By: Ram Manohar | Updated at : 04 Jun 2023 05:51 PM (IST)
ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 275గా అధికారులు ధ్రువీకరించారు.
Coromandel Express Accident:
288 మంది మృతి
ఒడిశా ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్యపై స్పష్టత లేకపోవడం కన్‌ఫ్యూజన్‌కి దారి తీసింది. 288 మంది చనిపోయారని చాలా మంది ధ్రువీకరించారు. అయితే...అధికారులు మరణాల సంఖ్యలో క్లారిటీ ఇచ్చారు. డెత్ టోల్‌ని అప్‌డేట్ చేసి...275 మంది ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడించారు. అందరూ అనుకుంటున్నట్టుగా 288 మంది చనిపోలేదని వివరించారు. ఒడిశా చీఫ్ సెక్రటరీ ప్రదీప్ జేనా ఇదే విషయం తెలిపారు. కొన్ని మృతదేహాలను రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్ తలెత్తిందని స్పష్టం చేశారు.
"ఈ ప్రమాదంలో 275 మంది ప్రాణాలు కోల్పోయారు. అందరూ అనుకుంటున్నట్టుగా మృతుల సంఖ్య 288 కాదు. అధికారులతో మరోసారి చెక్ చేయించాం. కొన్ని మృతదేహాలను రెండుసార్లు లెక్కపెట్టారు. అందుకే సంఖ్య పెరిగింది. కానీ...వాస్తవంగా మృతుల సంఖ్య 275. వీరిలో 88 మంది ఐడెంటిటీని గుర్తించాం"
- ఒడిశా చీఫ్ సెక్రటరీ ప్రదీప్ జేన్
#WATCH | The death toll is 275 & not 288. The data was checked by DM and it was found that some bodies have been counted twice, so the death toll has been revised to 275. Out of 275, 88 bodies have been identified: Odisha Chief Secy Pradeep Jena, on #OdishaTrainAccident pic.twitter.com/fuPSSmNxag
— ANI (@ANI) June 4, 2023
మార్చురీలో ఉన్న డెడ్ బాడీస్‌కి DNA టెస్ట్‌లు కూడా చేస్తున్నట్టు ప్రదీప్ జేన్ వెల్లడించారు. స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీలో ఈ టెస్ట్‌లు జరుగుతున్నాయని వివరించారు. మొత్తం 1,175 మంది గాయపడ్డారని చెప్పిన ఆయన..వారిలో 793 మంది డిశ్చార్జ్ అయినట్టు తెలిపారు. ఇప్పటికే కొన్ని డెడ్‌బాడీస్ ఐడెంటిటీని గుర్తించి వాళ్ల కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇంకా గుర్తించాల్సిన డెడ్‌బాడీస్ చాలానే ఉన్నాయి.
Our State forensic science laboratory is also conducting DNA tests of all the bodies that are in mortuary, says Odisha Chief Secy Pradeep Jena, on #OdishaTrainAccident pic.twitter.com/qEv5aSrHGE
— ANI (@ANI) June 4, 2023
సుప్రీంకోర్టులో పిటిషన్..
ఒడిశా రైలు ప్రమాదంపై నిపుణులతో కమిటీ వేసి పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు మాజీ జడ్జ్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. అంతే కాదు. దేశవ్యాప్తంగా అన్ని రూట్లలోనూ కవచ్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజల ప్రాణాలను రక్షించాలని ఇందులో ప్రస్తావించారు. విశాల్ తివారి అనే ఓ న్యాయవాది ఈ పిటిషన్ వేశారు. Automatic Train Protection System కవచ్‌ని తక్షణమే అమలు చేసే విధంగా కేంద్రానికి మార్గదర్శకాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. నిపుణుల కమిటీతో విచారణ జరిపించాలని సుప్రీకోర్టుని విజ్ఞప్తి చేశారు.
Also Read: Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ
Asaduddin Owaisi: జైల్లో హ్యాపీగా చంద్రుడు! ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు, సీఎం జగన్‌పైనా సెటైర్లు
Chandrababu News: చంద్రబాబు పిటిషన్‌లపై విచారణ రేపటికి వాయిదా, సెలవులో ఏసీబీ కోర్టు జడ్జి
Supreme Court: సుప్రీంలో చంద్రబాబు, కవిత పిటిషన్ల విచారణలో మార్పు - ఇక రేపు లేదా వచ్చే వారమే!
Putta Madhu Padayatra: పాదయాత్రలో కంటతడి పెట్టిన పుట్ట మధు, బతికుండగానే చంపేస్తున్నారంటూ ఆవేదన
సెప్టెంబరు 29 నుంచి బీఫార్మసీ తరగతులు ప్రారంభం, జేఎన్‌టీయూ అకడమిక్ క్యాలెండర్ విడుదల
Paritala Sunitha: మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష భగ్నం, ఆస్పత్రికి తరలింపు
Kumbham Anil: BRSకు బై, కాంగ్రెస్‌కు హాయ్ చెప్పిన కుంభం అనిల్, 2 నెలల్లోనే సొంతగూటికి చేరడానికి కారణం ఏంటంటే?
AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్
Mangalavaram Movie Release : నవంబర్‌లో 'మంగళవారం' - 'ఆర్ఎక్స్ 100' కాంబో పాయల్, అజయ్ భూపతి సినిమా
/body>