అన్వేషించండి

పబ్‌జీలో పరిచయమైన కుర్రాడితో ప్రేమ, నలుగురు పిల్లలతో సహా ఇండియాకి వచ్చిన పాక్ మహిళ

Pakistan Woman: పబ్‌జీలో పరిచయమైన కుర్రాడిని ప్రేమించిన పాక్ మహిళ నోయిడాకి పిల్లలతో సహా వచ్చేసింది.

Pakistan Woman:

పబ్‌జీ ప్రేమ..

పబ్‌జీ (PUBG) ద్వారా పరిచయమైన నోయిడా కుర్రాడితో ప్రేమలో పడింది పాకిస్థాన్‌ మహిళ. అప్పటికే ఆమెకి పెళ్లై నలుగురు పిల్లలున్నారు. అయినా...ఆ కుర్రాడే కావాలని పట్టు పట్టింది. ఎలాగైనా అతనితోనే కలిసి బతకాలని నిర్ణయించుకుంది. నలుగురు పిల్లలతో పాటు బార్డర్ దాటి మరీ గ్రేటర్ నోయిడాకి వచ్చింది. అక్కడే ఓ ఏరియాలో ఇల్లు అద్దెకు తీసుకుని ఇద్దరూ చాలా రోజులుగా కలిసి ఉంటున్నారు. నేపాల్ మీదుగా ఆ మహిళ ఇండియాకు వచ్చింది. ఇద్దరికీ పెళ్లైందని అబద్ధం చెప్పి ఇల్లు రెంట్‌కి తీసుకున్నారు. రహస్యం బయట పడగానే అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఏడాది మే నెలలో ఆ మహిళ ఇండియాకి వచ్చినట్టు తెలుస్తోంది. రబూపురకు చెందిన సచిన్‌తో పబ్‌జీకి అడిక్ట్ అయ్యాడు. అలా ఆడే క్రమంలోనే పాకిస్థాన్‌ మహిళతో పరిచయమైంది. తరచూ మాట్లాడుకునే వాళ్లు. ఆ చనువు కాస్తా ప్రేమగా మారింది. "నువ్వు లేక నేను లేను" అనే రేంజ్‌లో ప్రేమలో కూరుకుపోయారు. మే 13న ఆ పాకిస్థాన్ మహిళ ఇల్లు వదిలి వచ్చేయాలని ఫిక్స్ అయింది. అనుకున్న వెంటనే నలుగురు పిల్లల్ని తీసుకుని బార్డర్ దాటి ఇండియాకు వచ్చేసింది. గ్రేటర్ నోయిడాలోనే సచిన్‌తో పాటు కొన్నాళ్లుగా సహజీవనం చేస్తోంది. ఈ విషయం బయటపడడం వల్ల పరారయ్యారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఇద్దరి కోసం గాలించారు. అక్రమంగా దేశంలోకి వచ్చిన ఆమెపై చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. మూడు టీమ్స్ వాళ్ల కోసం గాలించాయి. CCTV ఫుటేజ్‌లు పరిశీలించాయి. మొత్తానికి ఆ మహిళ పోలీసుల కంట పడింది. దర్యాప్తు సంస్థలూ ఈ కేసుని టేకప్ చేశాయి. ఆ మహిళ పేరు సీమ గులాం హైదర్‌గా తెలుస్తోంది. పబ్‌జీ ద్వారా సచిన్‌తో పరిచయమైందని ఆమె పోలీసులకు చెప్పింది. ఈ కేసుకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

గతేడాది మరో ప్రేమ కథ..

కలిజా నూర్ అనే యువతి పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్‌లో ఉంటుంది. ఆమెకు ఆన్‌లైన్‌లో అహ్మద్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అహ్మద్   హైదరబాద్ యువకుడు. సౌదీలో ఒక హోటల్‌లో పనిచేస్తూంటాడు. ఆన్‌లైన్‌లో కలిజానూర్‌తో చాటింగ్ చేసేవాడు. తర్వాత  పరిచయం బాగా పెరిగి ప్రేమించుకున్నారు. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్నారు.  ఇందు కోసం అవసరమైన నకిలీ పత్రాలను రెడీ చేసుకున్నాడు.  తనతో కలిసి పనిచేసే నేపాలీ స్నేహితుల సాయంతో యువతిని భారత్‌కు తీసుకొచ్చే ప్లాన్ వేశాడు.ఈ ప్లాన్ ప్రకారం, దుబాయ్ నుంచి నేపాల్ వచ్చిన నూర్.. అక్కడ జీవన్ అనే వ్యక్తితోపాటు అహ్మద్ సోదరుడు మహమూద్‌ను కలిసింది. అనంతరం ముగ్గురూ కలిసి నూర్‌ను భారత్‌ తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. అయితే  ఇండో-నేపాల్ బోర్డర్ పోలీసులకు అనుమానం వచ్చింది.కలిజా నూర్ వద్ద ఉన్న ధ్రువపత్రాలు నిశితంగా పరిశీలించి విచారించారు.  నకిలీవని తేలడంతో.. ఆమె పాక్ గూఢచారేమో అని అనుమానించారు. దాంతో నూర్‌తోపాటు జీవన్, అహ్మద్‌ను కూడా కస్టడీలోకి తీసుకొని విచారించారు. విచారణలో.. తను ప్రేమించిన వాడి కోసం నూర్ ఇంతటి సాహసం చేసిందని గుర్తించారు. అయితే అక్రమంగా బోర్డర్ దాటడం నేరం కాబట్టి.. ముగ్గురినీ స్థానిక పోలీసులకు అప్పగించారు. 

Also Read: బ్రేకప్ చెప్పిందని గర్ల్‌ఫ్రెండ్‌ని చంపేసిన టీనేజర్, గన్‌తో ఐదు రౌండ్ల కాల్పులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Fuel Filling Tips: బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Fuel Filling Tips: బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Google Chrome AI Mode: గూగుల్ సెర్చ్‌లో ఏఐ మోడ్ - ఛాట్‌జీపీటీ పోటీని తట్టుకోవడానికి!
గూగుల్ సెర్చ్‌లో ఏఐ మోడ్ - ఛాట్‌జీపీటీ పోటీని తట్టుకోవడానికి!
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
UPSC Civils Interview: సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ షెడ్యూలు విడుదల - తేదీలు, సమయం ఇవే
సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ షెడ్యూలు విడుదల - తేదీలు, సమయం ఇవే
Bajaj Chetak 35: కొత్త బజాజ్ చేతక్ 35 సిరీస్ వచ్చేసింది - ధర ఎంతంటే?
కొత్త బజాజ్ చేతక్ 35 సిరీస్ వచ్చేసింది - ధర ఎంతంటే?
Embed widget