By: Ram Manohar | Updated at : 03 Jun 2023 12:56 PM (IST)
ఒడిశా రూట్‌లో కవచ్ సిస్టమ్ లేకపోవడం వల్లే భారీ ప్రమాదం జరిగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. (Image Credits: Twitter)
Coromandel Train Accident:
సిగ్నలింగ్ సిస్టమ్ ఫెయిల్ అయిందా?
ఒడిశా రైల్వే ప్రమాదానికి కారణమేంటో పూర్తిస్థాయిలో విచారణకు కేంద్ర రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఓ అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికిప్పుడు కారణాలు చెప్పలేమని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం సిగ్నలింగ్ వ్యవస్థలో (Railway Signalling System) లోపాల వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తోంది. అంతే కాదు. ఇటీవలే కేంద్ర రైల్వే శాఖ ప్రమాదాలు నిలువరించేందుకు కొత్త వ్యవస్థ తీసుకొచ్చింది. అదే "కవచ్ సిస్టమ్" (Kavach System). ఇది పని చేయకపోవడం వల్లే ఈ స్థాయిలో ప్రాణనష్టం నమోదైందన్నది ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. దీనిపై ఇప్పటికే రైల్వే అధికారులు క్లారిటీ ఇచ్చారు. ప్రమాదం జరిగిన రూట్‌లో కవచ్ సిస్టమ్ లేదని వెల్లడించారు. ఈ వ్యవస్థ అందుబాటులో ఉండి ఉంటే...సమాచార లోపం తలెత్తేది కాదని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి.
ఏంటీ కవచ్ సిస్టమ్..?
గతేడాది మార్చిలో కేంద్ర రైల్వే శాఖ రైలు ప్రమాదాలు నిలువరించేందుకు కవచ్ సిస్టమ్‌ని ప్రవేశపెట్టింది. ఇదో ఆటోమెటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ATP) వ్యవస్థ. Research Design, Standards Organisation సంయుక్తంగా ఈ సిస్టమ్‌ని డిజైన్ చేశాయి. మూడు ఇండియన్ సంస్థలతో కలిసి తయారు చేశాయి. ఇది కేవలం లోకోమోటివ్ డ్రైవర్‌లను ప్రాణాపాయం నుంచి తప్పించడమే కాకుండా...స్పీడ్ కంట్రోలింగ్‌లో, డేంజర్ సిగ్నల్స్‌ని గమనించడంలోనూ తోడ్పడుతుంది. వాతావరణం సరిగ్గా లేని సమయాల్లోనూ విజిబిలిటీలో ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటుంది. గతేడాది కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్వయంగా ఈ కవచ్ సిస్టమ్‌ని పరీక్షించారు. ఎదురుగా ఏదైనా ట్రైన్ వచ్చినప్పుడు ఆటోమెటిక్‌గా సిగ్నల్ ఇచ్చి రైలు ఆగిపోయేలా ఈ సిస్టమ్‌ని తయారు చేశారు. ఈ ప్రయోగం సక్సెస్ అయిందని వెల్లడించారు అశ్వినీ వైష్ణవ్. ఓ వీడియో కూడా అప్పట్లో ట్విటర్‌లో పోస్ట్ చేశారు. "కవచ్ సిస్టమ్ టెస్టింగ్ విజయవంతమైంది. ఎదురుగా వచ్చే ట్రైన్‌ని గుర్తించి 380 మీటర్ల దూరంలోనే నేను ప్రయాణిస్తున్న ట్రైన్ ఆగిపోయింది" అని వెల్లడించారు. డ్రైవర్‌లు బ్రేక్ వేయడంలో నిర్లక్ష్యం వహించినా, పొరపాటున వేయకపోయినా వెంటనే ఈ కవచ్ సిస్టమ్ అలెర్ట్ అవుతుంది. ట్రైన్‌ని ప్రమాదం నుంచి బయట పడేస్తుంది. అయితే...ప్రస్తుతం ప్రమాదం జరిగిన రూట్‌లో ఈ కవచ్ సిస్టమ్ అందుబాటులో లేకపోవడం వల్ల భారీ ప్రాణనష్టం వాటిల్లింది.
Rear-end collision testing is successful.
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) March 4, 2022
Kavach automatically stopped the Loco before 380m of other Loco at the front.#BharatKaKavach pic.twitter.com/GNL7DJZL9F
ప్రమాదంలో దాదాపు వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. వాళ్లందరినీ ఆసుపత్రులకు తరలిస్తున్నారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సహాయక చర్యల్ని సమీక్షిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ఆయనతో మాట్లాడి ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఒడిశాలో ఇవాళ సంతాప దినం ప్రకటించారు.
Also Read: Train Travel Insurance: మీ కుటుంబాన్ని రోడ్డుపాలు చేయకండి, 45 పైసలకే ₹10 లక్షల ప్రయాణ బీమా
TS TET: తెలంగాణ 'టెట్' పేపర్-1లో 36.89 శాతం, పేపర్-2లో 15.30 శాతం ఉత్తీర్ణత
AFCAT 2023: ఏఎఫ్ క్యాట్ 2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
Army: ఇండియన్ ఆర్మీలో 139వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు, వివరాలు ఇలా
Crocodile: హైదరాబాద్ లో నాలాలో కొట్టుకువచ్చిన మొసలి, స్థానికుల భయాందోళన
Hyderabad Traffic Restrictions: గురువారం హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం, ట్రాఫిక్ ఆంక్షలు ఇలా
Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!
Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!
IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్ మాక్సీ! రాజ్‌కోట్ వన్డేలో టీమ్ఇండియా ఓటమి
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు షాకిచ్చిన కేంద్రం, సీబీఐ విచారణకు ఆదేశం
/body>