PM Modi France Visit: మోదీని సర్‌ప్రైజ్ చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు, వెల్‌కమ్ అంటూ హిందీలో ట్వీట్
PM Modi France Visit: ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మేక్రాన్ ప్రధాని నరేంద్ర మోదీకి హిందీ ట్వీట్‌తో వెల్‌కమ్ చెప్పారు.
PM Modi France Visit:
ఘన స్వాగతం..
ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికారు అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్. ఫ్రాన్స్‌కి స్వాగతం అంటూ హిందీలో ట్వీట్ చేశారు. పారిస్‌కి వచ్చిన మోదీని ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. ఫ్రెంచ్ నేషనల్ డే వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. భారత్, ఫ్రాన్స్ మధ్య ద్వైపాక్షిక బంధాలకు పాతికేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ పర్యటనను చాలా కీలకంగా భావిస్తున్నాయి రెండు దేశాలు. ఈ క్రమంలోనే మేక్రాన్ ఆసక్తికర ట్వీట్ చేశారు.
"భారత్ ఫ్రాన్స్ మధ్య ద్పైపాక్షిక బంధాలు బలపడి పాతికేళ్లు అవుతోంది. ఇప్పటికీ అదే విశ్వాసంతో పరస్పరం సహకరించుకుంటున్నాయి. భవిష్యత్‌లో ఈ బంధం మరింత బలోపేతం అవుతుంది. నరేంద్ర మోదీజీ వెల్‌కమ్ టు ప్యారిస్"
- ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు
भारत और फ्रांस 25 साल की रणनीतिक साझेदारी तथा विश्वास और दोस्ती के सदैव मजबूत बंधन का जश्न मना रहे हैं।
— Emmanuel Macron (@EmmanuelMacron) July 14, 2023
प्रिय @NarendraModi, पैरिस में हार्दिक स्वागत! pic.twitter.com/sUoSmdfnw8
అరుదైన గౌరవం..
ప్రధాని నరేంద్ర మోదీకి ఫ్రాన్స్‌లో అడుగు పెట్టిన వెంటనే ఆయనకు మిలిటరీ స్థాయిలో స్వాగతం లభించింది. ఇలాంటి అరుదైన గౌరవం పొందిన తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌తో పాటు ఆయన సతీమణి మోదీని ఆహ్వానించారు. స్పెషల్ డిన్నర్ కూడా ఏర్పాటు చేశారు. డిన్నర్‌కి ముందు ప్రధాని మోదీ అక్కడి ఇండియన్ కమ్యూనిటీని ఉద్దేశిస్తూ మాట్లాడారు. ఆ తరవాత ఫ్రాన్స్‌తో UPI డీల్ ప్రకటించారు. అంటే...ఇకపై ఫ్రాన్స్‌లోనూ UPI చెల్లింపులు అందుబాటులోకి వస్తాయి. ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లే ఇండియన్ టూరిస్ట్‌లు ఇకపై UPI చెల్లింపులు చేసుకోవచ్చని స్పష్టం చేశారు మోదీ. ఆయన ప్రసంగిస్తుండగా అక్కడి ప్రజలు మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు.
#WATCH | When I hear 'Bharat Mata Ki Jai' abroad, I feel I have come home, says PM Modi as he begins his address in Paris pic.twitter.com/HdjXgLJhXz
— ANI (@ANI) July 13, 2023
ఫ్రాన్స్‌కి బయల్దేరే ముందు ప్రధాని మోదీ కీలక విషయాలు వెల్లడించారు. ఇరు దేశాల మధ్య మైత్రిని మరింత బలోపేతం చేసేందుకు చర్చలు జరపనున్నట్టు స్పష్టం చేశారు. భారత్, ఫ్రాన్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మోదీ ఫ్రాన్స్‌కి వెళ్లారు.
"భారత్ ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఈ ఏడాదితో పాతికేళ్లు. రెండు దేశాల మధ్య మైత్రి కుదిరింది. పలు విషయాల్లో ఇరు దేశాలూ కట్టుబడి ఉంటున్నాయి. ముఖ్యంగా డిఫెన్స్, స్పేస్, సివిల్ న్యూక్లియర్ రంగాలతో పాటు వాణిజ్యం, పెట్టుబడుల, విద్యా రంగాల్లోనూ భాగస్వామ్యం కుదిరింది. స్థానిక సమస్యలను పరిష్కరించడంతో పాటు అంతర్జాతీయ సవాళ్లు అధిగమించేందుకు ఇరు దేశాలూ కలిసి కృషి చేస్తున్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌ని కలిసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. వచ్చే పాతికేళ్లలో ఇరు దేశాల మధ్య బంధం ఎలా ఉండాలో నిర్ణయించనున్నాం
- ప్రధాని మోదీ
Also Read: Chandrayaan 3 Launch: డబ్బులు ఆదా చేయడంలో ఇస్రో నంబర్ వన్, నాసానే ఆశ్చర్యపరుస్తున్న స్ట్రాటెజీ