh, an 11-year-old girl went to a street vendor to buy some goods.
— Hate Detector 🔍 (@HateDetectors) April 15, 2025
The seller Jagdish molested the girl and touched her private parts. The accused Jagdish has been arrested. pic.twitter.com/kNpm7kmGVh
పట్టపగలు ఇలా నడి రోడ్డుపై చిన్నారిపై లైంగిక దాడి కి పాల్పడుతున్నారంటే.. చట్టాలపై ఏ మాత్రం భయం లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Be done with him. You just alerted him. Next time he won’t do it in broad daylight but assault a child within closed doors. And it will be worse than this. End him. The minute you touch a child, you are redundant to society. You proved you are too sick to be in society. Be done…
— Satyana Dev Aarya (@satyanadevaarya) April 15, 2025
మరో వ్యక్తి అలా చేయడానికి భయపడేలా శిక్షించాలన్న డిమాండ్ అన్ని వర్గాల నుంచి వస్తోంది.





















