కాంగ్రెస్ హయాంలో స్కామ్‌లు, బాంబు పేలుళ్లు తప్ప ఏమీ జరగలేదు - ప్రధాని మోదీ విమర్శలు
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
PM Modi Slams Congress: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్‌ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. రాజస్థాన్‌లో జరిగిన Viksit Bharat Viksit Rajasthan కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న ఆయన 2014 ముందు భారత్ దారుణమైన స్థితిలో ఉండేదని విమర్శించారు. బాంబు పేలుళ్లు, స్కామ్‌లు తప్ప కాంగ్రెస్ హయాంలో జరిగింది ఏమీ లేదని మండి పడ్డారు. ఆ పార్టీకి దూరదృష్టి లేకపోవడం వల్లే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని తేల్చి చెప్పారు. ఒక్కటంటే ఒక్కటి కూడా ఓ సానుకూలమైన పథకాన్ని ఆ పార్టీ తీసుకురాలేకపోయిందని అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో దేశవ్యాప్తంగా విద్యుత్‌కి లోటు ఉండేదని విమర్శించారు. రాజస్థాన్‌కి కాంగ్రెస్ ఇచ్చిన దానికన్నా ఆరు రెట్లు ఎక్కువగా బీజేపీ ఇచ్చిందని వెల్లడించారు. ఇటీవలే UAE పర్యటన ముగించి వచ్చిన ప్రధాని మోదీ ఆ అంశాన్నీ ప్రస్తావించారు. విదేశాలు కూడా భారత్‌ని బలంగా విశ్వసిస్తున్నాయని స్పష్టం చేశారు.
"దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఇన్నాళ్లకు భారత్ అభివృద్ధిని చూస్తోంది. పదేళ్ల క్రితం భారత్ చాలా విషయాల్లో వెనకబడి ఉంది. కానీ...ఇప్పుడు రోజులు మారిపోయాయి. రోజురోజుకీ దేశం ముందుకు దూసుకెళ్తోంది. 2014కి ముందు దేశంలో స్కామ్‌లు, బాంబు పేలుళ్ల గురించి తప్ప మరే చర్చ ఉండేది కాదు. అసలు ఏమవుతుందోనని ప్రజలంతా ఆందోళన చెందారు"
- ప్రధాని నరేంద్ర మోదీ
#WATCH | PM Narendra Modi says, " After independence, today this golden period has come. India has got this opportunity to leave behind all the disappointments from 10 years ago. India is moving forward now with confidence. Before 2014, there used to be only discussions of scams… pic.twitter.com/2yHy0c5r39
— ANI (@ANI) February 16, 2024
తనను తిట్టడం తప్ప కాంగ్రెస్ పార్టీకి మరో ఎజెండా లేదని విమర్శించారు ప్రధాని మోదీ. వికసిత్ భారత్ పేరు పలకడానికి కూడా ఆ పార్టీ నేతలకు నోరు రాదని, కేవలం తాను ఇందుకోసం కృషి చేస్తున్నానన్న అక్కసుతోనే విమర్శలు చేస్తుంటారని తేల్చి చెప్పారు. మేడ్ ఇన్ ఇండియా నినాదానికీ వాళ్లు మద్దతునివ్వరని అసహనం వ్యక్తం చేశారు.
"కాంగ్రెస్‌కి ఉన్నది ఒకటే ఎజెండా. మోదీని తిట్టడమే వాళ్ల పని. వికసిత్ భారత్ అనే పేరు కూడా వాళ్లు పలకరు. మోదీ అందుకోసమే పని చేస్తున్నాడని అక్కసు. వోకల్ ఫర్ లోకల్, మేడిన్ ఇండియా నినాదాలకూ వాళ్లు మద్దతునివ్వరు. మోదీ ఏం చేసినా దాన్ని వ్యతిరేకించడమే కాంగ్రెస్ పని. మోదీ విరోధ్, ఘోర్ మోదీ విరోధ్ అనే ఎజెండాతోనే పని చేస్తున్నారు. అందుకే పార్టీలోని కీలక నేతలంతా వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం ఒక్క కుటుంబమే మిగిలిపోయింది"
- ప్రధాని నరేంద్ర మోదీ
#WATCH | PM Narendra Modi says, " ...Congress has only one agenda, to abuse Modi...they don't even take the name of Vikshit Bharat because Modi works for it, They don't support 'Made in India' and 'Vocal for Local' because Modi supports it...Whatever Modi does, they will do the… pic.twitter.com/9RGjakgWle
— ANI (@ANI) February 16, 2024