H3N2 Virus: అసోంలోనూ ఫ్లూ కేసు నమోదు, మాస్క్‌లు పెట్టుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు
H3N2 Virus: అసోంలోనూ ఓ H3N2 కేసు నమోదైంది.
H3N2 Virus in Assam:
అలెర్ట్..
దేశవ్యాప్తంగా ఫ్లూ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పంజాబ్, గుజరాత్, ఒడిశాలో కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రమైన అసోంలోనూ H3N2 కేసు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. అసోం ఆరోగ్య విభాగం అధికారికంగా ప్రకటించింది. అప్రమత్తమైన అధికారులు బహిరంగ ప్రదేశాల్లో అందరూ మాస్క్‌లు ధరించాలని సూచించారు. రాష్ట్రంలోని ఫ్లూ వ్యాప్తిపై ప్రత్యేక దృష్టి సారించినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. Integrated Disease Surveillance Programme (IDSP)నెట్‌వర్క్‌లో భాగంగా అన్ని జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేసింది. ఈ సవాలుని ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం సహా ICMR ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకుంటామని తెలిపింది. ప్రస్తుతానికి కేవలం ఒక్క కేసు మాత్రమే నమోదైందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ప్రస్తుతానికి ప్రభావం తక్కువగానే ఉందని, పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అటు కేంద్రం కూడా ఇప్పటికే అన్ని రాష్ట్రాలనూ అప్రమత్తం చేసింది.
One case of H3N2 has been found in Assam as on March 15: Health dept Assam pic.twitter.com/a7qhNIcQ8x
— ANI (@ANI) March 15, 2023
ప్రాణాంతకం కాదు..!
H3N2 Influenza వ్యాప్తి చెందుతోంది. సోకడమే కాదు. ఇద్దరి ప్రాణాలు బలి తీసుకుంది కూడా. కర్ణాటకలో ఓ వృద్ధుడు, హరియాణాలో ఓ వ్యక్తి ఈ వైరస్ సోకి మృతి చెందారు. ఒక్కసారిగా దేశమంతా ఈ మరణాలతో ఉలిక్కి పడింది. ఇది కూడా కరోనాలాగే పీడిస్తుందా అన్న అనుమానాలు, భయాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా ప్యాండెమిక్లాగే ఇది కూడా చాలా రోజుల పాటు మనల్ని వేధిస్తుందా అని కంగారు పడిపోతున్నారంతా. ఈ వైరస్ వ్యాప్తిపై అన్ని రాష్ట్రాలనూ కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ICMR కూడా కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. అటు నిపుణులు కూడా ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తున్నారు. కొందరు కీలక ప్రకటనలు చేశారు. ఇప్పటికైతే ఇన్ఫ్లుయెంజా కేసుల్లో పెరుగుదల సాధారణంగానే ఉందని వెల్లడించారు. ఢిల్లీలోని గంగారాం హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ ధిరెన్ గుప్త కూడా ఇదే విషయం చెప్పారు. గత రెండేళ్లుగా కరోనా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇన్ఫ్లుయెంజా వైరస్ వ్యాప్తి చెందలేదని అన్నారు. అయితే...సాధారణంగా ఈ వైరస్ ప్రాణాలు తీసేంత ప్రమాదకరమైంది కాదని వివరించారు. పిల్లల్లోనూ ఈ వైరస్ వ్యాప్తి చెందకపోవడానికి కారణం..కరోనా జాగ్రత్తలు పాటించడమేనని స్పష్టం చేశారు. ఇప్పుడు క్రమంగా ఈ జాగ్రత్తల్ని పక్కన పెట్టేశారని, అందుకే ఈ వైరస్ దాడి చేయడం మొదలు పెట్టిందని అన్నారు."H3N2 వైరస్‌లో మ్యుటేషన్లు స్వల్పంగానే ఉంటాయి. ఇవి ప్రాణాంతకమైతే కాదు. ఇప్పటికే దీర్ఘకాలిక రోగాలతో బాధ పడే వారికి మాత్రం కాస్త ముప్పు ఉంటుంది. మృతుల్లో వీరే ఎక్కువగా ఉంటారు. మరో విషయం ఏంటంటే. వ్యాక్సిన్ల ప్రభావం ఈ వైరస్‌పై తక్కువగానే ఉంటుంది. అందులోనూ ఈ ఏడాది మన దేశంలో వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉంది"
-డాక్టక్ ధిరేన్ గుప్త, ఢిల్లీ గంగారాం హాస్పిటల్
Also Read: H-1B Visa Holders: ఉద్యోగాలు కోల్పోయిన H-1B వీసాదారులకు ఊరట! గ్రేస్ పీరియడ్ పెంచనున్న అమెరికా?