Pakistan: పాకిస్తాన్ టెరిటోరియల్ ఆర్మీ ఉగ్రవాదులే - పార్లమెంట్‌లోనే పాక్ రక్షణ మంత్రి ఎంత పద్దతిగా చెప్పుడో !
Pakistan defense minister: మదర్సాల్లో ట్రైనింగ్ అవుతున్న వారిని యుద్ధరంగంలోకి దింపుతామని పాక్ రక్షణ మంతి చెప్పారు. వాస్తవంగా వారంతా ఉగ్రవాద శిక్షణ పొందుతున్న వారే.

India Pak battlefield: పాకిస్తాన్ దుందుడుకు చర్యలకు సిద్ధమైతే యుద్ధానికి సిద్ధం కావాలని భారత్ నిర్ణయించుకుంది. అందుకే టెరిటోరియల్ ఆర్మీని కూడా సిద్ధం చేసుకుంటోంది. పాకిస్తాన్ ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. తమ టెరిటోరియల్ ఆర్మీని కూడా రంగంలోకి తెస్తామని ప్రకటించింది. అయితే వీరికి టెరిటోరియల్ ఆర్మీ వ్యవస్థ లేదు. మరి ఎవర్ని యాక్టివేట్ చేస్తారు. ఇంకెవర్ని ఉగ్రవాదుల్నే.
Pakistan Defence Minister says, If necessary, we will use the children of madrasa for war, they are our second line of defence.
— Megh Updates 🚨™ (@MeghUpdates) May 9, 2025
PS: Many Terror training camps are operated in guise of Madrassas in Pakistan pic.twitter.com/uRjnP8Supr
యుద్ధం వస్తే ఆర్మీకి తోడుగా మదర్సాల్లో శిక్షణ పొందుతున్న వారిని పంపిస్తామని పాక్ రక్షణ మంత్రి పార్లమెంట్ లో తెలిపారు. వారు ఆర్మీకి సెకండ్ లేయర్ అని చెప్పుకొచ్చారు. అంటే వీరే పాకిస్తాన్ టెరిటోరియల్ ఆర్మీ అనుకోవచ్చు.
Islamabad, Pakistan: Pakistan's Defence Minister made a controversial statement, asserting that if necessary, the children of madrassas would be used as part of the country’s second line of defense. This comes amidst ongoing tensions in the region. It is widely acknowledged that…
— Amrita mishra (काशी वाली ) (@Amrita_2121) May 9, 2025
పాకిస్తాన్ మదర్సాల్లో ఇచ్చేది ఉగ్రవాదులకు శిక్షణ అనే ఆరోపణలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్టులకు పాకిస్తాన్ కేంద్రంగా మారింది. టెర్రరిస్టులకు శిక్షణ , బుర్ర నిండా మతం ఎక్కించేది ఈ మదర్సాల్లోనే. ఇటీవల భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ దాడులు కూడా మదర్సాలపైనే జరిగాయి. అక్కడ టెర్రరిస్టులు పెద్ద ఎత్తున చనిపోయారు. ఫోటో సాక్ష్యాలు కూడా వచ్చాయి. ఇప్పుడు అలాంటి వారినే ఆర్మీకి ఉపయోగించుకుంటామని పాక్ రక్షణ మంత్రి చెబుతున్నారు.
Khawaja Asif, Pakistan’s Defence Minister, can’t decide how to cover up the Pakistan Army’s incompetence. This is also a blow to Pakistan apologists who were busy providing cover for the jihadi state—both Indian and foreign commentators—many of whom are funded by Pakistan’s deep… pic.twitter.com/yOGBUv4snH
— Amit Malviya (@amitmalviya) May 9, 2025
పాక్ ఆక్రమిత కశ్మీర్ నిండా ఉగ్రవాదులే ఉన్నారు. ఆప్ఘన్ సరిహద్దుల్లోనూ ఉన్నారు. తాలిబన్లకు ఒకప్పుడు పాకిస్తాన్ భారీగా ఆశ్రయమిచ్చేది. కానీ ఇప్పుడు ఆ తాలిబన్లు వ్యతిరేకమయ్యారు. పాకిస్తాన్ సైన్యంపైనే దాడి చేస్తున్నారు. ఈ కోపంతో ఇటీవల తమ దేశంలో ఉన్న ఆప్ఘనిస్తాన్ వాసులందర్నీ పాకిస్తాన్ బయటకు గెంటేసింది. అయితే ఇంకా అనేక మంది పాకిస్తాన్ లోనే ఉన్నారు.





















