Pakistani TV show: అటాక్ చేయాలనే ఆలోచన భారత్‌కు లేదు, పాక్ నేతలు ఇది అర్థం చేసుకోవాలి - వైరల్ వీడియో
Pakistani TV show: పాకిస్థాన్ టీవీ ఛానల్‌లో ఇండియా గురించి ఓ ఎక్స్‌పర్ట్ మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది.
Pakistani TV show:
ఎక్స్‌పర్ట్ వ్యాఖ్యలు..
పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం ఎంత దారుణంగా ఉందో చూస్తూనే ఉన్నాం. గోధుమ పిండి కోసం కూడా కొట్టుకుంటున్నారు అక్కడి ప్రజలు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర వీడియో వెలుగులోకి వచ్చింది. వైరల్ అవుతోంది కూడా. పాక్‌లోని ఓ టీవీ ఛానల్‌లో నిపుణులు అక్కడి పరిస్థితుల గురించి మాట్లాడుతూ భారత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోజురోజుకీ భారత్ శక్తిమంతం అవుతోందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో పాక్‌పై దాడి చేసి అధీనంలోకి తీసుకోవచ్చని అన్నారు. కానీ...ఇండియాకు అలాంటి ఆలోచన లేదని కితాబునిచ్చారు. కొంత మంది పాక్ నేతలు ఇండియాను అణుబాంబుల పేరు చెబుతూ బెదిరిస్తున్నాయి. భారత్ కూడా అందుకు గట్టి బదులే ఇస్తోంది. ఇలాంటి కీలక తరుణంలో ఈ వీడియో వైరల్ అవుతోంది. జర్నలిస్ట్‌తో ఆ పొలిటికల్ అనలిస్ట్ ఇలా అన్నారు.
"పాక్‌లోనే పరిస్థితే భారత్‌లో ఉండి ఉంటే కచ్చితంగా పాకిస్థాన్ ఇండియాపై దాడి చేసేది. ఇప్పటికిప్పుడే ఆ దేశాన్ని సర్వనాశనం చేసేది. కశ్మీర్‌నూ లాక్కునేది. కానీ...ఇండియా మాత్రం ఇలా ఎప్పటికీ ఆలోచించదు. పాక్ రోజురోజుకీ దిగజారిపోతోంది. ఇండియా మాత్రం ఎదుగుతోంది. పాక్‌ను ఇలాంటి తరుణంలో పడగొట్టాలన్న దురాలోచన భారత్‌కు రానందుకు ముందుగా అభినందనలు చెప్పాలి. అక్కడి నేతలు ఎంతో గౌరవంగా నడుచుకుంటున్నారు. పాకిస్థాన్ నేతలు ఇది అర్థం చేసుకోవాలి"
- పాక్ ఎక్స్‌పర్ట్
#India could attack #Pakistan and can destroy it today: If Bharat were in such bad economic shape as Pakistan is now, we would have already attacked Bharat. But Bhartiya leaders are more honorable & not like us: political commentator Muqtedar Khan#PakistanEconomy #Truth #WakeUp pic.twitter.com/YVbUgKGT6N
— Debashish Sarkar 🇮🇳 (@DebashishHiTs) January 9, 2023
కశ్మీర్ సమస్యపై..
కశ్మీర్ సమస్యను కేంద్రం పరిష్కరించి మూడేళ్లు దాటుతున్నా..ఇంకా దానిపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కశ్మీర్ అంశంపై ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. 2021లోనే భారత్-పాక్ బంధం బలపడేందుకు అత్యున్నత స్థాయి సమావేశం జరిగిందని పాక్ సైన్యం వెల్లడించింది. ఇదే సమావేశంలో కశ్మీర్ సమస్య గురించీ చర్చించినట్టు చెప్పింది. అయితే...ఆ సమయంలో కశ్మీర్ సమస్యను చర్చించేందుకు పాక్ సైన్యం అంగీకరించలేదని తెలిసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) పైనా చర్చ జరిగినట్టు సమాచారం. ఇరు దేశాలకు చెందిన ఉన్నతాధికారులు ఆ భేటీలో ఉన్నారని చెబుతున్నారు. ABP Newsతో ప్రత్యేకంగా మాట్లాడిన పాక్ జర్నలిస్ట్ జావేద్ చౌదరి ఈ కీలక విషయాలు చెప్పారు. ఈ భేటీ జరిగిన సమయంలో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్ సమస్యపై చర్చిందేందుకు ఆసక్తి చూపలేదని, మధ్యలోనే డిస్కషన్‌ను ఆపేశారని చెప్పారు జావేద్. అప్పటి విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ సూచన మేరకు ఇమ్రాన్ ఈ విషయాన్ని దాటేశారని వెల్లడించారు. పాకిస్థాన్ ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశంలో ఉన్నారని తెలిపారు. పాకిస్థాన్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ ISI DG కూడా అక్కడే ఉన్నట్టు చెప్పారు. పాక్ ఆర్మీ...భారత్‌తో సంబంధాన్ని మెరుగు పరుచుకునేందుకు ప్రయత్నించిందని అన్నారు.
Also Read: Aravana Payasam Sabarimala: అయ్యప్ప ప్రసాదంలో పురుగు మందుల అవశేషాలు, పంపిణీ ఆపేయాలన్న కేరళ హైకోర్టు