Pervez Musharraf Death:పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ మృతి, దుబాయ్‌లోని ఆసుపత్రిలో కన్నుమూత
Pervez Musharraf Death: పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ మృతి చెందారు.
Pervez Musharraf Death:
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ (79) మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన UAEలోని అమెరికన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్ను మూశారు. ఆయన కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కొద్ది వారాలుగా ఆయన ఆరోగ్యం విషమించిందని వివరించారు. గతంలోనూ ఓ సారి ఆయన చనిపోయినట్టు వార్తలొచ్చాయి. అయితే ఆ తరవాత అవన్నీ పుకార్లేనని తేలింది. ఇప్పుడు పాకిస్థాన్ మీడియా అధికారికంగా ఆయన చనిపోయినట్టు ప్రకటించింది. పాకిస్థాన్‌కు పదో అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు ముషారఫ్. 1998 నుంచి 2001 వరకూ ఈ పదవిలో కొనసాగారు. 1998 నుంచి 2007 వరకూ టాప్ జనరల్‌గానూ బాధ్యతలు చేపట్టారు. 1943 ఆగస్టు 11న ఢిల్లీలో జన్మించిన ముషారఫ్...కరాచీలో చదువుకున్నారు. లాహోర్‌లోని ఫర్మాన్ క్రిస్టియన్ కాలేజ్‌లో ఉన్నత విద్యనభ్యసించారు.
Former President of Pakistan, General Pervez Musharraf (Retd) passes away after a prolonged illness, at a hospital in Dubai: Pakistan's Geo News pic.twitter.com/W1fGRVb6xZ
— ANI (@ANI) February 5, 2023